BigTV English

POCO M6 5G Discount: పిచ్చెక్కించే ఆఫర్.. రూ.8,900లకే 5జీ ఫోన్.. ఎవరికీ చెప్పొద్దు మావా..!

POCO M6 5G Discount: పిచ్చెక్కించే ఆఫర్.. రూ.8,900లకే 5జీ ఫోన్.. ఎవరికీ చెప్పొద్దు మావా..!

Amazon Great Freedom Festival sale 2024: కొత్త 5జీ ఫోన్‌ను అతి తక్కువ ధరలో మంచి డిస్కౌంట్‌తో కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. ఇప్పుడు మీ కలను సహకారం చేసుకునే అద్భుతమైన అవకాశం వచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై వినియోగదారులకు బంపర్ డిస్కౌంట్లను అందిస్తున్నారు. వినియోగదారులు తమకు ఇష్టమైన గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై ఆకర్షణీయమైన తగ్గింపులను పొందుతున్నారు.


ఇందులో భాగంగానే ఈ సేల్‌లో అమెజాన్ Poco X6 Neo 5G, Poco M6 5Gపై అదిరిపోయే డిస్కౌంట్లు ప్రకటించింది. సేల్‌ సమయంలో Poco M6 5G ఫోన్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ రూ. 8,949కి, Poco X6 Neo ఫోన్ 8GB RAM + 128GB స్టోరేజ్‌ వేరియంట్ రూ.12,484కి అందుబాటులో ఉంది. అదనంగా 3% తగ్గింపు పొందడానికి వినియోగదారు FQSMWNXZ కూపన్ కోడ్‌ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇది కాకుండా 6 నెలల వరకు నో-కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది.

Also Read: ఉఫ్.. వివో ఫోన్‌పై డిస్కౌంట్ల వర్షం.. 8జీబీ ర్యామ్ వేరియంట్ ఇంత తక్కువ..!


Poco M6 స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. Poco M6 స్మార్ట్‌ఫోన్ 6.74 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6100+ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది 8GB RAM + 256GB వరకు స్టోరేజ్‌ను కలిగి ఉంది. విశేషమేమిటంటే ఇందులో ‘టర్బో ర్యామ్’ ఉంది. ఇది 8GB వర్చువల్ ర్యామ్‌తో బూస్ట్‌ను అందిస్తుంది. కెమెరా విషయానికొస్తే.. Poco M6 డ్యూయల్ రియర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది.

Poco X6 Neo స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. Poco ఫోన్‌లో 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 1080 పిక్సెల్ రిజల్యూషన్‌ను అందిస్తుంది. 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ MediaTek Dimension 6080 ప్రాసెసర్‌తో వస్తుంది. ఫోటోగ్రఫీ కోసం ఇది 108-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్‌ను పవర్ చేయడానికి కంపెనీ ఇందులో 5,000mAh బ్యాటరీని చేర్చింది. ఈ ఫోన్ Android 13 ఆధారిత MIUI 14తో వస్తుంది. Poco ఈ ఫోన్‌కు రెండేళ్లపాటు OS అప్‌గ్రేడ్‌లు, నాలుగు సంవత్సరాల పాటు సేఫ్టీ అప్‌డేట్‌లు లభిస్తాయని పేర్కొంది. కనెక్టివిటీ కోసం, 5G, బ్లూటూత్ 5.3, ఫింగర్ ప్రింట్ సెన్సార్, హెడ్‌ఫోన్ జాక్స్ స్పీకర్, డ్యూయల్ సిమ్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై అందించబడ్డాయి.

Related News

Galaxy S24 vs iPhone 16 Pro: గెలాక్సీ S24 అల్ట్రా vs ఐఫోన్ 16 ప్రో.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో ఏది బెస్ట్?

iPhone 17 Series 5G: ఐఫోన్ 17 సిరీస్ 5జి.. కొత్త ఫీచర్లతో టెక్ లవర్స్‌కి పెద్ద గిఫ్ట్

Apple Foldable iPhone: ఆపిల్ ఫోల్డెబుల్ ఫోన్ డిజైన్ లీక్.. అత్యంత ఖరీదైన ఐఫోన్ ఇధే

Samsung Galaxy S25 5G: వామ్మో.. ఏకంగా 200MP కెమేరానా.. మార్కెట్లోకి వచ్చేసిన సామ్‌సంగ్ గెలెక్సీ ఎస్25 5G

PS5 Big Discount: ప్లే స్టేషన్ 5పై భారీ తగ్గింపు.. ఇండియాలో మాత్రమే

Amazon Flipkart Iphones: అమెజాన్ ఫ్లిప్‌కార్ట్‌ ఫెస్టివల్ సేల్.. ఐఫోన్ 15, 16పై బెస్ట్ డీల్స్ ఇవే

Realme 15T 5G: రియల్‌మీ 15టి 5జి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. పవర్ యూజర్స్ కోసం స్పెషల్ మొబైల్..

WhatsApp Secert Chat: వాట్సాప్ లో సీక్రెట్ చాటింగ్ ఫీచర్..  ఎలా చేయాలంటే..

Big Stories

×