E-Paper
Advertisement

Oppo Find X9 Ultra: ఈ ఫోన్ బాగా గుర్తుపెట్టుకోండి.. కెమెరానే హైలెట్.. త్వరలో సంచలనం కావడం పక్కా..!

Oppo Find X9 Ultra: ఈ ఫోన్ బాగా గుర్తుపెట్టుకోండి.. కెమెరానే హైలెట్.. త్వరలో సంచలనం కావడం పక్కా..!

Oppo Find X9 Ultra: ప్రముఖ స్మార్ట్ కంపెనీ ఒప్పొ (Oppo).. మెుబైల్ కెమెరాలో విభాగంలో విఫ్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం మార్కెట్ లో 10x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో లభిస్తున్న ఎక్స్‌టర్నల్ టెలిఫోటో కన్వర్టర్లు (Telephoto Converters) అవసరం లేని మెుబైల్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. 10x జూమ్ తో ఫొటోలు తీయగల ‘Oppo Find X9 Ultra’ మెుబైల్ ను త్వరలో లాంచ్ చేయబోతోంది.

ఫైవ్ రిఫ్లెక్షన్ ప్రిజం

ఒప్పో సంస్థ ఈ ఫోన్‌లో ఒక వినూత్నమైన ‘ఫైవ్ రిఫ్లెక్షన్ ప్రిజం’ (Five-reflection prism) టెక్నాలజీని ఉపయోగించింది. సాధారణంగా 10x జూమ్ కోసం ఫోన్ లోపల 41mm పొడవైన మాడ్యూల్ అవసరమవుతుంది. కానీ ఈ టెక్నాలజీతో దానిని కేవలం 29mm కు తగ్గించారు.

హ్యాసెల్‌బ్లాడ్ కెమెరా

Oppo Find X9 Ultra స్మార్ట్ ఫోన్ లో 50MP హ్యాసెల్‌బ్లాడ్ 10x ఆప్టికల్ టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. ఇది సుదూరంగా ఉన్న వస్తువులను కూడా అత్యంత స్పష్టంగా (Lossless quality) ఫోటో తీయగలదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. సుమారు 100 మీటర్ల దూరంలో ఉన్న వస్తువులు, వ్యక్తులు, జంతువులను సైతం ఎంతో క్వాలిటీతో కెమెరాలో బంధించగలదని పేర్కొంటున్నారు.

కంపెనీ సీఈఓ ఏమన్నారంటే?

సాధారణంగా మొబైల్ ఫోన్లలో జూమ్ పెంచడానికి విడిగా ‘టెలిఫోటో లెన్స్ కిట్స్’ వాడుతుంటారు. కానీ ఈ ఫోన్ లోనే శక్తివంతమైన ఇన్-బిల్ట్ లెన్స్ ఉండటం వల్ల ఆ విడి భాగాల అవసరం ఉండదని కంపెనీ సీఈఓ పీట్ లౌ (Pete Lau) తెలిపారు. ఈ ఫోన్.. మెుబైల్ రంగంలో విఫ్లవాత్మక మార్పును తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: Future Jobs: 2030 నాటికి ఈ ఉద్యోగాలు ఖాళీ! మీరు సేఫ్ జోన్‌లో ఉన్నారా? AI కాలంలో ‘కొత్త’ కొలువుల జాతర ఇదే!

ఇంతకీ లాంచ్ ఎప్పుడంటే?

మరోవైపు ఈ మెుబైల్ ను ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు పీట్ లౌ ఎక్స్ వేదిక వెల్లడించారు. ఫోన్ కు సంబంధించి ఫొటోను సైతం ఆయన పంచుకున్నారు. ఇదిలా ఉంటే Oppo Find X9 Ultra ఫోన్ లో 230mm ఫోకల్ లెంగ్త్ కలిగిన 50MP సెన్సార్, దానికి గింబల్ లెవల్ OIS (Optical Image Stabilization) వంటి అధునాతన ఫీచర్లను అందించినట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మెుత్తంగా చూస్తే ఈ ఒప్పో మెుబైల్.. ప్రొఫెషనల్ కెమెరాల స్థాయిలో జూమ్ ఫొటోలను తీయనున్నట్లు అర్థమవుతోంది.

Also Read: Oil Companies Dismissed: వదంతులు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు, చమురు కంపెనీలు క్లారిటీ

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×