E-Paper
Advertisement

Redmi Half Price: 8GB ర్యామ్‌గల రెడ్‌మి బెస్ట్ సెల్లింగ్ ఫోన్ సగం ధరకే.. అమెజాన్‌లో బెస్ట్ డీల్

Redmi Half Price: 8GB ర్యామ్‌గల రెడ్‌మి బెస్ట్ సెల్లింగ్ ఫోన్ సగం ధరకే.. అమెజాన్‌లో బెస్ట్ డీల్
Advertisement

Redmi Half Price Amazon | అమెజాన్‌లో తాజాగా ఒక సూపర్ డీల్ అందుబాటులో ఉంది. ఇది రెడ్‌మి బ్రాండ్ కి చెందిన ఒక పాపులర్ 5G స్మార్ట్‌ఫోన్‌పై ఒక అద్భుతమైన ఆఫర్. రెడ్‌మి 13 5G 2024 జులైలో రూ.19,999 ధరతో మార్కెట్‌లో లాంచ్ అయింది. కానీ ఇప్పుడు ఆఫర్ లో భాగంగా దాదాపు సగం ధరకే కొనుగోలు చేసే అవకాశం ఉంది. అమెజాన్‌లో 44 శాతం భారీ తగ్గింపుతో దీని ధర రూ.11,199కి తగ్గింది. అంటే కొత్త కొనుగోలుదారులకు నేరుగా రూ.8,800 కంటే ఎక్కువ సేవింగ్స్ చేయవచ్చు.

ధర తగ్గింపు వివరాలు

ఈ ప్రత్యేక ఆఫర్ హవాయియన్ బ్లూ రంగు వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుంది. మరో విశేషమేమిటంటే.. అమెజాన్ పే ద్వారా చెల్లింపు చేస్తే మరో రూ.559 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫైనల్ ధర రూ.10,500 నుంచి రూ.10,640 మధ్యలో ఉంటుంది. అంటే రూ.20,000 ధర ఉన్న ఫోన్ ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకు మీ చేతికి వచ్చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఇంత మంచి డీల్ వేరే ఎక్కడా లేదు. ఇంత తక్కువ ధరలో లభించే ఈ ఫోన్ ఫీచర్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

డిస్‌ప్లే

Advertisement

రెడ్‌మి 13 5G లో 6.79 అంగుళాల పెద్ద FHD+ డిస్‌ప్లే ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటం చాలా సరదాగా ఉంటుంది. స్క్రీన్ పిక్చర్ క్వాలిటీ స్పష్టంగా కనిపిస్తుంది.

పర్‌ఫామెన్స్

ఫోన్ పనితీరు విషయంలో స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ప్రాసెసర్ ఉంది. దీంతో పాటు 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్ కూడా ఉన్నాయి. ఎన్ని యాప్స్ ఓపెన్ చేసినా ఫోన్ నెమ్మదిగా రాకుండా స్మూత్‌గా పనిచేస్తుంది.

కెమెరా

Advertisement

కెమెరా పరంగా 108 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంది. దీంతో చాలా అందమైన, స్పష్టమైన ఫోటోలు తీయవచ్చు. 3x జూమ్ కూడా ఉంది కాబట్టి దూరంలో ఉన్న వస్తువులను కూడా బాగా దగ్గర చేసి ఫోటో తీయవచ్చు. పోర్ట్రెయిట్ షాట్స్ కోసం 2 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్ ఉంది. ముందు వైపు 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ క్వాలిటీ బాగుంటుంది.

బ్యాటరీ, కనెక్టివిటీ

ఈ రెడ్‌మి ఫోన్‌లో బ్యాటరీ 5030 mAh ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా సులువుగా పనిచేస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి త్వరగా ఛార్జ్ అవుతుంది. 5G, వై-ఫై, బ్లూటూత్ 5.4, GPS, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్.. అన్నీ ఉన్నాయి.

లిమిటెడ్ ఆఫర్

మొత్తంమీద ఈ ధరలో ఇంత మంచి 5G ఫోన్ దొరకడం చాలా అరుదు. ఈ ఆఫర్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నవాళ్లు ఆలస్యం చేయకుండా ఇప్పుడే అమెజాన్‌లో ఆర్డర్ చేసేయండి. రూ.20,000 ఫోన్‌ రూ.10,500కే తెచ్చుకునే అద్భుత అవకాశం మళ్లీ రాదు!

Also Read:  24 గంటల్లో ఇల్లు కట్టేసే సాలీడు రోబోట్.. సిమెంట్‌తో కాదు వ్యర్థాలతోనే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×