E-Paper
Advertisement

ఏమన్నా ప్లాన్ చేశావా ఒప్పో మావా.. 8,000mAh బ్యాటరీ, లైవ్ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌తో ‘Pad Mini’ రెడీ!

ఏమన్నా ప్లాన్ చేశావా ఒప్పో మావా.. 8,000mAh బ్యాటరీ, లైవ్ ట్రాన్స్‌లేషన్‌ ఫీచర్‌తో ‘Pad Mini’ రెడీ!
Advertisement

Oppo Pad Mini: ప్రస్తుతం యువతలో ఒప్పో ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. అయితే, కంపెనీ సడెన్‌గా తమ దృష్టిని ట్యాబ్లెట్ల మీదకు మళ్లించింది. ముఖ్యంగా పెద్ద పెద్ద ట్యాబ్లెట్లు పట్టుకోలేక.. చిన్న సైజులో పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే గ్యాడ్జెట్స్ కావాలనుకుంటున్న వారి కోసం ‘Oppo Pad Mini’ని రెడీ చేస్తోంది. తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. ఇది నేరుగా యాపిల్ ఐప్యాడ్ మినీ మార్కెట్‌కే ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. అదిరిపోయే లుక్కుతో పాటు.. అబ్బా ఏముందీ అనిపించే ఫీచర్లతో రాబోతున్న ఈ ట్యాబ్లెట్ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇవే..

అరచేతిలో ఇమిడిపోయే ట్యాబ్..

ఈ Oppo Pad Mini చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండబోతోంది. దీనిలో 8.8 అంగుళాల డిస్‌ప్లేను ఇస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయేంత ముద్దుగా ఉంటుందన్నమాట ఈ ట్యాబ్. అలాగే దీనిలో అమోలెడ్ స్క్రీన్ వాడుతున్నారు కాబట్టి.. కలర్స్ చాలా రిచ్‌గా కనిపిస్తాయి. దీనికి తోడు 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీంతో ఎంతసేపు స్క్రోలింగ్ చేసినా, గేమ్స్ ఆడినా అస్సలు స్లో అవ్వదు. ఇక ఈ ట్యాబ్లెట్ కేవలం 5.39 మిమీ మందం మాత్రమే ఉంటుంది. మెటల్ బాడీతో వస్తోంది కాబట్టి.. చేతిలో పట్టుకుంటే చాలా ప్రీమియం ఫీల్ వస్తుంది.

Advertisement

Also Read: ఐఫోన్ ఫోల్డ్ వచ్చేస్తోంది.. హింజ్ విషయంలో యాపిల్ మాస్టర్ ప్లాన్ అదిరిందిగా!

స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌..

చిన్నగా ఉంది కదా అని తక్కువ అంచనా వేయొద్దు. దీని లోపల ఉండే ఇంజిన్ చాలా పవర్‌ఫుల్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ను దీనిలో వాడుతున్నారట. దీనివల్ల ట్యాబ్ హ్యాంగ్ అవ్వడం అనే మాటే ఉండదు. అలాగే ఇందులో మీరెన్ని యాప్స్ వాడినా, భారీ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడినా మెరుగైన పనితీరునే అందిస్తుంది. ఆఫీస్ పనులకైనా, స్టూడెంట్స్ చదువుకోవడానికైనా ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇక ఫొటోల విషయానికి వస్తే.. ఈ ప్యాడ్ మినీలో 13MP కెమెరా ఉంటుంది. ట్యాబ్లెట్‌లో ఫొటోలు ఎవరూ తీయరు కానీ.. వీడియో కాల్స్ లేదా క్లాస్ నోట్స్ స్కాన్ చేయడానికి ఇది బాగుంటుంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం..

Advertisement

సాధారణంగా ఇంత సన్నని డిజైన్‌లో బ్యాటరీ లైఫ్ తక్కువగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఒప్పో మాత్రం దీనిలో ఏకంగా 8000mAh భారీ బ్యాటరీని సెట్ చేస్తోంది. దీంతో ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే కంటిన్యూగా రోజంతా వాడుకోవచ్చు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయినా టెన్షన్ పడక్కర్లేదు. 67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి.. నిమిషాల్లో ట్యాబ్ ఛార్జింగ్ అవుతుంది. సిమ్ కార్డ్ అవసరం లేకుండా ఈ-సిమ్ సపోర్ట్‌తో నడిచే ఈ ట్యాబ్ మినీ.. పర్పుల్, సియాన్, డార్క్ గ్రే రంగుల్లో రాబోతోంది. అయితే దీని ధరను మాత్రం కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

Also Read: బాబోయ్.. ఇంత పెద్ద టీవీనా? LG 115 అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్.. గేమర్లకు ఇక పండగే!

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×