Pebble Vienna Women Smartwatch: మహిళల ఫ్యాషన్, టెక్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో అనేక గాడ్జెట్‌లు వస్తున్నాయి. అందులోనూ చేతికి అందమైన లుక్‌ను ఇస్తూ.. ఆరోగ్యాన్ని కూడా పర్యవేక్షించే స్మార్ట్ వాచ్‌ల వైపు లేడీస్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ కోవకే చెందిన ‘Pebble Vienna Women Smartwatch’ తన ప్రత్యేకమైన డిజైన్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇది చూడటానికి ఒక ఖరీదైన వాచ్ లాగా కనిపిస్తుంది. కానీ దీని ధర మాత్రం అందరికీ అందుబాటులో.. ఉండేలా నిర్ణయించారు. క్యాజువల్ వేర్, ట్రెడిషనల్ డ్రెస్సులు లేదా ఆఫీస్ వేర్..ఏ మోడరన్ బట్టలపైనైనా ఈ వాచ్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
ఈ స్మార్ట్ వాచ్ మెయిన్ హైలైట్ డిస్‌ప్లే, లుక్.ఇందులో 1.27 ఇంచుల అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేను వాడారు. దీని వల్ల స్క్రీన్‌పై ఉన్న అక్షరాలు, వాచ్ ఫేసులు చాలా స్పష్టంగా, బ్రైట్‌గా కనిపిస్తాయి. ఇక దీనికి ఇచ్చిన ‘డైమండ్ కట్ డిజైన్’ వాచ్ అందాన్ని మరింత పెంచుతుంది. గోల్డ్ కలర్ స్ట్రాప్‌తో వస్తున్న ఈ వాచ్ చేతికి పెట్టుకుంటే.. ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్రీ సైజ్ డిజైన్ కారణంగా ఇది ఎవరి చేతికైనా ఇది చాలా బాగా సెట్ అవుతుంది.
ఈ వాచ్ కేవలం అందానికే పరిమితం కాదు.. పవర్‌ఫుల్ టెక్నాలజీతో తయారు చేసింద. ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంది. కాబట్టి దీని ద్వారా ఫోన్ తీయకుండానే వాచ్ నుంచే.. నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు.అంతే కాకుండా రిసీవ్ చేసుకోవచ్చు. మైక్రోఫోన్ , స్పీకర్ క్వాలిటీ చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే.. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ‘ఫీమేల్ హెల్త్ ట్రాకర్’ ఫీచర్‌ను పొందుపరిచారు.ఇవి కాకుండా హార్ట్ రేట్ మానిటర్, SpO2 , స్లీప్ ట్రాకింగ్, వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో అందుబాటులో ఉన్నాయి.
Also Read: మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్..4 మైక్ ENC ఫీచర్‌తో కొత్త బౌల్ట్ ఇయర్‌బడ్స్!
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడేటప్పుడు తరచుగా ఛార్జ్ చేయాల్సి వస్తుందనే టెన్షన్ ఉంటుంది. కానీ.. ఈ పెబుల్ వియన్నా స్మార్ట్‌వాచ్ ఎఫీషియంట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌తో వస్తుంది. ఒక్కసారి ఫుడ్ ఛార్జ్ చేస్తే.. సాధారణ వాడకంలో ఇది రోజంతా లేకుండా పని చేస్తుంది. అలాగే ఇది డైలీ యూజ్‌కు సరిపోయేలా వాటర్ రెసిస్టెన్స్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంది. స్మార్ట్ ఫోన్‌లోని యాప్‌తో దీన్ని సింక్ చేసుకోవడం చాలా ఈజీ, దీనివల్ల సోషల్ మీడియా నోటిఫికేషన్లు, మెసేజ్‌లు అన్నీ వాచ్‌లోనే చూసుకోవచ్చు.
మార్కెట్లో లభించే ప్రీమియం ఉమెన్స్ స్మార్ట్ వాచ్‌లతో పోలిస్తే.. దీని ధర చాలా తక్కువ. ఈ మోడల్ మార్కెట్లో కేవలం రూ.2,390 ధరకే అందుబాటులో ఉంది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే.. లుక్ స్మార్ట్ ఫీచర్లు కోరుకునే.. మహిళలకు ఇది నిజంగా పర్‌ఫెక్ట్ ఛాయిస్.