BigTV English

AP: వైసీపీ ఎమ్మెల్యేపై వేటు.. 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. సభలో సమరం

AP: వైసీపీ ఎమ్మెల్యేపై వేటు.. 12 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్.. సభలో సమరం

AP: అనుకున్నట్టుగానే జరిగింది. ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. అంతలోనే గొడవ మొదలైంది. స్పీకర్ పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టారు. సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. వారికి వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జత కలిశారు. సభలో నిలబడి నాన్‌స్టాప్‌గా నిరసన తెలిపారు. అంతాకలిసి నినాదాలతో హోరెత్తించారు.


కట్ చేస్తే.. 12 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డినీ సభ నుంచి బహిష్కరించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పయ్యావుల, నిమ్మలను ఈ అసెంబ్లీ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు స్పీకర్. మిగతా టీడీపీ సభ్యులపై ఒకరోజు వేటు పడింది.

నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కోరితే తనను సభ నుంచి సస్పెండ్‌ చేయడమేంటని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రశ్నించారు. సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ ప్రకటించిన తర్వాత ఆయన పోడియం దగ్గర ఆందోళన చేశారు. దౌర్జన్యంగా తనను సస్పెండ్‌ చేశారని.. తాను చేసిన తప్పేంటో చెప్పాలంటూ నినాదాలు చేశారు. మార్షల్స్ అతన్ని బలవంతంగా బయటకు పంపించేశారు.


గవర్నర్‌ ప్రసంగంపై కొన్ని మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ ఆరోపణలకు కౌంటర్‌గా సభలో ఓ వీడియో ప్రదర్శించారు. అవాస్తవ ప్రచారాలపై స్పీకర్‌ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనేనని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు వాటిని ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలని.. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్‌ కమిటీకి రిఫర్‌ చేయాలని మంత్రి బుగ్గన స్పీకర్‌ను కోరారు.

గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?.. చాలా సీరియస్‌గా తీసుకుంటామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామని.. కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్‌ స్పష్టం చేశారు.

Viveka Case : వాళ్ల ప్రమేయం ఉంది.. వివేకా కుమార్తె సంచలన వ్యాఖ్యలు..

Perni Nani : బీజేపీతో కటీఫ్.. టీడీపీ పంచకు పవన్ : పేర్ని నాని

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×