E-Paper
Advertisement

LPG Gas Saving Tips: LPG గ్యాస్ ఆదా సీక్రెట్: ప్రెజర్ కుక్కర్ Vs ఓపెన్ కుకింగ్.. ఏది వాడితే మంచిది?

LPG Gas Saving Tips: LPG గ్యాస్ ఆదా సీక్రెట్: ప్రెజర్ కుక్కర్ Vs ఓపెన్ కుకింగ్.. ఏది వాడితే మంచిది?
Advertisement

LPG Gas Saving Tips: ప్రస్తుతం నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది ఇళ్లలో వాడే.. వంట గ్యాస్ ధర సామాన్యుడికి భారంగా తయారవుతోంది. ఈ క్రమంలో గ్యాస్ పొదుపు చేయడం అనేది చాలా అవసరం. సాధారణంగా మనం వంట చేసే పద్ధతిని బట్టి గ్యాస్ ఆదా చేయొచ్చు. ఇదిలా ఉంటే చాలా మందికి వచ్చే సందేహం ఏంటంటే ప్రెజర్ కుక్కర్ వాడటం మంచిదా ? లేదా సాధారణ గిన్నెలు వాడితే మంచిదా ? అని. ఇంతకీ గ్యాస్ సేవ్ చేయడానికి ఏది మంచిది. తక్కువ గ్యాస్‌తో ఎక్కువ వంటలు వేటిలో చేయొచ్చు అనే విషయాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రెషర్ కుక్కర్.. గ్యాస్ ఆదాలో కింగ్:

ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల గ్యాస్ ఆదా అవుతుందని చాలా మందికి తెలుసు. దీని వెనక ఉన్న సైన్స్ చాలా సింపుల్ అదేంటంటే..

Advertisement

1.అధికఉష్ణోగ్రత: సాధారణ గిన్నెలో నీరు 100 డిగ్రీల సెల్సియస్ మరుగుతుంది. కానీ కుక్కర్ లోపల మాత్రం ఒత్తిడి వల్ల నీరు సుమారు 121 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తుంది. దీని వల్ల ఆహారం వేగంగా ఉడుకుతుంది.

2.సమయం ఆదా: ఓపెన్ కుకింగ్‌తో పోలిస్తే ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల 70 శాతం టైమ్ సేవ్ అవుతుంది. సమయం ఆదా అయితే ఆటోమెటిక్ గా గ్యాస్ వాడకం కూడా తగ్గుతుంది.

Advertisement

3. నీటి ఆదా: ప్రెషర్ కుక్కర్‌లో నీటి ఆవిరి బయటకు పోదు కాబట్టి తక్కువ నీటితోనే వంట పూర్తవుతుంది.

మూత తీసి వండటం ఎప్పుడు అవసరం:
కొంత మంది వంట ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి మూత తీసి వండుతారు. గ్యాస్ ఖర్చు పరంగా చూస్తే ఇది నష్టమే అని చెప్పాలి.

1. ఆవిరి: మూత లేకుండా ఆహారం వండినప్పుడు పాత్రలోని వేడి ఆవిరి గాలి లోకి కలిసిపోతుంది. దీని వల్ల ఆహారం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. అంటే గ్యాస్ కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది.

2. కొన్ని రకాల వంటలు: ఆకుకూరల వంటివి రంగు మారకుండా ఉండటానికి మాత్రమే ఓపెన్ కుకింగ్ ఉపయోగపడుతుంది. కానీ పప్పులు, నాన్ వెజ్ వంటి ఎక్కువ టైం తీసుకునే వంటలకు ఏ మాత్రం ఇది సరికాదు.

గ్యాస్ ఆదా చేయడానికి మరికొన్ని టిప్స్:

1.పప్పులను నానబెట్టండి: వంట చేయడానికి గంట ముందుగానే పప్పు లేదా బియ్యాన్ని నానబెట్టడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. ఇది సుమారు 20 శాతం వరకు గ్యాస్‌ను ఆదా చేస్తుంది.

2. చిన్న మంట: నీరు మరగడం ప్రారంభం అయిన తర్వాత మంటను వెంటనే తగ్గించండి. ఎక్కువ మంట వల్ల నీరు ఆవిరి అవుతుందే తప్ప వంట త్వరగా అవ్వదు.

3.పాత్రల సైజు: గ్యాస్ బర్నర్‌కు తగ్గట్టుగానే వంట పాత్రలను వాడాలి. చిన్న గిన్నెను పెద్ద బర్నర్ మీద పెడితే.. వేడి పక్కన నుంచి వృధా అవుతుంది.

4. ఫ్రిజ్ నుంచి తీసిన వెంటనే వండకండి: కూరగాయలు లేదా పాలను ఫ్రిజ్ నుంచి బయటకు తీసిన వెంటనే పొయ్యి మీద పెట్టకండి. ఇవి గది ఉష్ణోగ్రత(Room Temperature)కు వచ్చిన వెంటనే వంట ప్రారంభించండి.

5. శుభ్రమైన బర్నర్: గ్యాస్ బర్నర్ నుంచి పసుపు రంగు మంట వస్తుంటే.. అది గ్యాస్ వృధా అవుతుందని గుర్తించండి. బర్నర్ రంధ్రాలను క్లీన్ చేస్తే నీలం రంగు మంట వస్తుంది.

గమనిక: 

ఈ సమాచారం గృహిణులు, వంట చేసే వారికి అవగాహన కల్పించడం కోసం మాత్రమే. గ్యాస్ కనెక్షన్ దగ్గర ఎప్పుడూ భద్రతా నియమాలు పాటించండి.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×