TDP Parliamentary: ఎన్నో కసరత్తుల తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి మూడు పార్లమెంటు పార్టీ అధ్యక్షుల ఎంపిక పూర్తయ్యింది..మూడు పార్లమెంటు కు సంబంధించిన అధ్యక్షుల ఎంపిక తర్వాత కార్యకర్తలకు, నాయకులకు ఉహించని షాక్ తగిలింది..సామాజిక సమీకరణాల నేపథ్యంలో అధ్యక్షులను ఎంపిక చేసినప్పటికి తమకి పరిచయం లేని వారంటు పెదవి విరుస్తున్నారంట క్యాడర్ . అయితే అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్షుడు ఎవ్వరైతే ఏమిటి అన్న రీతిలో ఎంపిక జరిగిందని అంటున్నారంటా తెలుగు తమ్ముళ్లు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుల జాబితా తాజాగా విడుదల అయ్యింది. అయితే అధికారికంగా ప్రకటించక పోయినప్పటికి వారి పేర్లు బయటకు వచ్చిన తర్వాత మిశ్రమ స్పందన కన్పిస్తుంది..తిరుపతి పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలిగా మాజీ కేంద్ర మంత్రి ,టిటిడి దర్మకర్తలి మండలి సభ్యురాలు అయిన పనబాక లక్ష్మి ,చిత్తూరుకు సంబంధించి నగరి నియోజకవర్గానికి చెందిన షణ్ముగ రెడ్డి, రాజంపేటకు సుగవాసి ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది..అధికారిక ప్రకటన వెలువడ్డమే తరువాయి..
అధ్యక్ష ఎంపిక ఓ ప్రహాసనంలా మారిందని అప్పుడే విమర్శలు వచ్చాయి..ముఖ్యంగా మాజీ లతో పాటు చాలామంది సీనియర్ నాయకులు ప్రయత్నాలు చేసారు.. తిరుపతి కి సంబంధించి తాజా అధ్యక్షుడు యాదవ కార్పోరేషన్ చైర్మన్ నరసింహా యాదవ్ తో పాటు శ్రీధర్ వర్మతో పాటు పలువురు ప్రయత్నించారు. ఒకనొక దశలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కూమార్ పేరు వచ్చింది..అయితే ఐవిఅర్ఎస్ లో మాత్రము ఉన్నట్లుండి పనబాక లక్ష్మితో పాటు నరసింహాయాదవ్ పేర్లతో సర్వే నిర్వహించారు..ఆ తర్వాత జోనల్ కో అర్డినేటర్ పార్టీ కార్యాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి అందరి అభిప్రాయాలను సేకరించాడు..ఈసందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చింది…అయితే ఉన్నట్లుండి పనబాక లక్ష్మి పేరు ఖరారు అయ్యింది..
చిత్తూరు కు సంబంధించి సీనియర్లు ప్రయత్నించారు..పార్టీ అవిర్బావం నుంచి పార్టీ కోసం శ్రమించిన వారితో పాటు పలువురు ప్రయత్నించారు..తమకే వస్తుందని కొన్నారు..అయితే ఉన్నట్టుండి సామాజిక సమీకరాల పేరుతో పుత్తూరు కు చెందిన షణ్ముగ రెడ్డికి అవకాశం కల్పించారు.. సీనియర్లు ఎన్పీ జయప్రకాష్, మాజీ జడ్పీచైర్మన్ గీర్వాణి చంద్ర ప్రకాష్ దంపతులు చిత్తూరు కు చెందిన వసంత నాయుడుతో పాటు తాజా అధ్యక్షుడు అయిన సిఅర్ రాజన్ ప్రయత్నాలు చేసారు.అయితే ఐవిఅర్ ఎస్ కాల్ లో షణ్ముగ రెడ్డితో పాటు సిఅర్ రాజన్ పేరు వచ్చింది. షణ్ముగరెడ్డి ఎవరంటు అప్పట్లో చర్చ నడిచింది..తాజాగా షణ్ముగరెడ్డి పేరు ఖరారు కావడంతో సీనియర్లు మనస్తాపానికి గురయ్యారంట.. నగరి ఎంఎల్ఎ భాను తన నియోజకవర్గానికి చెందిన వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన షణ్ముగ రెడ్డి ఎంపికలో చక్రం తిప్పారంట
రాజంపేట పార్లమెంటు కు సంబంధించి మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పాలకొండ్రాయుడి కూమారుడు సుగవాసి ప్రసాద్ ను ఎంపిక చేసారు.. ఇక్కడ నలుగురు పోటీ పడ్డారు .. మంత్రి రాంప్రసాద్ రెడ్డి , సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేశ్‌తో పాటు పీలేరు మాజీ టిడిపి కన్వీనర్ రవి ప్రకాష్ ప్రయత్నించారు..అయితే సుగవాసి ప్రసాద్‌ను ఖరారు చేసింది అధిష్టానం..ఆయన బలిజ సామాజిక వర్గం వ్యక్తి కావడం ఇక్కడ ప్లస్ కానుంది. దీనికితోడు గతంలో అయన తండ్రి రాజంపేట ఎంపిగా పనిచేయడం కూడా రాజంపేట పార్లమెంటు పరిధిలో పరిచయాలు ఉండటం పార్టీకి లాభిస్తుంది..
అయితే గత ఎన్నికలలో రాజంపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయిన ప్రసాద్ సోదరుడు సుబ్రమణ్యం వైసీపీలో చేరాడు.. ప్రసాద్ పార్టీలోనే కొనసాగడం ప్లస్ అయ్యింది. ఆయనకు మంత్రితో పాటు సీనియర్ నాయకులు సహాకరిస్తారా అన్నది ఇప్పుడు చర్చగా మారింది..ఎస్సీ కోటా కింది పనబాక లక్ష్మి ని నియమించినట్లు తెలుస్తోంది. పార్లమెంటు పరిధిలో సత్యవేడు,సూళ్ళురు పేట,గూడూరు నియోజక వర్గాలు ఉండటం వల్ల ఎస్ సికె ఇచ్చినట్లు తెలస్తోంది.అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కొత్త అధ్యక్షుల కు మాత్రం వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం కత్తి మీద సాములా ఉంటుందని అంటున్నారు.దీనికితోడు తంబల్లపల్లి, మదనపల్లి, రాజంపేటలలోని గ్రూపు పాలిటిక్స్ ప్రసాద్ కు తలనొప్పిగా మారనుంది..
చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడికి మాత్రం కొంత సులువుగా ఉంటుందని అంటున్నారు..ఇక్కడ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో అధిపత్యం వహిస్తున్నారు..పార్టీ కంటే వారే బలంగా ఉండటం వల్ల అధ్యక్షుని పాత్ర నామమాత్రమే..అయితే తిరుపతి లో మాత్రం అంతా సమస్యల మయం..తిరుపతిలోని గ్రూపు పాలిటిక్స్,,అదే విదంగా సత్యవేడు గొడవలు తల నొప్పిగా మారనున్నాయి..దీంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గొడవ ,,ఇప్పటికి తిరుపతి కి ఇన్ చార్జ్ లేక పోవడం కూడా తలనొప్పిగా మారనుంది..మొత్తం మీదా ఉహించని విధవగా నియమించబడ్డ అభ్యర్థుల ఏమి చేయబొతారో అన్నది చూడాలి.