BigTV English
Advertisement

POCO 5G Mobile Discount: దిమ్మతిరిగే డీల్.. రూ.10 వేల కంటే తక్కువకే 5జీ ఫోన్లు.. ఎవరికీ చెప్పొద్దు..

POCO 5G Mobile Discount: దిమ్మతిరిగే డీల్.. రూ.10 వేల కంటే తక్కువకే 5జీ ఫోన్లు.. ఎవరికీ చెప్పొద్దు..

Cheapest 5G Smartphones: ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. తరచూ కొత్త కొత్త ఫోన్లు కొనేవారు ఎక్కువైపోయారు. చాలా మంది ఒకటి లేదా రెండు స్మార్ట్‌ఫోన్లు యూజ్ చేస్తున్నారు. అందువల్లనే ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీలు సైతం తరచూ అప్‌డేటెడ్ వెర్షన్లతో కొత్త కొత్త ఫోన్లను మార్కెట్‌లో లాంచ్ చేస్తూ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అందులోనూ ఇప్పుడంతా 5జీ మయమైపోయింది. దీంతో 5జీ ఫోన్లను క్రేజ్ పెరిగింది.


అందుచేతనే ఇప్పుడు మార్కెట్‌లోకి ఎక్కువగా 5జీ నెట్‌వర్క్‌తో ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. అదే సమయంలో వాటి ధరలు కూడా అధికంగా ఉండటంతో సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారింది. అందువల్ల అలాంటి వారి ఆశలు, కోరికలు తీర్చేందుకు ప్రముఖ టెక్ బ్రాండ్ పోకో అతి తక్కువ ధరలోనే 5జీ ఫోన్లను లాంచ్ చేస్తూ ఆకట్టుకుంటుంది. కేవలం రూ.10000 ధరలోనే అందుబాటులోకి తీసుకొస్తూ అందరి చూపు తనవైపుకు తిప్పుకుంటుంది.

మరి సామాన్యులకు అందుబాటు ధరలో అంటే రూ.10 వేలలోపు కొనుక్కోగలిగే పోకో ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో పోకో ఎం 6 5జీ, పోకో ఎం6 ప్రో 5జీ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు కేవలం రూ.10000 ధరలో లభిస్తున్నాయి. వీటితో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లతో మరింత తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


POCO M6 5G

Also Read: పిచ్చెక్కించే ఆఫర్.. రూ.8,900లకే 5జీ ఫోన్.. ఎవరికీ చెప్పొద్దు మావా..!

POCO M6 5G స్మార్ట్‌ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అందులో 4GB RAM + 128GB Storage వేరియంట్ లాంచ్ ధర రూ. 12,999 ఉండగా.. ఇప్పుడు రూ.9,249 లకు అందుబాటులో ఉంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. అలాగే 6GB RAM + 128GB Storage వేరియంట్ లాంచ్ సమయంలో రూ.13,999కు వచ్చింది. ఇప్పుడు దీనిని రూ.9,999లకు కొనుక్కోవచ్చు. అదనంగా రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్ కింద రూ.1000 వరకు లభిస్తుంది. అప్పుడు మరింత తక్కువ ధరకే ఈ వేరియంట్‌ను సొంతం చేసుకోవచ్చు. టాప్ అండ్ హై వేరియంట్ 8GB RAM + 256GB Storage లాంచ్ సమయంలో రూ.13,499కి అందుబాటులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దీనిని రూ.10,999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై రూ.1000 వరకు బ్యాంక్ తగ్గింపు ఉంది. అందువల్ల తక్కువ ధరలో ఒక మంచి ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే బెస్ట్ టైం.

POCO M6 5G Pro

POCO M6 Pro 5G కూడా తక్కువ ధరలో లభిస్తుంది. దీని 4GB RAM + 128GB Storage వేరియంట్ లాంచ్ ధర రూ.15,999 ఉండగా ఇప్పుడు 38 శాతం తగ్గింపుతో రూ.9,999లకే కొనుక్కోవచ్చు. దీనపై రూ.500 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. దీంతో ఇది మరింత తక్కువకే లభిస్తుంది. అలాగే రూ.1000 వరకు బ్యాంక్ తగ్గింపు పొందొచ్చు. ఇంకోటి 6GB RAM + 128GB Storage వేరియంట్ ధర రూ.16,999 ఉండగా.. ఇప్పుడు 35 శాతం తగ్గింపుతో కేవలం రూ.10,999లకే కొనుక్కోవచ్చు. దీనిపై కూడా రూ.500 కూపన్ తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.1000 వరకు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఫోన్లను ఆఫర్లతో అమెజాన్‌లో కొనుక్కోవచ్చు. అందువల్ల ఒక 5జీ ఫోన్‌ను తక్కువ ధరలో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నట్లయితే ఇదే బెస్ట్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు.

Related News

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Redmi Note 16 Pro 5G: కేవలం రూ.18 వేలలో ఫ్లాగ్‌షిప్‌ లుక్‌.. రెడ్‌మి నోట్ 16 ప్రో 5జి పూర్తి వివరాలు

Big Stories

×