Mahesh babu about jayakrishna: ఘట్టమనేని కుటుంబం నుండి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Gattamaneni) కొత్త మూవీ పైనే ఇప్పుడు అందరి చూపు.. దివంగత నటుడు రమేష్ బాబు (Ramesh Babu) కొడుకుగా, సూపర్ స్టార్ కృష్ణ (Krishna) వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న జయ కృష్ణకు సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) స్పెషల్ విషెస్ తెలుపుతూ సపోర్టు ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా రమేష్ అన్నయ్య కొడుకు వస్తున్నాడు అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది.
అసలు విషయంలోకి వెళ్తే.. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో ఘట్టమనేని వారసుడు జయకృష్ణ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం టీం కి , అలాగే జయకృష్ణకు స్పెషల్ విషెస్ తెలియజేశారు మహేష్ బాబు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఒక స్పెషల్ వీడియో పంచుకున్నారు మహేష్ బాబు..
మహేష్ బాబు మాట్లాడుతూ.. “నాకు చాలా సంతోషంగా ఉంది. మా రమేష్ అన్నయ్య గారి అబ్బాయి జయకృష్ణ నటుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. మా ఫ్యామిలీ అంతా ఎంతో ఆనందంగా ఉంది . ఇప్పటివరకు చూసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా కోసం మేము కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. జయకృష్ణ, రషా తడానీ పెయిర్ చాలా బాగుంది. ముఖ్యంగా వాళ్లను ఇంత అందంగా చక్కగా చూపించినందుకు ఆ క్రెడిట్ డైరెక్టర్ అజయ్ భూపతికి ఇవ్వాలి. మ్యూజిక్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమాలో నా ఫేవరెట్ సాంగ్ అల్లెల్లే. ఈ సినిమా జూలై 30వ తేదీన రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా అది నా రాజకుమారుడు రిలీజ్ డేట్..
Also read: చెన్నై లవ్ స్టోరీ ఓటీటీ ట్విస్ట్?
నాకు తెలిసి నిర్మాత దత్ గారే ఈ డేట్ ప్లాన్ చేసి ఉంటారు. రామ్ చరణ్ , నేను, అల్లు అర్జున్ మేమంతా కూడా వైజయంతి బ్యానర్ నుండే వచ్చాము. ఇప్పుడు జయకృష్ణ కూడా వస్తున్నాడు. ముఖ్యంగా జయకృష్ణ, రషా ఈ విషయంలో అదృష్టవంతులు. బాబాయ్ ఆది శేషగిరిరావు కూడా ఈ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. నాన్నగారి అభిమానులు, నా అభిమానులు జయకృష్ణ, రషా లను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్” అంటూ ఒక స్పెషల్ వీడియో పంచుకున్నారు మహేష్ బాబు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ చిత్రంలో రవీనా టాండన్ కూతురు రషా తడానీ హీరోయిన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. అశ్వినీ దత్ సమర్పణలో చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్ పై జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Extremely happy for #JaiKrishnaGhattamaneni and #RashaThadani on their debut with #SrinivasaMangapuram…. I wish the whole team the very best for July 30th!!! 🤗🤗🤗♥️♥️♥️@DirAjayBhupathi #RashaThadani @themohanbabu @AshwiniDuttCh @gvprakash @gemini_kiran @CKPicturesoffl pic.twitter.com/VPgSDQRmAn
— Mahesh Babu (@urstrulyMahesh) July 26, 2026