E-Paper
Advertisement

PlayStation Holiday Sale: వందల్లో కాదు వేలల్లో తగ్గింపు.. సోనీ హాలిడే సేల్‌లో అదిరిపోయే డీల్స్.. మిస్ అవ్వకండి

PlayStation Holiday Sale: వందల్లో కాదు వేలల్లో తగ్గింపు.. సోనీ హాలిడే సేల్‌లో అదిరిపోయే డీల్స్.. మిస్ అవ్వకండి
Advertisement

PlayStation Holiday Sale: గేమింగ్ అంటే ఈరోజుల్లో కేవలం కాలక్షేపం కాదు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది గేమింగ్‌ను ఒక ఆసక్తిగా, స్ట్రెస్ తగ్గించే మార్గంగా, కొందరైతే కెరీర్ అవకాశంగా కూడా చూస్తున్నారు. రోజంతా పని ఒత్తిడి తర్వాత ఒక మంచి గేమ్ ఆడితే మనసు ప్రశాంతంగా మారుతుందన్న భావన గేమింగ్ ఆడేవాళ్లలో ఎక్కువగా ఉంటుంది. అందుకే కన్సోల్ గేమింగ్‌కు భారత్‌లో కూడా భారీ డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ప్లేస్టేషన్ అభిమానులు కొత్త గేమ్స్, యాక్సెసరీస్ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటారు. అలాంటి గేమర్ల కోసం ఇప్పుడు ప్లేస్టేషన్ ఇండియా ప్రత్యేక హాలిడే సేల్‌ను తీసుకొచ్చింది.

హాలిడే సేల్ పూర్తి వివరాలు

Advertisement

డిసెంబర్ 23 నుంచి ప్రారంభమైన ఈ హాలిడే సేల్ జనవరి 5, 2026 వరకు కొనసాగుతుంది. ఈ ఆఫర్‌లో భాగంగా పిఎస్5 యాక్సెసరీస్, ప్రముఖ గేమ్స్‌పై భారీ ధర తగ్గింపులు అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ లాంటి ఆన్‌లైన్ స్టోర్లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఈ డీల్స్ లభిస్తున్నాయి.

డ్యూయల్‌సెన్స్ కంట్రోలర్లపై భారీ తగ్గింపు

Advertisement

ఈ సేల్‌లో గేమర్లకు ఎక్కువగా ఆకర్షణగా నిలిచింది డ్యూయల్‌సెన్స్ కంట్రోలర్లు. సాధారణ వైట్, బ్లాక్ రంగుల వేరియంట్లు ఇప్పుడు రూ. 4,490 నుంచి రూ. 4,890 ధరలో లభిస్తున్నాయి. రెడ్, గ్రే కామో, ఐస్ బ్లూ లాంటి రంగులకూ ఇదే స్థాయి తగ్గింపు వచ్చింది. క్రోమాటిక్ టిల్, పెర్ల్, ఇండిగో వంటి ప్రీమియం ఫినిష్ కంట్రోలర్లు రూ. 5,349కే దొరుకుతున్నాయి. ప్రొఫెషనల్ గేమర్ల కోసం రూపొందించిన డ్యూయల్‌సెన్స్ ఎడ్జ్ కంట్రోలర్‌పై రూ. 3,000 తగ్గింపుతో ధర రూ. 15,990కి చేరింది.

Also Read: OnePlus Premium 5G Phone: ఇక చార్జింగ్ కష్టాలకు చెక్.. 8000mAh బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ కొత్త ఫోన్

ప్లేస్టేషన్ విఆర్2, ఆడియో యాక్సెసరీస్ డీల్స్

ఈ సేల్‌లో అత్యధిక డిస్కౌంట్ పొందింది ప్లేస్టేషన్ విఆర్2. సాధారణంగా రూ. 44,999 ధర ఉన్న ఈ విఆర్ హెడ్‌సెట్ ఇప్పుడు రూ. 34,999కే అందుబాటులో ఉంది. పల్స్ ఎలైట్ వైర్‌లెస్ హెడ్‌సెట్ ధర రూ. 10,990కి తగ్గింది. పల్స్ ఎక్స్‌ప్లోర్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌పై ఏకంగా రూ. 9,000 తగ్గింపుతో ధర రూ. 9,990 అయింది. ప్లేస్టేషన్ పోర్టల్ రిమోట్ ప్లేయర్ కూడా రూ. 16,990కే దొరుకుతోంది.

ప్రముఖ గేమ్స్ తక్కువ ధరల్లో

గేమ్స్ విషయానికి వస్తే సోనీ ఫస్ట్ పార్టీ టైటిల్స్ చాలా వరకు రూ. 2,600 లోపలే లభిస్తున్నాయి. గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ ఇప్పుడు రూ. 2,099కే అందుబాటులో ఉంది. స్పైడర్ మ్యాన్ 2, గ్రాన్ టూరిజ్మో 7, ఘోస్ట్ ఆఫ్ త్సుషిమా డైరెక్టర్ కట్ లాంటి గేమ్స్ అన్నీ రూ. 2,599 ధరకు తగ్గాయి. హారైజన్ జీరో డాన్ రీమాస్టర్డ్, అన్‌చార్టెడ్ లెగసీ ఆఫ్ థీవ్స్ కలెక్షన్ లాంటి గేమ్స్ రూ. 1,599కే దొరుకుతున్నాయి. ఈ హాలిడే సేల్ గేమింగ్ ప్రేమికులకు ఇది ఒక గొప్ప అవకాశం. యాక్సెసరీస్ అప్‌గ్రేడ్ చేయాలన్నా, కొత్త గేమ్స్ కొనాలన్నా ఈ సమయమే కరెక్ట్ కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం గేమింగ్ ప్రియులు లేట్ చేయకుండా కొనేయండి మరి.

Related News

రూ.5,500లకే బెస్ట్ ఆటో-క్లీన్ చిమ్నీలు! మీ వంటగదికి ఏది పర్ఫెక్ట్ ?

బెస్ట్ వాషింగ్ మెషీన్ కొనాలా? అమెజాన్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న మోడల్స్!

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

Big Stories

Advertisement
×