E-Paper
Advertisement

OnePlus Diwali Sale 2024 : వన్‌ప్లస్ ఏంటి బాస్ ఇంత చీప్ అయిపోయింది… ఇప్పుడు కొనకపోతే మరి ఎప్పటికీ కొనలేనట్టేనా!

OnePlus Diwali Sale 2024 : వన్‌ప్లస్ ఏంటి బాస్ ఇంత చీప్ అయిపోయింది… ఇప్పుడు కొనకపోతే మరి ఎప్పటికీ కొనలేనట్టేనా!
Advertisement

OnePlus Diwali Sale 2024 : దీవాళి సందర్భంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ ప్లస్ OnePlus Diwali Sale 2024 పేరుతో ప్రత్యేక సేల్‌ నిర్వహిస్తోంది. ఇక ఈ సేల్‌లో భాగంగా.. స్మార్ట్‌ ఫోన్స్, ఎయిర్‌పాడ్స్‌ తో పాటు పలు ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది.

దివాళీ సేల్ లో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలతో పాటు ఈ కామర్స్ సంస్థలు సైతం టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వన్ ప్లస్ సైతం తన మెుబైల్స్, ఇయర్ బడ్స్ పై భారీ తగ్గింపును అందిస్తూ సేల్ ను తీసుకువచ్చింది. వన్ ప్లస్ స్టోర్స్ తో పాటు రిలయన్స్ డిజిటల్‌, క్రోమా, విజయ్‌ సేల్స్‌, బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ సహా మరిన్ని స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్ నవంబర్‌ 5 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని వన్ ప్లస్ వెల్లడించింది.

Advertisement

ఇక OnePlus Diwali Sale 2024 లో వన్‌ప్లస్‌ నార్డ్‌ 4, వన్‌ప్లస్‌ 12R, వన్‌ప్లస్‌ ఓపెన్‌, వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 4, వన్‌ప్లస్‌ 12, సహా మరిన్ని మెుబైల్స్ ను డిస్కౌంట్ ధరలకు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే మెుబైల్స్ తో పాటు వన్‌ ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 3, వన్‌ ప్లస్‌ నార్డ్‌ బడ్స్‌ 3 ప్రో వంటి TWS ఎయిర్‌పాడ్స్‌ను సైతం భారీ డిస్కౌంట్స్ పై తక్కువ ధరకే కొనుగోలు చెయ్యెచ్చు. ఇందులో కొన్ని స్పెషల్ ఫీచర్స్ మెుబైల్స్ కూడా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

ALSO READ : వాట్సాప్ వెబ్ లో కొత్త ఫీచర్.. ఇకపై ప్రైమరీ ఎకౌంట్ తో పనేలేదు బాస్

Advertisement

OnePlus 12R : ఈ స్మార్ట్‌ ఫోన్ ను వన్ ప్లాస్ ఎంతో గ్రాండ్ గా లాంఛ్ చేసింది. స్పెషల్ ఫీచర్స్ తో తీసుకువచ్చింది. 6.78 అంగుళాల డిస్‌ప్లే, డాల్బీ విజన్‌ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్‌ విక్టస్‌ 2 ప్రెటెక్షన్, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత OxygenOS 14, స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 2 SoC చిప్‌సెట్‌ తో లాంఛ్ అయింది. 8GB RAM + 128GB స్టోరేజీ, 8GB RAM + 256GB స్టోరేజీ, 12GB RAM + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

కెమెరా క్వాలిటీ సైతం హై రేంజ్ లో ఉంది. ఇందులో 50MP OIS, 8MP, 2MP, 16MP సెల్ఫీ కెమెరాలతో అందుబాటులో ఉన్నాయి. 5500mAh బ్యాటరీ, 100W SuperVOOC ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డులతో రూ.3000 డిస్కౌంట్‌, 6 నెలల పాటు నోకాస్ట్ EMI సదుపాయం సైతం అందిస్తుంది.

OnePlus Nord 4 : వన్‌ప్లస్ నార్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌ పై దీపావళి సేల్‌లో భాగంగా… గరిష్ఠంగా రూ.2వేల వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. 9 నెలల వరకు నో కాస్ట్ EMI సదుపాయాన్ని కల్పిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్స్  ను వన్‌ ప్లస్ వెబ్‌సైట్స్, వన్‌ప్లస్ స్టోర్స్, అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

OnePlus Nord CE 4 Lite : ఈ వన్‌ప్లస్‌ నార్డ్ CE 4 లైట్‌ హ్యాండ్‌సెట్‌పై రూ.2500 స్పెషల్‌ డిస్కౌంట్‌ను పొందే అవకాశం ఉంది.

OnePlus Earbuds : ఈ ఫెస్టివల్ సేల్ లో వన్‌ ప్లస్‌ ఇయర్ బడ్స్ ను సైతం ఆఫర్ లో పొందే అవకాశం ఉంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ బడ్స్ 3, వన్‌ప్లస్‌ నార్డ్ బడ్స్‌ 3 ప్రో ఇయర్‌బడ్స్ కొనుగోళుపై రూ.200 నుంచి రూ.300 తగ్గింపును పొందే అవకాశం ఉంది. ఇక నార్డ్ బడ్స్ 3 ప్రో పై సైతం రూ.500 వరకూ తగ్గింపును వన్ ప్లస్ అందిస్తుంది.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×