E-Paper
Advertisement

ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో బిగ్ స్కామ్.. 200 కోట్ల నిధులు స్వాహ..!

ట్రైబల్ వెల్ఫేర్ శాఖలో బిగ్ స్కామ్.. 200 కోట్ల నిధులు స్వాహ..!

Tribal Negligence: స్వేచ్చ బ్యూరో: ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లలో నిర్లక్ష్​యం స్పష్టంగా కనిపిస్తున్నది. కొందరు అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి డ్యామేజ్ చేసేలా ఉన్నది. అధికారుల ప్రణాళిక లోపం వలన ప్రభుత్వ లక్ష్యాలకు గండి పడుతుంది. అంతేగాక నిధులూ ఛేజారుతున్నాయి. ఎప్పటికప్పుడు ఫర్ ఫెక్ట్ ఫ్లానింగ్ లతో శాఖను మందుకు తీసుకువెళ్లాల్సిన ఆఫీసర్లు..నత్తనడకన కొనసాగేలా వ్యవహరిస్తున్నారు. కనీసం ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సమాచారాన్నీ సకాలంలో ఇవ్వడం లేదని సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి. ఇదే అంశంపై గతంలో సంబంధిత శాఖ మంత్రి కూడా ఉన్నతాధికారులపై సీరియస్ అయినట్లు తెలిసింది. ఇప్పటికీ ఆయా ఆఫీసర్లలో మార్పు కానరావడం లేదు.

సరైన ప్లానింగ్ లేకుండా..

ట్రైబల్ వెల్ఫేర్ శాఖ లో సుమారు రూ. 60 కోట్ల వర్క్స్ అంశంలో తనకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఏకంగా మంత్రి ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో పాటు తాజాగా ఆఫీసర్లు సకాలంలో స్పందించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వెనక్కి వెళ్లిపోయినట్లు స్వయంగా ఆ శాఖలోని కొందరు అధికారులు చెప్తున్నారు. పరిపాలనలో సరైన ప్లానింగ్ లేకుండా, బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్లు ట్రైబల్ వెల్ఫేర్ శాఖలోని ఎంప్లాయిస్ అసోసియేషన్ లోని ఓ నేత తెలిపారు. శాఖలో కొందరు అధికారులు పాతుకుపోయి, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు.

రూ.200 కోట్లు గాయబ్..

ఆఫీసర్లు చేసిన నిర్లక్ష్యానికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుమారు రూ. 200 కోట్లను కోల్పోయింది. గిరిజన విద్యార్ధుల ట్యూషన్ ఫీజు, స్కాలర్ షిప్ నిధులు తిరిగి కేంద్రానికి వెనక్కి వెళ్లినట్లు ఆఫీసర్లే చెప్తున్నారు. తెలంగాణలో 2023–24, 2024–25 సంవత్సరాలకు 1.3 లక్షల గిరిజన విద్యార్థులకు పెండింగ్ ఉన్న ట్యూషన్ ఫీజు, స్కాలర్షిప్ నిధులు విడుదల చేయాలని మార్చి 28వ తేదీన సర్కార్ ప్రత్యేక జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ స్కీమ్ లో భాగంగా క కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద 75 శాతం అంటే రూ.205.84 కోట్లు మంజూరు చేయగా, మిగతా 25 శాతం రూ.68.61 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు. కేవలం జీవో మాత్రమే జారీ చేసింది.

Also read: మీ ఫోన్‌లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే డేంజర్లో పడ్డట్లే.. మీ పర్సనల్ డేటా గోవిందా?

ఆఫీసర్ల నిర్లక్ష్యం..

నిధులు లేకపోవడంతో ఆర్ధిక సంవత్సరం ముగిసినందున కేంద్రం తన నిధులను వెనక్కి తీసుకున్నది. ఇందులో ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఆఫీసర్ల నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నదని సచివాలయం ఆఫీసర్లు చెప్తున్నారు. నిధులపై ఫాలప్ చేస్తూ, మంత్రికి కమ్యూనికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని, కానీ ఈ అంశంలో కనీసం మంత్రికి తెలియకుండా ఆఫీసర్లు వ్యవహరించారనే చర్చ సచివాలయంలో జరుగుతుంది. ఆఫీసర్లు చేసిన నిర్లక్ష్యానికి సుమారు 1.3 లక్షల గిరిజన విద్యార్ధులకు నిరాశ మిగిలిందని చర్చ జరుగుతుంది.

పథకాలకు తూట్లు.. అటకెక్కిన ఆశయాలు

​గిరిజన నిరుద్యోగులకు ఉపాధి, విద్యార్థులకు నాణ్యమైన విద్య,మారుమూల ప్రాంతాలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతున్నాయి. అధికారులు ఫైళ్లకు పరిమితం కావడంతో సంక్షేమ కార్యక్రమాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. క్షేత్రస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో లబ్ధిదారుల ఎంపికలో సైతం అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవడంలోనే ఆఫీసర్లు ఫెయిలవుతున్నారు. ఏ అధికారి ఏ బాధ్యత నిర్వహిస్తున్నారనే విషయం కూడా ఇప్పటికీ పూర్తి స్థాయిలో క్లారిటీ లేదని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి.

ఆదిపత్య ధోరణితో..

అధికారుల మధ్య సమన్వయ లోపం, ఏళ్ల తరబడి ఒకే సీట్లో కూర్చోని పనిచేస్తున్న వాళ్లు ఆదిపత్య ధోరణితో ఇలాంటి సమస్యలు వస్తున్నట్లు సచివాలయంలోని ఉన్నతాధికారులు చెప్తున్నారు. తద్వారా గిరిజన ప్రాంతాల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుంది. ప్రధానంగా విద్యార్ధులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బెన్ ఫిట్ లు బ్రేక్ అవుతున్నాయి. నిధులు లేక గూడెం, తండాల్లోనూ డెవలప్ నిలిచిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. స్వయం ఉపాధి వంటి స్కీమ్స్ అమలుకు అధికారులు కనీసం యాక్షన్ ప్లాన్ ను కూడా తయారు చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

Also read: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026.. ఈ ఏడాది థీమ్ ఏంటో తెలుసా?

Related News

నేనొక్కడినే వస్తా.. మీ కేబినెట్ మొత్తాన్ని తీసుకురండి.. సీఎం రేవంత్‌కు ఏలేటి సవాల్!

పెట్టుబడులను అడ్డుకుంటే ఊరుకోం.. కేటీఆర్, పవన్ ప్లాన్లపై కాంగ్రెస్ నేత తీవ్ర ఆగ్రహం!

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

Big Stories

×