BigTV English

Bigg Boss 8 Day 23 Promo 1: వామ్మో చంద్రముఖినే ఏడిపించారుగా.. ఈ యాంగిల్ అసలు ఎక్సపెక్ట్ చేయలేదు భయ్యా..!

Bigg Boss 8 Day 23 Promo 1: వామ్మో చంద్రముఖినే ఏడిపించారుగా.. ఈ యాంగిల్ అసలు ఎక్సపెక్ట్ చేయలేదు భయ్యా..!

Bigg Boss 8 Day 23 Promo 1.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 23వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను తాజాగా నిర్వాహకులు విడుదల చేశారు. చంద్రముఖి లా విరుచుకుపడుతూ డేర్ అండ్ డాషింగ్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న కన్నడ బ్యూటీ యష్మీ, తొలిసారి ఏడ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎప్పుడూ ఒకరిని భయపెట్టే ఈమె ఇప్పుడు ఇలా ఏడ్వడం ఏంటి అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాదు ఏడుపు కూడా వస్తుందా..? ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా ..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం. మరి చంద్రముఖిని సోనియా ఎందుకు ఏడిపించింది? అసలు ఏం జరిగింది.. ?అనేది ఇప్పుడు చూద్దాం.


నామినేషన్ లో సోనియాను నామినేట్ చేసిన యష్మీ..

Bigg Boss 8 Day 23 Promo 1: Vammo made Chandramukhi cry.. I didn't expect this angle..!
Bigg Boss 8 Day 23 Promo 1: Vammo made Chandramukhi cry.. I didn’t expect this angle..!

నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ హౌస్లో ఈవారం సోనియాను యష్మీ నామినేట్ చేసింది.పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ.. తన స్ట్రాటజీ చూపించింది. మొదట్లో నేను నిన్ను నా క్లాన్ లోకి తీసుకుంది ఎందుకంటే నేను తప్పు చేసినా.. నువ్వు మాట్లాడతావని తీసుకున్నాను. కానీ నువ్వు ఆ రూల్ అసలు ఫాలో అవ్వలేదు. అయితే నిఖిల్ క్లాన్ లో ఉన్నప్పుడు మాత్రం బాగానే సలహాలు ఇస్తూ ముందుకు పోతున్నావు. ఇక నా రెండవ పాయింట్ ఎగ్ టాస్క్ గురించి నువ్వే చెప్పావు .. నిఖిల్, పృథ్వి ఆగ్రేషన్ నీ స్ట్రెంత్ అని, ఆ బలాన్ని నువ్వు వాడుకున్నావు తప్ప నువ్వు ముందుకు రాలేదు ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్గా ఆడి ఉంటే బాగుండేది అని నాకనిపించింది అంటూ రీజన్ చెబుతూ సోనియా ను యష్మీ నామినేట్ చేసింది.


సోనియా ఫైర్..

దీనికి సోనియా మాట్లాడుతూ.. పృథ్వీ , నిఖిల్ ని ముందు పెట్టి నేను ఆడలేదు అంటున్నావు కదా.. నేను దానికి ఒప్పుకుంటాను. కానీ నేను ఇక్కడ ఉన్న ఏ మగాడి కంటే కూడా అగ్రేషన్లో ఎక్కువే. నా అగ్రేషన్ వల్ల ఎవరిని నేను హార్ట్ చేయకూడదని అనుకున్నాను.. నేను గేమ్ లోకి దిగాక ఎవరిని కొడతానో కూడా నాకే తెలియదు. ఎందుకురా బాబు.. కొట్టకుండా ఉండాలని అనుకున్నాను. అయితే మీ ఫెయిల్డ్ సంచాలక్ నా గేమ్ చూపించుకునే అవకాశం ఇచ్చాడు. అందుకే చివరిలో వచ్చిన నిన్ను, ప్రేరణను ఎత్తేశాను అంటూ సోనియా చెప్పుకొచ్చింది.

మాటలకు యష్మీ ఎమోషనల్..

ఇక తర్వాత నామినేషన్స్ లో నిఖిల్, పృథ్వీ లను చూస్తూ ఉండిపోతే నీలాగా సిస్టర్, మదర్ అని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ నేను చేయలేను అంటూ కోప్పడింది యష్మి. దానికి సోనియా చూడాలి కదా యష్మి ఎంతసేపు నిఖిల్, పృథ్వీ లను చూస్తే ఎట్లయితుంది అంటూ రెచ్చగొట్టింది. అవును నా ఇష్టం నాకు కావాలంటే నేను నిఖిల్ నే చూస్తాను. నా ఇష్టం. నేను ఎవరిని చూసినా గేమ్ వచ్చినప్పుడు గేమ్ ఆడతాను. నీలాగా వాళ్ళని వదిలేసి నిలిచోను. అయినా ప్లేటు ఎలా తిప్పాలో ఎవరిని ఎలా వాడుకోవాలో నీకు సూపర్ గా తెలుసు. నువ్వు మదర్ అంటావ్ , సిస్టర్ అంటావ్ , సెంటిమెంట్ అంటావ్ అందరినీ వాడుకుంటున్నావు అంటూ సోనియా పరువు తీసింది . ఆ తర్వాత ఎమోషనల్ గా హర్ట్ అయిన యష్మి కంటతడి పెట్టుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Related News

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Big Stories

×