BigTV English

Whats App Web Contact Saving : వాట్సాప్ వెబ్ లో కొత్త ఫీచర్.. ఇకపై ప్రైమరీ ఎకౌంట్ తో పనేలేదు బాస్

Whats App Web Contact Saving : వాట్సాప్ వెబ్ లో కొత్త ఫీచర్.. ఇకపై ప్రైమరీ ఎకౌంట్ తో పనేలేదు బాస్

Whats App Web Contact Saving : ఎప్పటికప్పుడు తన కస్టమర్స్ కోసం సరికొత్త అప్డేట్స్ తీసుకువచ్చే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పేసింది. వాట్సాప్ వెబ్ వాడే వినియోగదారులు ఇకపై కాంటాక్ట్ సేవ్ చేయాలంటే ప్రైమరీ డివైజ్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా వెబ్ వాట్సాప్ లోనే సేవ్ చేసే అవకాశాన్ని అందిస్తూ అప్డేటెడ్ వెర్షన్ ను తీసుకువచ్చింది.


WhatsApp మాతృ సంస్థ మెటా తన వినియోగదారులకు వెబ్ వాట్సాప్ యాప్ లో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ తో వెబ్ యాప్ నుంచే కాంటాక్ట్ లను సేవ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. దీంతో ఇకపై కొత్త కాంటాక్ట్స్ సేవ్ చేయాలనుకునే కస్టమర్స్.. ప్రైమరీ అకౌంట్ లోకి వెళ్లాల్సిన అవసరం లేదు.

ఎక్కవ డివైజెస్స్ లో సైతం ఎంతో సమర్థవంతంగా పని చేయగలిగే వాట్సాప్.. ఈ సరికొత్త ఫీచర్ తో వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని కల్పించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో, వినియోగదారులు వాట్సాప్ వెబ్, విండోస్ యాప్ నుండి కాంటాక్ట్ లను యాడ్ చేయవచ్చు. వాటిని తేలికగా యాక్సెస్ చేయవచ్చు. ఇక ఇదే ఫీచర్ భవిష్యత్తులో మరికొన్ని లింక్  చేయబడిన డివైజెస్ లో సైతం అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.


ALSO READ : ఇకపై వాట్సాప్ లో Caste, income సర్టిఫికేట్లు

వాట్సాప్ చాట్ లో కాంటాక్ట్ కనిపించాలంటే ఇప్పటి వరకూ ప్రైమరీ డివైజ్ లో కాంటాక్స్ సేవ్ చెయాల్సిన అవసరం ఉండేది. ఈ సమస్య ఎక్కువ డివైజెస్ వాడే వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ఈ సమస్యకు చెక్ పెడుతూ వాట్సాప్ ఈ లేెటెస్ట్ ఫీచర్ ను తీసుకువచ్చింది. వ్యాపారం లేదా వ్యక్తిగత అవసరాల దృష్ట్యా వేరే డివైజెస్ లో వాట్సాప్ ను వాడే కస్టమర్స్ కు ఈ అప్డేట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ప్రతీ సారి కొత్త కాంటాక్ట్స్ ను వాట్సాప్‌లో సేవ్ చేసుకునే అవసరం ఉండదు.

ఈ ఆప్సన్ తో కాంటాక్ట్ ను సేవ్ చేస్తున్నప్పుడు వాట్సాప్ లో సేవ్ చేయాలా? లేక మెుబైల్ లో సేవ్ చేయాలా? అనే ఆఫ్షన్ అడుగుతుంది. వాట్సాప్ తో పాటు మెబైల్ కూడా కాంటాక్ట్ ను సేవ్ చేయాలనుకుంటే సెకండ్ ఆఫ్షన్ ను ఎంచుకోవచ్చు. ఇక కేవలం వ్యాపారం లేదా బయట పనులపై కాంటాక్ట్స్ సేవ్ చేయాలనుకునే కస్టమర్స్ వెసులుబాటు ప్రకారం సేవ్ చేసుకోవచ్చు. ఫోన్ పొగొట్టుకున్న సమయంలో సైతం వాట్సాప్ కాంటాక్స్ పోందే విధంగా మరో అప్డేట్ ను తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని వాట్సాప్ తన బ్లాగ్ లో తెలిపింది. ఇందుకు సంబంధించిన స్కీన్ షాట్ పంచుకున్న వాట్సాప్.. త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపింది.

ఇక వాట్సాప్ ఇప్పటికే కాంటాక్స్ చేయకుండానే మెసేజెస్ పంపించే సరికొత్త ఫీచర్ ను తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే చాట్ మెమోరీ ఫీచర్ సైతం అందుబాటులోకి రానుందని… ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేేసే ఈ ఫీచర్ మరింత మెరుగైన సేవలు అందిస్తుందని వాట్సాప్ తెలిపింది.

 

Related News

Dinosaur Eggs: అంగారక గ్రహంపై ‘డైనోసార్ ఎగ్స్’.. ఒకప్పుడు అక్కడ జీవులు మనగడ ఉండేదా?

Google Pixel 9 vs Pixel 10: పిక్సెల్ 10 కంటే పిక్సిల్ 9 బెటర్.. ఎందుకంటే?

Grok Imagine AI: ఇప్పుడు ఏఐ వీడియో, ఇమేజ్‌‌లు చేయడం అంతా ఫ్రీ.. అందరికీ అందుబాటులో గ్రోక్ ఇమేజిన్

Lava Play Ultra 5G: కేవలం రూ.14999కే సూపర్ గేమింగ్ ఫోన్.. 64MP కెమెరా, భారీ బ్యాటరీతో లాంచ్

Google Pixel 10 Series: గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇండియాలో విడుదల.. అద్భుత కెమెరా, పవర్ ఫుల్ ఏఐ ఫీచర్లు

Vivo V60: 50MP కెమెరా, పెద్ద బ్యాటరీ.. వివో ఫ్లాగ్ షిప్ ఫోన్ పై భారీ డిస్కౌంట్

Big Stories

×