E-Paper
Advertisement

Oil Companies Dismissed: అవన్నీ పుకార్లు మాత్రమే.. ఇంధన కొరత లేదు, చమురు కంపెనీలు క్లారిటీ

Oil Companies Dismissed: అవన్నీ పుకార్లు మాత్రమే.. ఇంధన కొరత లేదు, చమురు కంపెనీలు క్లారిటీ
Advertisement

Oil Companies Dismissed: అదిగో పులి.. ఇదిగో మేక.. అన్నచందంగా ఉంది దేశంలో ఇప్పుడు పరిస్థితి. నిజాలు కంటే అబద్దం వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఫలితంగా చమురు కంపెనీలు రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో ఇంధనం కొరత లేదని ఈ విషయంలో పుకార్లు నమ్మవద్దని ఆయా కంపెనీలు తేల్చిచెప్పాయి.

ఇంధన కొరత లేదన్న  చమురు కంపెనీలు 

Advertisement

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఆయిల్ కొరత ఏర్పడిందంటూ వార్తలు జోరందుకున్నాయి. అంతేకాదు పెట్రోల్ కోసం పంపుల వద్ద జనాలు బారులు తీయడంతో నిజమేనని నమ్ముతున్నారు. ఈ పుకార్లను ఎవరు క్రియేట్ చేస్తున్నారు? పెట్రోల్ వేయకుండా పంపుల వద్ద ఎందుకు డిలే చేస్తున్నారు? ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దేశంలో ఆయిల్ కొరత లేదని చమురు కంపెనీలు తేల్చిచెప్పారు. బుధవారం ఉదయం నుంచి వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ కొరతపై వస్తున్న వదంతులను తోసిపుచ్చాయి. దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా తగినంతగా ఉందని, సరఫరా గొలుసులు సజావుగా పని చేస్తుందని హామీ ఇచ్చింది. ఈ మేరకు బహిరంగ ప్రకటన చేసింది భారత్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ.

Advertisement

వదంతులు నమ్మొద్దు.. వినియోగదారులకు సూచన

చమురు కంపెనీల్లో తమ కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ఉన్నాయని, ఇంధన లభ్యతకు అంతరాయం లేకుండా చూసేందుకు కట్టుబడి ఉన్నాయని తెలిపాయి. ఇలాంటి సమయంలో ధృవీకరించని సమాచారంపై ఆధారపడవద్దని పేర్కొన్నాయి. ఇంధన కేంద్రాలకు తొందరపడి వెళ్లవద్దని వినియోగదారులను కోరాయి.

కొన్ని ప్రాంతాలలో ఇంధన కొరత ఉందన్న వదంతులు పూర్తిగా నిరాధారమైనవి బీపీసీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఎలాంటి కొరత లేదని నొక్కి చెప్పింది. ముడి చమురు, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ తగినంత నిల్వలను కలిగి ఉన్నాయని పేర్కొంది.

అటు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-HPCL కూడా ఇదే విధమైన హామీ ఇచ్చింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌పిజి కొరత లేదని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. వినియోగదారులు పుకార్లను నమ్మవద్దని భయాందోళనలకు గురికావద్దని సూచన చేసింది.

ALSO READ: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. రీఫిల్ బుకింగ్ గడువు పెంపు, ఈసారి 35 రోజులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు వివరణ ఇచ్చాయి. హోర్ముజ్ జలసంధి కీలక వాణిజ్య మార్గం చుట్టూ నెల కొన్న అంతరాయాలు, ముడి చమురు ధరల్లో హెచ్చు తగ్గులు ఆ తరహా ఆందోళనను పెంచిన విషయం తెల్సిందే.

Related News

ఆర్మీ రహస్యాలు చైనాకు లీక్.. జమ్ము కాశ్మీర్‌లో తెలంగాణ మహిళ అరెస్ట్!

చనిపోయింది నూడిల్స్ వల్ల కాదట.. అసలు నిజం తెలిసి పోలీసులే షాక్!

ఐక్యరాజ్యసమితిలో ఉద్యోగం.. డిగ్రీ చేసినవారికి సూపర్ అవకాశం.. అర్హతలు ఇవే

ఆలయంలో ఓ లారీ బీభత్సం, 12 మంది మృతి-30 మందికి గాయాలు, గ్వాలియ‌ర్‌లో ఘటన

దుర్గా మండపం కూలిన ఘటన..19 మంది మృతి, 25 మందికి గాయాలు, కోల్‌కత్తాలో ఘటన

రిలయన్స్, బ్లింకిట్, జొమాటో సిబ్బందిపై కేసు నమోదు.. ఎందుకంటే..?

మాజీ సీఎం కోసం.. 9 హత్యలు చేశా.. లైవ్‌లో ఒప్పుకున్న ఎమ్మెల్యే!

రాత్రి నూడుల్స్.. ఉదయానికి శవాలు.. ఒకే కుటుంబంలో 5 గురు మృతి!

Big Stories

Advertisement
×