E-Paper
Advertisement

Oppo K13 Turbo 5G Smartphone: ఒప్పో కె13 టర్బో.. రూ.11వేలలోపే ఫ్లాగ్‌షిప్ అనుభవం ఇస్తున్న అసలు మాన్‌స్టర్

Oppo K13 Turbo 5G Smartphone: ఒప్పో కె13 టర్బో.. రూ.11వేలలోపే ఫ్లాగ్‌షిప్ అనుభవం ఇస్తున్న అసలు మాన్‌స్టర్
Advertisement

Oppo K13 Turbo 5G Smartphone: స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కెమెరా ఇన్నోవేషన్, డిజైన్ క్వాలిటీ, వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీతో ప్రత్యేక గుర్తింపు సాధించిన బ్రాండ్ ఒప్పో. యువత అవసరాలను అర్థం చేసుకుని ప్రతి మోడల్‌లో కొత్త టెక్నాలజీని తీసుకువచ్చే కంపెనీగా పేరు పొందింది. ప్రీమియం లుక్, పర్‌ఫార్మెన్స్ అన్నీ ఒకేసారి అందించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారుల నమ్మకం ఈ బ్రాండ్‌‌పై నిలబెట్టింది. అందుకే ప్రతి కొత్త విడుదల టెక్ మార్కెట్‌లో పెద్ద అంచనాలను క్రియేట్ చేస్తుంది. అదే స్థాయిలో ఇప్పుడు దృష్టి ఆకర్షిస్తున్న మోడల్ ఒప్పో కె13 టర్బో, బడ్జెట్ సెగ్మెంట్‌లో పోటీని పూర్తిగా మార్చే స్థాయి ఫీచర్లతో అడుగుపెట్టింది.

డిజైన్.. డిస్‌ప్లే విషయానికి వస్తే..

Advertisement

ముందుగా డిజైన్ డిస్ప్లే గురించి మాట్లాడితే, చేతిలో పట్టుకున్నప్పుడు ఫోన్ చాలా ప్రీమియం లుక్ ఇస్తుంది. ముందు భాగంలో 6.7 ఇంచెస్ ఎఫ్‌హెచ్‌డి ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. ఈ అమోలెడ్ డిస్‌ప్లేలో ఉన్న 120 హెచ్‌జెడ్ స్మూత్ రిఫ్రెష్ రేట్ వల్ల స్క్రోల్ చేసినా, ఆన్‌లైన్ వీడియోలు చూసినా, గేమింగ్ చేసినా స్క్రీన్ బట్టర్ లా స్మూత్‌గా పనిచేస్తుంది. బ్రీట్‌నెస్ కూడా తగినంత ఉండటంతో బయట ఎండలో కూడా క్లియర్‌గా కనిపిస్తాయి.

డైమెన్సిటీ 9300 చిప్‌సెట్

Advertisement

ఇక పర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్‌సెట్ ఇచ్చారు. ఇది ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో వచ్చే అత్యంత పవర్‌ఫుల్ చిప్. హెవీ యాప్స్ ఓపెన్ చేసినా, హై గ్రాఫిక్స్ గేమ్స్ ఆడినా, మల్టీ టాస్కింగ్ చేసినా ఫోన్ ల్యాగ్ అవ్వడం అసలు ఉండదు. ర్యామ్ గా 12 జీబీ ర్యామ్ ఇచ్చి, అవసరమైతే వర్చువల్ ర్యామ్ టెక్నాలజీ ద్వారా మొత్తం 20 జీబీ వరకు పెంచుకోవచ్చు. స్టోరేజ్ గా 256 జీబీ యు ఎఫ్ ఎస్ 4.0 స్టోరేజ్ ఇవ్వడం వల్ల ఫైల్స్ సేవ్ చేయడం కానీ, యాప్స్ ఓపెన్ చేయడం కానీ క్షణాల్లో జరుగుతుంది.

Also Read: Infinix Hot 40 Pro 2026 6G: ఇన్‌ఫినిక్స్ హాట్ ఫోర్టీ ప్రో 6జి.. 2026 మిడ్ రేంజ్ మార్కెట్‌కి కొత్త పోటీ

200 ఎం.పి కెమెరా

ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడితే వెనుక భాగంలో ప్రధానంగా 200 ఎం.పి కెమెరా ఇస్తూ ఒప్పో క్లియర్‌గా గట్టిగా షాట్ వేసింది. దీనితో పాటు 8 ఎం.పి అల్ట్రా వైడ్, 2 ఎం.పి మాక్రో సెన్సర్లు ఉన్నాయి. డేలైట్‌లో ఫోటోలు చాలా క్లియర్‌గా, డీటైల్‌గా వస్తాయి. నైట్ మోడ్‌లో లైటింగ్ తక్కువ ఉన్నా కూడా ఫోటో క్వాలిటీ చాలా ఇంప్రెసివ్‌గా ఉంటుంది. వీడియోలు షూట్ చేసినప్పుడు స్టెబిలైజేషన్ కూడా బాగా బలంగా పనిచేస్తుంది. ముందు కెమెరా 32 ఎంపి, సెల్ఫీలు చాలా నేచురల్‌గా, స్కిన్ టోన్స్ అద్భుతంగా క్యాప్చర్ అవుతాయి.

బ్యాటరీ ఛార్జింగ్ 5100mAh

ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ విషయానికి వస్తే ఇందులో 5100mAh బ్యాటరీ ఉంది. రోజు మొత్తం హెవీ యూజ్ చేసినా కూడా బ్యాటరీ సపోర్ట్ బలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ ఫోన్ హైలైట్ 150 డబ్ల్యూ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్. కేవలం కొన్ని నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జింగ్ అవుతుంది, అంత వేగంగా ఛార్జ్ అయ్యే టెక్నాలజీ ఈ ధరలో ఇవ్వడం చాలా అరుదు. సాఫ్ట్‌వేర్ అనుభవం విషయానికి వస్తే ఈ ఫోన్ కాలర్ ఓఎస్ 15 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 15 తో వస్తుంది. యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా క్లీన్ గా ఉంటుంది, యానిమేషన్లు స్మూత్‌గా ఉంటాయి, అవసరం లేని యాప్స్ చాలా తక్కువ.

ధర.. లాంచ్ ఎప్పుడంటే?

ఇప్పుడు ఈ పోన్‌కి అసలు హైలైట్ ధర. ఇలాంటి ఫ్లాగ్‌షిప్ లెవల్ స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకేచోట ఇచ్చిన ఈ ఫోన్ ధర రూ.10,499 మాత్రమే. ఈ రేంజ్‌లో పవర్, కెమెరా క్వాలిటీ, పర్‌ఫార్మెన్స్, బ్యాటరీ, 150 డబ్ల్యూ ఛార్జింగ్ స్పీడ్ వంటి ఫీచర్లు ఒకేసారి ఇంత స్ట్రాంగ్‌గా బ్యాలెన్స్ చేయడం మార్కెట్‌లో చాలా రేర్. అందుకే టెక్ కమ్యూనిటీ మొత్తం ఈ ఫోన్ గురించే మాట్లాడుతోంది. లాంచ్ ఇప్పటికే పూర్తయింది, ఆన్‌లైన్ సేల్స్ మొదలయ్యాయి, ప్రారంభంలోనే భారీ డిమాండ్ రావడంతో స్టాక్ త్వరలోనే అయిపోవచ్చని సమాచారం. ముఖ్యంగా గేమింగ్ కోసం కావాలన్నా, స్టడీస్ కోసం వేగంగా పనిచేసే ఫోన్ కావాలన్నా, వీడియోలు షూట్ చేసే క్రియేటర్స్ కి కావాలన్నా ఈ ధరలో ఇంత పవర్ అందించే పర్‌ఫెక్ట్ ఆప్షన్ ఇదే. బడ్జెట్ సెగ్మెంట్‌లో ఒప్పో పోరును పూర్తిగా కొత్త దశకు తీసుకెళ్లింది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×