E-Paper
Advertisement

OnePlus Nord 6: 9,000mAh బ్యాటరీతో ‘వన్‌ప్లస్ నోర్డ్ 6’ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర కూడా తక్కువే!

OnePlus Nord 6: 9,000mAh బ్యాటరీతో ‘వన్‌ప్లస్ నోర్డ్ 6’ లాంచ్ డేట్ ఫిక్స్.. ధర కూడా తక్కువే!
Advertisement

OnePlus Nord 6: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఫోన్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. దీనికి తగ్గట్టుగా త్వరలోనే ‘వన్‌ప్లస్ నార్డ్ 6’ ఇండియాలో విడుదల కానుంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని రూపొందిన ఈ ఫోన్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో లాంచ్ కానున్న ఈ మొబైల్, మునుపటి మోడల్స్ కంటే రెండింతలు శక్తివంతంగా ఉండబోతోందని సమాచారం.

మొదటిసారి భారీ బ్యాటరీతో..

ఈ ఫోన్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే ప్రధానాంశం దాని బ్యాటరీ సామర్థ్యం. ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో వన్ ప్లస్ చరిత్రలోనే ఇది ఒక రికార్డు సృష్టించబోతోంది. దీనికి తోడు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో, ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిశ్చింతగా వాడుకోవచ్చు.

Advertisement

Also Read: ఫోన్ ఏ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడితే బెటర్? కుడి లేదా ఎడమ?

గేమర్ల కోసం స్పెషల్ చిప్‌సెట్..

గేమర్ల కోసం ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్‌సెట్‌తో పాటు G1 ఈ-స్పోర్ట్స్ వైఫై చిప్‌ను కూడా జోడించారు. దీనివల్ల ఆన్‌లైన్ గేమింగ్ సమయంలో నెట్‌వర్క్ సమస్యలు తలెత్తవు. 165Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.78 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని అద్భుతంగా మారుస్తుంది.

50 మెగాపిక్సల్ కెమెరా..

Advertisement

ఇక ఫొటోగ్రఫీ ప్రియుల కోసం 50MP ప్రైమరీ కెమెరాను ఇస్తున్నారు. వన్‌ప్లస్ కలర్ సైన్స్ వల్ల ఫొటోలు చాలా సహజంగా, స్పష్టంగా వస్తాయి. సాఫ్ట్‌వేర్ విషయానికొస్తే.. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. ఇది వినియోగదారులకు చాలా స్మూత్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుంది. 8GB, 12GB RAM వేరియంట్లలో, బ్లాక్, మింట్, సిల్వర్ వంటి ఆకర్షణీయమైన రంగుల్లో ఇది లభించనుంది.

ధర ఎంతంటే?

భారత మార్కెట్లో ఏప్రిల్ 7న విడుదలయ్యే అవకాశం ఉన్న ఈ ఫోన్ ధర రూ.30,000 నుండి రూ.35,000 మధ్య ఉండవచ్చు. తక్కువ బడ్జెట్‌లో నోర్డ్ CE 6 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, అదిరిపోయే బ్యాటరీ కావాలనుకునే వారికి నోర్డ్ 6 బెస్ట్ ఆప్షన్ కానుంది.

Also Read: రూ.30వేల బడ్జెట్‌లో ఒప్పో ప్యాడ్ మినీ.. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 పవర్‌తో వస్తోంది!

 

 

 

Related News

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

Big Stories

Advertisement
×