E-Paper
Advertisement

Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!

Aghorimatha: తెలంగాణలో మాయమై ఏపీలో ప్రత్యక్షమైన అఘోరీమాత!
Advertisement

Aghorimatha: రాష్ట్రంలో సంచలనంగా మారిన అఘోరీమాత రోజుకోచోట దర్శనం ఇస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద కనిపించి వార్తల్లో నిలిచిన అఘోరీమాత ఆ తరవాత ఫుల్ ఫేమస్ అయ్యారు. తరచూ వార్తల్లో నిలుస్తూ ప్రజల దృష్టిని ఆక‌ర్షిస్తున్నారు. ప్ర‌భుత్వం ముత్యాల‌మ్మ గుడిపై దాడి చేసిన నింధితుడిని శిక్షించ‌డంలేద‌ని, ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని చేసిన ప్ర‌క‌ట‌న‌తో ప‌లు ఛాన‌ల్స్ ఆమెతో ఇంట‌ర్వ్యూలు చేశాయి. నిజానికి అఘోరీ అంటే హిమాల‌యాల్లో ఉండాలి. కానీ ఈ అఘోరీ జ‌న‌సంచారంలోకి రావ‌డ‌మే కాకుండా ఆశ్చ‌ర్య‌క‌రం. అలా వ‌చ్చిన అఘోరీమాత కార్, ఐఫోన్ వాడ‌టంతో అంద‌రూ అవాక్క‌య్యారు.

Also read: కాంగ్రెస్‌లో పదవులు కొట్లాట.. రేవంత్ చెక్ పెడతాడా

Advertisement

దీంతో అస‌లు ఈమె న‌కిలీ అఘోరీనా లేదంటే నిజ‌మైన అఘోరీనే అనే అనుమానం కూడా చాలా మందిలో మొద‌లైంది. ఓ ట్రాన్స్ జెండ‌ర్ టీవీ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ ఈమె న‌ఖిలీ అఘోరీ అని అస‌లు మ‌హిళ కాద‌ని చెప్పింది. అంతే కాకుండా ట్రాన్స్ జెండ‌ర్ అని చిన్న‌వ‌య‌సులో ఇంటి నుండి పారిపోయాడ‌ని తెలిపింది. కానీ అఘోరీ మాత్రం మంచికోసం వ‌స్తే త‌న‌నే ప్ర‌శ్నిస్తున్నార‌ని, అనుమానం వ్య‌క్తం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

ఇదిలా ఉంటే ముత్యాల‌మ్మ గుడి వ‌ద్ద ఆత్మార్పణ చేసుకుంటాన‌ని అఘోరీ ప్ర‌క‌టించిన త‌ర‌వాత ఆమెను పోలీసులు నెన్నెల‌లోని స్వ‌గృహానికి తీసుకువెళ్లి నిర్భందించారు. తాను ఆత్మ‌ర్ప‌ణ చేసుకోన‌ని అఘోరీ ప్ర‌క‌టించ‌డంతో కొద్దిరోజుల వ‌ర‌కు మ‌ళ్లీ రాష్ట్రానికి రావ‌ద్దొని పోలీసులు కోరారు. అంతే కాకుండా మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు వైపు ఆమెను విడిచిపెట్టారు. కాగా అఘోరీ తాజాగా ఏపీలో ద‌ర్శ‌నం ఇచ్చింది. ఆమె కారులో వెళుతుండగా కొంత‌మంది వీడియో తీశారు. ప్ర‌స్తుతం ఆమె శ్రీశైలం వైపుకు వెళ్లిన‌ట్టు చూసిన‌వారు చెబుతున్నారు. దీంతో అఘోరీ ఏపీలో ఉండ‌బోతున్నారా? అక్క‌డ ఏం చేస్తారు? అనే ఆస‌క్తి నెల‌కొంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×