E-Paper
Advertisement

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!
Advertisement

QR Code Scam: ఈ రోజుల్లో యూపీఐ లేదా డిజిటల్ పేమెంట్స్ సర్వ సాధారణంగా మారిపోయాయి.రెస్టారెంట్‌లో బిల్లు చెల్లించాలన్నా, కిరాణా సామాన్లు కొనాలన్నా, క్యాబ్ బుక్ చేయాలన్నా, స్నేహితులకు డబ్బులు పంపాలన్నా క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేసి క్షణాల్లో డబ్బులు పంపేస్తున్నారు. అయితే ఈ సౌకర్యం.. సైబర్ నేరగాళ్లకు ఒక అవకాశంగా మారుతోంది. ఒక నకిలీ క్యూఆర్ కోడ్ సృష్టించి.. వాటిని స్కాన్ చేయించడం ద్వారా ఆర్థిక మోసాలకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో బయట క్యూఆర్ కోడ్ స్కామ్ ఏ విధంగా జరుగుతున్నాయో ఈ కథనంలో చూద్దాం.

క్యూఆర్ కోడ్ స్కామ్‌ ఎలా చేస్తారంటే?

సాధారణంగా క్యూఆర్ కోడ్ అనేది ఫోన్ చదవగలిగే విధంగా సమాచారాన్ని నిక్షిప్తం చేసే ఒక మార్గం. ఇది పేమెంట్ అడ్రస్, వెబ్‌సైట్ లింక్, ఇతర వివరాలను కలిగి ఉంటుంది. మోసగాళ్లు దుకాణాల్లో అసలు కోడ్ పై నకిలీ కోడ్‌లను అతికించడం, మెసేజింగ్ యాప్‌ల ద్వారా పంపడం లేదా ప్రముఖ పేమెంట్ సర్వీసులను పోలిన నకిలీ వెబ్‌సైట్లను సృష్టించడం ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో రీఫండ్ లేదా బహుమతి పేరుతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమని నమ్మిస్తారు. ఫలితంగా బాధితులు మోసపూరిత పేజీకి వెళ్లి డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు చూద్దాం.

1. క్యూఆర్ కోడ్ ను గుడ్డిగా నమ్మెుద్దు

Advertisement

కోడ్ స్కాన్ చేసినంత మాత్రాన డబ్బు కట్ కాకపోయినా అది ఒక వెబ్‌సైట్‌ను లేదా పేమెంట్ యాప్‌ను ఓపెన్ చేయవచ్చు. కోడ్ ఏ వెబ్‌సైట్‌కు మళ్లిస్తుందో చెక్ చేయండి. అనుమానాస్పద లింక్ అయితే వెంటనే ఆపేయండి.

2. యూపీఐ పిన్ ఎంటర్ చేయవద్దు

ఏ సందర్భంలోనైనా డబ్బు రిసీవ్ చేసుకోవడానికి UPI PIN అవసరం లేదు. ఎవరైనా రీఫండ్ లేదా క్యాష్ ప్రైజ్ కోసం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పిన్ కొట్టమంటే అది మోసమని గ్రహించాలి.

3. పేమెంట్ రిసీవర్ పేరు చెకింగ్

Advertisement

డబ్బు పంపే ముందు స్క్రీన్ పై కనిపిస్తున్న పేరు, అమౌంట్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోండి. వేరే పేరు కనిపిస్తే వెంటనే ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ చేయండి.

4. తెలియని వ్యక్తులతో జాగ్రత్త

పార్శిల్ డెలివరీ, రీఫండ్ లేదా బ్యాంక్ ఖాతా వెరిఫికేషన్ పేరుతో అపరిచితులు పంపే కోడ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మోసగాళ్లు తొందరపాటును ఆసరాగా చేసుకుని మోసం చేసే ప్రమాదం ఉంది.

Also Read: అమ్మమ్మ వంటతో అద్భుతం.. రూ.5 లక్షలతో మెుదలై రూ.కోట్లల్లో వ్యాపారం.. ఈ సిస్టర్స్ అదరగొట్టేశారు!

5. ఆ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయెుద్దు

కస్టమర్ సపోర్ట్ లేదా అకౌంట్ రికవరీ పేరుతో కొత్త యాప్‌లను డౌన్‌లోడ్ చేయమని చెప్పి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ యాప్ డౌన్ లోడ్ చేయాల్సి వచ్చినా.. నమ్మదగిన సోర్సెస్ నుండి మాత్రమే డౌన్ లోడ్ చేయండి.

Also Read: 8 ఏళ్లలో రూ.1 కోటి సంపాదించాలా? తిరుగులేని పెట్టుబడి ప్లాన్ ఇదే.. పక్కా వర్కౌట్ అవుద్ది మామ!

Tags

Related News

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Samsung Galaxy S27 Ultraలో స్నాప్‌డ్రాగన్‌కు నో ఎంట్రీ.. కారణం ఎంటో తెలుసా?

వీఐ సంచలనం.. దేశంలో తొలి ప్రీపెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ లాంచ్.. డేటా షేరింగ్‌తోపాటు 10% డిస్కౌంట్!

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

Big Stories

Advertisement
×