BigTV English

Oppo K12x 5G: అప్పు తీసుకుని అయినా ఒప్పో కొనేయాల్సిందే మావా.. 5జీ ఫోన్ మరీ ఇంత చీపా!

Oppo K12x 5G: అప్పు తీసుకుని అయినా ఒప్పో కొనేయాల్సిందే మావా.. 5జీ ఫోన్ మరీ ఇంత చీపా!

Oppo K12x 5G pink color option: తక్కువ ధరలో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అధునాతన ఫీచర్లతో కొనుక్కోవాలని చూస్తున్నారా?.. కానీ అలాంటి ఫోన్‌ను వెతికీ వెతికీ అలసిపోయారా?.. అయితే మీకో గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడా వెతకాల్సిన అవసరం లేదు. ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లు, కెమెరా క్వాలిటీతో అతి తక్కువ ధరలోనే తాజాగా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆసక్తి గలవారు ఈ ఫోన్‌ను కొనుక్కోవచ్చు. ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం.


ప్రముఖ టెక్ బ్రాండ్ ఒప్పో లైనప్‌లో ఉన్న Oppo K12x 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త పింక్ కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ రెండు నెలల క్రితమే లాంచ్ అయింది. అప్పుడు ఈ ఫోన్ బ్రీజ్ బ్లూ, మిడ్‌నైట్ వైలెట్ షేడ్స్‌లో లాంచ్ చేయబడింది. అయితే ఇప్పుడు అందులో కొత్త పింక్ కలర్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. మరో రెండు మూడు రోజుల్లో ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డేస్ 2024 సేల్ ప్రారంభం కానుంది. ఆ సేల్‌లో Oppo K12x 5G పింక్ కలర్ వేరియంట్‌ను కొనుక్కోవచ్చు. ఈ ఫోన్‌లో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ అందించబడింది. ఈ ఫోన్ మిలిటరీ-గ్రేడ్ MIL-STD-810H మన్నికతో వస్తుంది. అంటే ఇది చాలా స్ట్రాంగ్‌గా తయారు చేయబడింది. ఇక దీని ధర విషయానికొస్తే..

OPPO K12x 5G Specifications


OPPO K12x 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఇది 6.67 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. డిస్‌ప్లే 1000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని కలిగి ఉంది. అంతేకాకుండా తడి ఫింగర్లతో మొబైల్‌ను ఆపరేట్ చేసినప్పుడు కూడా దీని టచ్ స్క్రీన్ అద్భుతంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే OPPO K12x 5Gలో MediaTek డైమెన్షన్ 6300 ప్రాసెసర్ అందించబడింది. ఇది Mali-G57 GPUతో వస్తుంది. ఫోన్ గరిష్టంగా 8 GB RAM + 256 GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంది.

Also Read: కిర్రాక్.. సెప్టెంబర్‌లో లాంచ్ అయిన టాప్ ఫోన్లు.. ఫీచర్లు, ధర వివరాలివే!

ఈ ఫోన్ ర్యామ్‌ను వర్చువల్‌గా 8 GB వరకు విస్తరించుకోవచ్చు. అదే సమయంలో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 14లో నడుస్తుంది. OPPO K12x 5G కెమెరా విషయానికొస్తే.. ఇందులో 32MP వెనుక కెమెరాను అందించారు. అలాగే 2MP పోర్ట్రెయిట్ సెన్సార్ కూడా ఉంది.

ఇక ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. OPPO K12x 5G బ్యాటరీ సామర్థ్యం విషయానికొస్తే.. ఇందులో 45 Watt SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5000 mAh బ్యాటరీని అందించారు. అదే సమయంలో ఫోన్ సేఫ్టీ కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. దీంతో పాటు మరిన్ని ఫీచర్లు ఇందులో అందించబడ్డాయి.

Oppo K12x 5G Price

Oppo K12x 5G స్మార్ట్‌ఫోన్ పింక్ కలర్ ఆప్షన్ 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.12,999కి లాంచ్ అయింది. ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 6 వరకు జరుగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో రూ.10,999కి సొంతం చేసుకోవచ్చు. కాగా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్ అయితే ఈ ఫోన్‌ను సెప్టెంబర్ 26న అంటే ఒక రోజు ముందే కొనుక్కోవచ్చు.

Related News

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls| స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Realme 15 Pro vs OnePlus Nord 5 vs Galaxy A55: రూ.40000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Amazon 75 Percent Sale: ఇల్లు తుడవడమా? రోబోతో చేయించండి.. Amazon Sale లో 75% తగ్గింపు!

Big Stories

×