E-Paper
Advertisement

ఒకేసారి 3 డివైజ్‌లకు ఛార్జ్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?

ఒకేసారి 3 డివైజ్‌లకు ఛార్జ్.. ధర కూడా చాలా తక్కువ తెలుసా ?
Advertisement

Portronics Titan 35 Power Bank Price: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బ్యాటరీ అయిపోతుందనే భయం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఫోన్ స్విచ్ఛాఫ్ అయితే వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ఇలాంటి సమస్యలకు స్టైలిష్‌గా చెక్ పెట్టేందుకు ప్రముఖ బ్రాండ్ పోర్ట్రానిక్స్, సరికొత్త ‘టైటాన్ 35’ (Titan 35) పవర్ బ్యాంక్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. భారీ 20,000mAh బ్యాటరీ కెపాసిటీ, 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన ఈ గాడ్జెట్ ఫీచర్లు, ధర , దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పోర్ట్రానిక్స్ టైటాన్ 35 పవర్ బ్యాంక్:

ఈ రోజుల్లో రీల్స్ చూడాలన్నా.. గేమింగ్ ఆడాలన్నా ఫోన్లలో ఛార్జింగ్ ఇట్టే అయిపోతుంది. అందుకే మన జేబులో మంచి పవర్ బ్యాంక్ ఉండటం చాలా అవసరం. కస్టమర్ల పల్స్ తెలిసిన పోర్ట్రానిక్స్ కంపెనీ, తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లు ఉండేలా పోర్ట్రానిక్స్ టైటాన్ 35 పవర్ బ్యాంక్‌ను మార్కెట్లోకి తెచ్చింది.

Advertisement

1.పవర్‌ఫుల్ బ్యాటరీ కెపాసిటీ:
ఈ పవర్ బ్యాంక్ ప్రధాన హైలైట్ దీని 20,000mAh భారీ బ్యాటరీ కెపాసిటీ. సాధారణంగా 5,000mAh బ్యాటరీ ఉండే స్మార్ట్‌ఫోన్‌ను దీని సాయంతో ఈజీగా 3 నుంచి 4 సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ ట్రిప్స్ వేసే వారికి.. ఆఫీస్ పని మీద రోజంతా బయట తిరిగే వారికి ఇది బెస్ట్ పవర్ హౌస్ లా పని చేస్తుంది.

2.35W బుల్లెట్ స్పీడ్ ఛార్జింగ్:
పాతకాలం పవర్ బ్యాంకుల లాగా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పని లేకుండా.. ఇందులో 35W Fast Charging (Power Delivery – PD)సపోర్ట్ ఇచ్చారు. దీని వల్ల మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా వేగంగా ఛార్జ్ అవుతాయి. అంతేకాదు.. ఈ పవర్ బ్యాంక్‌ను తిరిగి రీఛార్జ్ చేయడం కూడా అంతే స్పీడ్‌గా అయిపోతుంది.

Advertisement

3.ట్రిపుల్ పోర్ట్ మ్యాజిక్:
పోర్ట్రానిక్స్ టైటాన్ 35 లో మల్టిపుల్ పోర్ట్స్ సపోర్ట్ ఉంది. ఇందులో రెండు టైప్-సి పోర్ట్‌లు, ఒక యూఎస్‌బీ-ఏ (USB-A) పోర్ట్ ఇచ్చారు. అంటే, మీరు ఒకే టైమ్‌లో మీ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ వాచ్ , ఇయర్‌బడ్స్‌ను ఒకేసారి ఛార్జ్ చేసుకోవచ్చన్నమాట. డివైజ్ లోపల కరెంట్ ఫ్లోను కంట్రోల్ చేయడానికి అడ్వాన్స్‌డ్ చిప్స్ వాడారు. కాబట్టి ఓవర్ హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సే లేదు.

Also Read: ఆకుకూరలు వారం రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలా ? సూపర్ స్మార్ట్ ఫీచర్లున్న బెస్ట్ ఫ్రిజ్‌లు

4.డిజైన్ అండ్ డిస్‌ప్లే:
లుక్ పరంగా ఇది చాలా కాంపాక్ట్‌గా, చేతిలో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ప్రీమియం ఫినిషింగ్‌తో వచ్చే ఈ పవర్ బ్యాంక్‌పై ఒక స్మార్ట్ LED డిస్‌ప్లే ఉంటుంది. దీనివల్ల పవర్ బ్యాంక్‌లో ఇంకా ఎంత శాతం బ్యాటరీ మిగిలి ఉందో పక్కాగా తెలిసిపోతుంది.

5.ధర: 
మార్కెట్లో ఈ పోర్ట్రానిక్స్ టైటాన్ 35 పవర్ బ్యాంక్ కేవలం రూ.1,699 బడ్జెట్ ధరకే అందుబాటులోకి వచ్చింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ , ప్రముఖ రీటైల్ స్టోర్లలో ఇది లభిస్తుంది. దీనిపై కంపెనీ వారంటీ కూడా అందిస్తోంది.

రూ. 2000 లోపు బడ్జెట్‌లో.. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తూ, ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే నమ్మకమైన బ్రాండెడ్ పవర్ బ్యాంక్ కావాలనుకుంటే.. కళ్లు మూసుకుని పోర్ట్రానిక్స్ టైటాన్ 35 ని ఆర్డర్ చేసుకోవచ్చు.

Related News

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

Big Stories

Advertisement
×