OnePlus 15T| వన్‌ప్లస్ కంపెనీ తాజాగా చైనాలో వన్‌ప్లస్ 15T స్మార్ట్‌ఫోన్ అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ హార్డ్‌వేర్, 7,500mAh పెద్ద బ్యాటరీతో వచ్చింది. పెర్ఫామెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్, అడ్వాన్స్‌డ్ కెమెరా కావాలనుకునే యూజర్ల కోసమే ఈ కొత్త మోడల్ రూపొందించారు. కాంపాక్ట్ డిజైన్ అయినా హై-ఎండ్ ఫీచర్లు ఉండడంతో ప్రీమియం ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటుంది.
ఫోన్‌లో వివిధ రకాల వేరియంట్లు లభ్యం. బేస్ మోడల్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్‌తో చైనా కరెన్సీ CNY 4,299 (భారత కరెన్సీలో సుమారు రూ.58,400).
12GB ర్యామ్ + 512GB వేరియంట్ CNY 4,899 (సుమారు రూ.66,700).
16GB ర్యామ్ + 256GB CNY 4,599 (సుమారు రూ.62,700).
16GB ర్యామ్ + 512GB CNY 5,199 (సుమారు రూ.70,800).
టాప్ వేరియంట్ 16GB ర్యామ్ + 1TB స్టోరేజ్ CNY 5,699 (సుమారు రూ.77,800).
ఈ ఫోన్ మూడు కలర్ వేరియంట్స్.. హీలింగ్ వైట్ చాకలేట్, ప్యూర్ కొకోవా, రిలాక్సింగ్ మచా లో వస్తుంది.
వన్‌ప్లస్ 15Tలో 6.32 ఇంచ్ LTPO ఆమోలెడ్ డిస్‌ప్లే ఉంది. 1.5K రిజల్యూషన్ ఇస్తుంది. 165Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. TÜV రెయిన్ ల్యాండ్ సర్టిఫికేషన్‌తో కళ్లపై తక్కువ ఒత్తిడి కోసం చాలా తక్కువ బ్లూ లైట్ రిలీజ్ చేస్తుంది. స్మార్ట్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఫోన్ డిజైన్ స్లీక్‌గా ఉంది. బరువు 194 గ్రాములు మాత్రమే. మందం 8.48mm మాత్రమే కాబట్టి చేతిలో సులభంగా పట్టుకోవచ్చు.
వన్‌ప్లస్ 15T లేటెస్ట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది వేగవంతమైన పని, మల్టీ టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్‌ను సులభంగా చేస్తుంది. ఇందులోని కొత్త విండ్ చేజర్ గేమింగ్ కెర్నల్ గేమింగ్ పెర్ఫామెన్స్ మెరుగుపరుస్తుంది, హీట్‌ను నియంత్రిస్తుంది.
Also Read: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర డ్రోన్.. రెప్ప పాటులో శత్రువు నాశనం
వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సిస్టమ్ ఉంది. 50MP సోనీ అల్ట్రా విజన్ ప్రైమరీ సెన్సర్, 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. 3.5x ఆప్టికల్ జూమ్‌తో స్పష్టమైన ఫోటోలు తీయవచ్చు. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరా ఉంది. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది.
ఫోన్‌లో 7,500mAh గ్లేసియర్ బ్యాటరీ ఉంది. ఇది భారీ యూజ్ చేసేవారికి చాలా రోజులు ఉంటుంది. 100W సూపర్‌వూక్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఇలా త్వరగా చార్జ్ అయి ఎక్కువ సేపు ఉపయోగించవచ్చు.
ఈ కొత్త వన్‌ప్లస్ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ColorOS 16 ఇంటర్‌ఫేస్ స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. 5G, Wi-Fi, Bluetooth, NFC, USB Type-C వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ ఉంది.
వన్‌ప్లస్ 15T పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్, పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో గొప్ప ఫోన్. పవర్, స్టైల్ మరియు లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలనుకునేవారికి ఇది సరైన ఆప్షన్.