E-Paper
Advertisement

Health Tips: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? తెల్లారేసరికి మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!

Health Tips: రాత్రంతా ఏసీ వేసుకుని పడుకుంటున్నారా? తెల్లారేసరికి మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
Advertisement

Health Tips: ఈ ఎండలకు పగలు ఏదోలా నెట్టుకొచ్చినా.. రాత్రిపూట మాత్రం ఆ ఉక్కపోతకు నిద్ర రావడం గగనమైపోతుంది. అందుకే ఇప్పుడు చాలా ఇళ్లలో ఏసీ అనేది అత్యవసర వస్తువుగా మారిపోయింది. స్విచ్ వేయగానే వచ్చే ఆ చల్లటి గాలిలో హాయిగా ముసుగుతన్ని పడుకోవడం అందరికీ ఇష్టమే. కానీ, రాత్రంతా అలా ఏసీ కిందే ఉండటం వల్ల మనకు తెలియకుండానే బాడీలో కొన్ని మార్పులు మొదలవుతాయి. అసలు ఏసీ వల్ల ఏం జరుగుతుంది? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

టెంపరేచర్ తగ్గించేస్తున్నారా?

ఏసీ ఉంటే నిద్ర బాగా పడుతుంది అనుకుంటాం కానీ, టెంపరేచర్ మరీ తగ్గించేస్తేనే అసలు గొడవ మొదలవుతుంది. చాలామంది 18 లేదా 20 డిగ్రీల దగ్గర పెట్టి పడుకుంటారు. దీనివల్ల అర్ధరాత్రి వచ్చేసరికి గది మరీ చల్లగా తయారై, చలికి వణుకుతూ మెలకువ వచ్చేస్తుంది. అందుకే నిపుణులు ఏమంటారంటే.. ఏసీని ఎప్పుడూ 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం బెటర్. అప్పుడే బాడీకి కావాల్సిన కంఫర్ట్ దొరుకుతుంది. నిద్ర కూడా డిస్టర్బ్ అవ్వదు.

Advertisement

Also Read: ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే.. ఇంట్లో ఉన్న పాత గిన్నెలన్నీ ఇండక్షన్ స్టవ్‌పై వాడేసుకోచ్చు! 

చర్మం పొడిబారిపోకూడదంటే?

ఏసీలో ఉన్న పెద్ద మైనస్ ఏంటంటే.. అది గదిలో ఉన్న తేమను పూర్తిగా తీసేస్తుంది. అందుకే ఏసీలో పడుకుని లేవగానే మన చర్మం కాస్త గరుగ్గా, పెదవులు పగిలినట్టు అనిపిస్తాయి. కొంతమందికి అయితే గొంతు ఎండిపోవడం, ముక్కులో ఏదోలా ఉండటం వంటివి జరుగుతాయి. ఇలా అవ్వకూడదు అంటే.. పడుకునే ముందు కాస్త మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వీలైతే గదిలో ఒక మూలన ఒక గిన్నెలో నీళ్లు నింపి పెట్టండి.. అప్పుడు గాలిలో తేమ తగ్గిపోకుండా ఉంటుంది. ముఖ్యంగా ఏసీ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. లేదంటే ఆ గాలి పీల్చడం వల్ల అలర్జీలు, తుమ్ములు విసిగిస్తాయి.

పొద్దున్నే నీరసంగా ఉంటోందా?

Advertisement

చాలామందికి పొద్దున్నే నిద్రలేవగానే ఒళ్లంతా హుషారుగా ఉండాల్సింది పోయి, ఏదో తెలియని నీరసం, కండరాలు పట్టినట్టు అనిపిస్తాయి. దీనికి కారణం ఏసీ గాలి నేరుగా ఒంటికి తగలడమే. చల్లటి గాలి నేరుగా తగిలితే కండరాలు బిగుసుకుపోతాయి. పైగా కిటికీలన్నీ మూసేసి ఉండటం వల్ల గదిలోకి ఫ్రెష్ గాలి రాదు. అందుకే లేవగానే తల భారంగా అనిపిస్తుంది.

స్లీప్ మోడ్ ఆన్ చేస్తున్నారా?

ఏసీ వాడుతూనే హెల్తీగా ఉండాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు. నిద్రపోయే ముందు గ్లాసుడు నీళ్లు తాగితే బాడీ డీహైడ్రేట్ అవ్వదు. అలాగే ఏసీలో ఉండే స్లీప్ మోడ్ ఆప్షన్‌ వాడండి. ఇది రాత్రి గడిచే కొద్దీ టెంపరేచర్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా.. పగలు కాసేపు కిటికీలు తెరిచి ఉంచితే తాజా గాలి లోపలికి వస్తుంది. ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, ఏసీ చల్లదనాన్ని ఎంజాయ్ చేస్తూనే ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.

Also Read: వావ్, ఏముందీ సోలార్ ఫ్యాన్ హ్యాట్.. ఎండలో తిరిగే వారికి ఏసీ కూలింగ్, ధర కూడా తక్కువే!

Related News

మరణం తర్వాత శరీరంలోని ఏ అవయవం ఎంతసేపు జీవించి ఉంటుంది? ఈ విషయాలు తెలుసా

జీవితంలో ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోరు, మోసపోరు.. చాణక్యుడు చెప్పిన ఈ నీతి సూత్రాలు పాటిస్తే

తక్కువ స్థలంలో కిచెన్ గార్డెన్‌.. ఇంట్లోనే కూరగాయలు పండించడం మరింత సులభం

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి ఉదయం త్వరగా లేస్తున్నారా? మీ శరీరానికి కలిగే నష్టాలివే

పిల్లలు రాత్రి ఏ సమయం కల్లా నిద్రపోవాలి? టైమ్‌కు నిద్రపోకపోతే మెదడుపై ప్రభావం

రక్తపోటు పెరగడానికి మౌత్ వాష్ కూడా ఒక కారణమేనా.. తాజా రీసెర్చ్ ఏం చెబుతోంది?

గ్రీన్ టీ తాగుతున్నా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ 5 తప్పులు చేస్తున్నట్టే!

గుండెపోటు వెనక అసలు విలన్ ప్లాస్టిక్కేనా? మెడికల్ హిస్టరీలోనే షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×