E-Paper
Advertisement

రూ.3వేలలోపు బెస్ట్ ఫిట్‌నెస్ వాచ్ కావాలా? దీని కంటే బెస్ట్ ఉండదు

రూ.3వేలలోపు బెస్ట్ ఫిట్‌నెస్ వాచ్ కావాలా?  దీని కంటే బెస్ట్ ఉండదు
Advertisement

Prowatch X smartwatch review: ఈ రోజుల్లో స్మార్ట్‌వాచ్ అనేది కేవలం టైం చూడటానికి మాత్రమే కాదు, ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్, హెల్త్ ట్రాకర్‌గా మారిపోయింది. మార్కెట్‌లో వందలాది ఆప్షన్లు ఉన్నా, తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్లు ఇచ్చే స్మార్ట్‌వాచ్‌లు చాలా అరుదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే Prowatch X మార్కెట్‌లోకి వచ్చి కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. కేవలం రూ. 2,999 కే 1.43 ఇంచ్ అల్మోడ్ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, అడ్వాన్స్‌డ్ ఫిట్‌నెస్ ఫీచర్లతో లభిస్తున్న ఈ వాచ్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

Prowatch X స్మార్ట్‌వాచ్ రివ్యూ: 

టెక్‌ ప్రియులకు, ఫిట్‌నెస్ లవర్స్‌కు బడ్జెట్ ధరలో ఒక పవర్‌ఫుల్ స్మార్ట్‌వాచ్ కావాలనుకుంటే.. ఈ వాచ్ ఒక ల్యాండ్‌మార్క్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సాధారణంగా రూ. 5వేల కంటే ఎక్కువ ధర ఉండే వాచ్‌లలో మాత్రమే కనిపించే అడ్వాన్స్‌డ్ ఫీచర్లను ఈ వాచ్‌లో కేవలం రూ. 2,999 కే అందిస్తున్నారు.

డిజైన్, డిస్‌ప్లే:

Advertisement

Prowatch X లో అత్యంత ప్రధానమైన ఆకర్షణ దాని డిస్‌ప్లే. ఇందులో 1.43 ఇంచ్ అల్మోడ్ డిస్‌ప్లే అందించారు. అల్మోడ్ స్క్రీన్ కావడం వల్ల రంగులు చాలా బ్రైట్‌గా, వైబ్రెంట్‌గా కనిపిస్తాయి. ఎండలో.. చూసినా సరే స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాదు, ఈ ప్రైస్ సెగ్మెంట్‌లో మొదటి సారిగా స్క్రీన్ రక్షణ కోసం కూలింగ్ గ్లాస్ గొరిల్లా 3 ఇచ్చారు. దీని వల్ల వాచ్ కింద పడినా లేదా ఎక్కడైనా తగిలినా గీతలు పడకుండా గ్లాస్ సురక్షితంగా ఉంటుంది.

అడ్వాన్స్‌డ్ హెల్త్ ట్రాకింగ్:

ఫిట్‌నెస్ విషయంలో ఈ వాచ్ ఒక ప్రొఫెషనల్ గ్యాడ్జెట్‌లా పని చేస్తుంది. ఇందులో సాధారణ హార్ట్ రేట్, SpO2 మోనిటరింగ్‌తో పాటు కొన్ని ప్రీమియం హెల్త్ ట్రాకర్లు ఇచ్చారు:

Advertisement

Body Energy: రోజంతా మీ శరీరంలో ఉన్న ఎనర్జీ లెవల్స్ ఎలా ఉన్నాయో ఇది ట్రాక్ చేసి చెప్తుంది.

HRV: మీ గుండె వేగంలో వచ్చే మార్పులను పసిగట్టి, మానసిక ఒత్తిడి స్థాయిలను పర్ఫెక్ట్‌గా లెక్కిస్తుంది.

VO2 Max:వర్కవుట్స్ లేదా రన్నింగ్ చేసేటప్పుడు మీ ఊపిరితిత్తులు ఎంత ఆక్సిజన్‌ను సమర్థవంతంగా వాడుకుంటున్నాయో ఇది ట్రాక్ చేస్తుంది.

ఇన్-బిల్ట్ ఫీచర్లు & కనెక్టివిటీ:

ఈ వాచ్‌లో బెస్ట్ సపోర్ట్ ఉంది. ఫోన్ జేబులో.. నుంచి తీయకుండానే వాచ్ నుంచే నేరుగా కాల్స్ మాట్లాడవచ్చు. క్లియర్ ఆడియో కోసం పవర్‌ఫుల్ స్పీకర్, మైక్రో ఫోన్ ఇచ్చారు. అంతేకాకుండా.. ఇందులో ఇన్-బిల్ట్ స్టోరేజ్ లేదా యాప్స్ సపోర్ట్ ఉండడం వల్ల రోజువారీ వాడకంలో అనుభవం చాలా స్మూత్‌గా ఉంటుంది.

Also Read: రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు!

బ్యాటరీ , కస్టమైజేషన్:

అల్మోడ్ డిస్‌ప్లే ఉన్నప్పటికీ, దీని బ్యాటరీ లైఫ్ చాలా బాగుంటుంది. సాధారణ వాడకంలో కొన్ని రోజుల పాటు చార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మీ స్టైల్‌కు తగినట్లుగా మార్చుకోవడానికి వందలాది వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి.

మీరు రూ. 3,000 బడ్జెట్‌లో బలమైన గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, సూపర్ అల్మోడ్ డిస్‌ప్లే, టాప్ క్లాస్ ఫిట్‌నెస్ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ కోసం చూస్తుంటే ఈ వాచ్ కచ్చితంగా బెస్ట్ అండ్ వర్త్ ఆప్షన్.

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×