E-Paper
Advertisement

Photoemission :

Photoemission :
Advertisement
Photoemission

Photoemission : అసలు లైట్ అంటే ఏంటి..? దేనితో తయారు చేస్తారు.? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటివి కాదు.. ఎన్నో శతాబ్దాల నుండి వినిపిస్తున్నవే. ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం నుండే చాలామంది శాస్త్రవేత్తల ప్రస్థానం మొదలయ్యింది. లైట్ అనేది ఒక ఎనర్జీ ఫార్మ్ అని, ఇది ఏ వస్తువు పైన పడినా రిఫ్లెక్ట్ అవుతుందని, దాని వల్లే వెలుగు అనేది వెలువడుతుందని పరిశోధనల్లో తేలింది. లైట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి క్వాంటమ్ మెకానిక్స్ అనే ప్రత్యేకమైన చాప్టర్ కూడా ఏర్పడింది.

లైట్ గురించి ఎన్ని విషయాలు తెలుసుకున్నా.. మరెన్నో విషయాలు మిస్టరీ లాగానే మిగిలిపోయాయి. లైట్ నేచర్ కూడా అందులో ఒకటి. అంటే లైట్ వేవ్ లాగా ప్రయాణిస్తుందా లేదా ఒక కణం లాగా ప్రయాణిస్తుందా తెలుసుకునే విషయంలో శాస్త్రవేత్తల పరిశోధనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 20 శతాబ్దంలో ఆల్బర్ట్ ఐన్‌స్టైన్.. లైట్ నేచర్ పార్టికులేట్ అని వివరించారు. అంటే ఇందులో ఫోటోన్స్ అనబడే చిన్ని చిన్న కణాలు ఉంటాయని ఆయన నిర్ధారించారు. కానీ చాలామంది ఇప్పటికి లైట్ అనేది వేవ్స్ రూపంలోనే ట్రావెల్ చేస్తుందని భావిస్తున్నారు.

Advertisement

లైట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం ఐన్‌స్టైన్ కూడా ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే ఒక థియరీపైన పరీక్షలు చేశారు. 1921లో ఫిజిక్స్‌లో ఆయనకు నోబెల్ ప్రైజ్ దక్కడానికి ఈ థియరీ కూడా ఒక కారణం. ముందుగా ఈ ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనే అంశాన్ని 1887లోనే హెయిన్‌రిచ్ రుడోల్ఫ్ హెర్ట్స్ అనే శాస్త్రవేత్త తెరపైకి తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏదైనా ఒక వస్తువుపై లైట్ వేసినప్పుడు దానిలో ఉంటే ఎలక్ట్రాన్స్ కారణంగా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇప్పటికీ కూడా ఈ థియరీపై రకరకాలుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో మారింది. అందుకే లైట్‌తో వెలువడే ఫోటోఎమిషన్స్‌ను శాస్త్రవేత్తలు చూసే దృష్టి కూడా మారింది. ముఖ్యంగా ఈ ఫోటోఎమిషన్స్ అనేవి మెడికల్ ఇమేజింగ్ పరికరాల్లో, సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో ఉపయోగపడుతున్నాయి. అసలు ఈ ఫోటోఎమిషన్స్ ఎలా పనిచేస్తాయని ప్రత్యేకంగా ఒక థియరీ లేదు. ఇప్పటికీ దీని వెనుక ఒక ప్రత్యేకమైన సైన్స్ లేదని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడడం ఆశ్చర్యంగా ఉన్నా.. పరిశోధనలు ఫెయిల్ అవ్వడం వల్ల వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×