E-Paper
Advertisement

Oppo Reno 13 Series : అప్పు చేసైనా ఈ ఒప్పో మెబైల్ కొనేయాల్సిందే… రెనో 13 వచ్చేది ఆరోజే.. ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!

Oppo Reno 13 Series : అప్పు చేసైనా ఈ ఒప్పో మెబైల్ కొనేయాల్సిందే… రెనో 13 వచ్చేది ఆరోజే.. ఫీచర్స్ వేరే లెవెల్ అంతే!

Oppo Reno 13 Series : ఒప్పో లైన్ అప్ సిరీస్ లో మరో స్మార్ట్ ఫోన్ లాంఛ్ కు సిద్ధమవుతుంది. త్వరలోనే ఒప్పో రెనో 13 సిరీస్ (Oppo Reno 13 Series) రాబోతుంది. ఈ మెుబైల్ లాంఛ్ డేట్ లీక్ అవ్వటంతో ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ మరోసారి వైరల్ గా మారాయి. ఇక ఒప్పో రెనో 13 లాంఛ్ డేట్, కెమెరా, డిస్ ప్లే, ప్రాసెసర్, బ్యాటరీ ఫీచర్స్ పై ఓ లుక్కేయండి.

ఎప్పటికప్పుడు అధునాతన ఫీచర్స్ తో లేటెస్ట్ మెుబైల్స్ ను లాంఛ్ చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో… తాజాగా మరో సిరీస్ లాంఛ్ కు సిద్దమైంది. ఒప్పో రెనో 13 పేరుతో కొత్త సిరీస్ ను మార్కెట్లోకి రిలీజ్ చేయనుంది. ఇక ఈ మెుబైల్ నవంబర్ 25న చైనాలో లాంఛ్ కానుందని ఆ దేశానికి చెందిన టిప్పర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపింది. ఇక ఇప్పటివరకూ ప్రతీ ఆరు నెలలకు ఒకసారి రెనో సిరీస్ ను లాంఛ్ చేస్తుంది. గత ఏడాది నవంబర్ లో ఒప్పో 11 లాంఛ్ కాగా… ఈ ఏడాది మేలో ఒప్పో రెనో 12 ప్రో, ఒప్పో 12 5జీ మెబైల్స్ లాంఛ్ అయ్యాయి. ఈ మెబైల్స్ టెక్ ప్రియులను ఆకట్టుకోగా మెబైల్స్ హాట్ కేక్స్ లా అమ్ముడయిపోయాయి. ఈ నేపథ్యంలో మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్ ను జోడిస్తూ ఒప్పో తన తాజా వెర్షన్ ఒప్పో 13 సిరీస్ లో ఒప్పో రెనో 13 (Oppo Reno 13) , ఒప్పో రెనో 13 ప్రో(Oppo Reno 13 pro)మెబైల్స్ ను తీసుకొస్తుంది.

Oppo Reno 13 Series Mobile Features –

డిస్ ప్లే –  6.78 అంగుళాల 1.5K (1,264 x 2,780 pixels) డిస్ ప్లే, క్వాడ్ మైక్రో కర్వ్డ్ LTPO OLED స్క్రీన్ తో రాబోతుంది.

కెమెరా – ఈ మెుబైల్ లో కెమెరా ఫీచర్స్ సైతం అధునాతనంగా ఉన్నాయి. ఒప్పో 13 కెమెరా 50 మెగా పిక్సెల్ పెరీస్కోప్ టెలీలెన్స్ తో రాబోతుంది. రెనో 12 ప్రో 5G లో 2X జూమ్ సదుపాయం ఉండగా ఈ 13 సిరీస్ లో 3x ఆప్టికల్ జూమ్‌ ను ఒప్పో డిజైన్ చేసింది.

ప్రాసెసర్ – ఒప్పో రెనో 13 ప్రో మీడియా టెక్ డైమెన్సిటీ 9300 చిప్ సెట్ తో లాంఛ్ కానుంది.

బ్యాటరీ – 80W వైర్డ్ ఛార్జింగ్ 50W వైర్ లెస్ ఛార్జింగ్, 5900mah బ్యాటరీతో రాబోతుంది. ఇక డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ గా ఈ మెుబైల్ లాంఛ్ కాబోతుంది.

ఇక ధర విషయానికి వస్తే… Oppo Reno 12 Pro 5G మెబైల్స్ లాంఛ్ అయ్యి అందుబాటు ధరలలోనే మార్కెట్లోకి వచ్చాయి. ఈ సిరీస్ లో 12GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ. 36,999, 12GB RAM + 512GB స్టోరేజ్ ధర రూ. 40,999గా ఉంది. ఒప్పో రెనో 13 లో లేటెస్ట్ అప్డేట్స్ ను ఉంచటంతో ధర కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ : పిచ్చెక్కించే ఫీచర్స్ తో వచ్చేసిన ఐక్యూ, వన్ ప్లస్.. మరి ఈ స్నాప్ డ్రాగన్ మెుబైల్స్ బెస్ట్ ఏదంటే!

Related News

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

మీది చిన్న రూమా? 0.5 టన్ ఏసీ బెస్ట్ భయ్యా.. ఎందుకో మీరే చూడండి!

బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

Big Stories

×