E-Paper
Advertisement

Amazon Sale Offer: కళ్లజోడులోనే కెమెరా, మినీ స్పీకర్స్.. రే-బాన్ మెటా ఏఐ గ్లాసెస్‌పై భారీ ఆఫర్..

Amazon Sale Offer: కళ్లజోడులోనే కెమెరా, మినీ స్పీకర్స్.. రే-బాన్ మెటా ఏఐ గ్లాసెస్‌పై భారీ ఆఫర్..
Advertisement

Amazon Sale Offer: అమెజాన్‌లో భారీ ఆఫర్ దూసుకువస్తోంది. సాధారణంగా సంవత్సరంలో ఒకసారి మాత్రమే వచ్చే టాప్ బ్రాండ్ల ఆఫర్లలో రే-బాన్ మెటా ఏఐగ్లాసెస్ మీద కనిపిస్తున్న ఈ ధరలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. రే-బాన్ అనగానే మనకు గుర్తుకువచ్చేది క్లాసిక్ స్టైల్, మెటా అనగానే గుర్తుకు వచ్చేది ఏఐ. ఈ రెండింటి కలయికగా వచ్చిన ఈ స్మార్ట్ గ్లాసెస్ సాధారణ సన్‌గ్లాస్ కాదు. కళ్లజోడు రూపంలో ఏఐ అనుభవం ఇవ్వగలిగే కొత్త తరహా పరికరం. ఇప్పుడు ఈ గ్లాసెస్ పై అమెజాన్ భారీ ఆఫర్లతో వినియోగదారులకు అందించేందుకు సిద్దమైంది. మరి ఎంత వరకు తగ్గిందో చూద్దామా.

ధర రూ.29,900.. కానీ ఆఫర్‌లో రూ.23,920లు మాత్రమే..

Advertisement

ఇప్పుడు ఈ గ్లాసెస్ పై అమెజాన్‌లో కనిపిస్తున్న ధరలను చూస్తే… మొదటి మోడల్‌ రే-బాన్ మెటా క్లాసిక్ గ్రీన్ టింట్ గ్లాసెస్. దీని అసలు ధర రూ.29,900 గా కనిపిస్తుంది. కానీ ఆఫర్‌లో రూ.23,920 కి పడిపోయింది. అంటే మొత్తం ధరలో దాదాపు రూ.6,000 తగ్గింపు వచ్చినట్టే. ఈ రేంజ్‌లో రే-బాన్ గ్లాసెస్‌కే ఇంత తగ్గింపు అరుదు. పైగా మెటా ఏఐ కలిసినప్పుడు ఈ ధర మరింత ప్రత్యేకంగా మారుతుంది.

మోడల్‌ బ్లూ లెన్స్ ఉన్న మెటా స్కైలర్ పై రూ.7వేలు తగ్గింపు

Advertisement

రెండో మోడల్‌ బ్లూ లెన్స్ ఉన్న మెటా స్కైలర్ వేరియంట్. దీని అసలు ధర రూ.35,700. ఇప్పుడు అమెజాన్‌లోని ఆఫర్‌లో ఇది రూ.28,560 కి వస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.7,100 తగ్గింపు వస్తోంది. ఈ గ్లాసెస్ డిజైన్ కూడా కొంచెం ప్రీమియం షేప్‌లో ఉండటం వల్ల దీనికి ప్రీమియం బిల్డ్ అనుభవం సెట్ అవుతుంది. అదనంగా ఆఫర్‌లో బాగా తగ్గడం వల్ల దీనికి మరింత డిమాండ్ పెరిగింది.

ఫ్రేమ్ డిజైన్, లెన్స్ షేడ్‌తో ధర..

మూడో మోడల్‌లో అసలు ధర రూ.32,100 గా కనిపిస్తున్నప్పటికీ, ఆఫర్ ధర రూ.25,680 వరకు తగ్గింది. దీనిలో కూడా దాదాపు రూ.6,400 తగ్గింపు వస్తుంది. ఈ మూడు మోడళ్లలోని సామాన్యమైన విషయం ఏంటంటే, అన్నింటిలోనూ ఏఐ ఫీచర్లు ఒకే విధంగా శక్తివంతంగా పనిచేస్తాయి. ధర తేడా మాత్రం ప్రధానంగా ఫ్రేమ్ డిజైన్, లెన్స్ షేడ్, బయట కనిపించే స్టైల్ వల్లే వస్తుంది.

Also Read: Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ సేల్.. రూ.10 వేల ఇయర్‌బడ్స్ ఇప్పుడు కేవలం రూ.2 వేల‌లోపే!

ఆఫర్ ఎందుకు? 

ఇప్పుడు ఈ ఆఫర్ ధరలు ఎందుకు తగ్గిందంటే, సాధారణ సమయంలో రే-బాన్ మెటా గ్లాసెస్ మీద తగ్గింపులు చాలా అరుదుగా వస్తాయి. అంతేకాకుండా ఇది సాధారణ ఫ్యాషన్ గ్లాసెస్ కాదు కాబట్టే చిన్న ఆఫర్లు కూడా ఇవ్వరు. మెటా ఏఐ ప్రాసెసర్, బిల్ట్-ఇన్ కెమెరా, ఓపెన్-ఎయిర్ ఆడియో, టైటానియం హింజ్‌లు, రే-బాన్ క్లాసిక్ డిజైన్ అన్నీ ఒకే కాంబినేషన్‌లో ఉండటం వల్ల సాధారణంగా ఇవి ప్రీమియం రేంజ్‌లోనే ఉంటాయి. కానీ ఇప్పుడు మాత్రం అమెజాన్ ఆఫర్ కారణంగా ఈ ధరలు భారీగా తగ్గాయి.

గ్లాసెస్ ఫీచర్లు గురించి మాట్లాడితే..

ఇప్పుడు గ్లాసెస్‌లో ఉన్న కెమెరా గురించి మాట్లాడితే, ముందున్న చిన్న కెమెరా సెకన్లలో ఫోటోలు, వీడియోలు తీయగలిగే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఫోన్ తీసే పని లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా చేతులతో పని చేయకుండానే రికార్డింగ్ చేస్తుంది. మన దృష్టిలో పడే ప్రపంచాన్నే నేరుగా రికార్డ్ చేస్తుంది. ఈ కెమెరా మనం ఏ దృశ్యం చూస్తున్నామో ఏఐకి పంపి వెంటనే ఎనాలిసిస్ కూడా చేస్తుంది. ఇటువంటి ఏఐ విజువల్ అండర్‌స్టాండింగ్ టెక్నాలజీ సాధారణ గ్లాసెస్‌ల్లో లభించదు.

ఓపెన్-ఎయిర్ సౌండ్ సిస్టమ్

ఆడియో విషయంలో కూడా ఓపెన్-ఎయిర్ సౌండ్ సిస్టమ్ పని చేస్తుంది. ఇది మన చెవుల్లో ఇయర్‌బడ్స్ పెట్టినట్టుగానే స్పష్టంగా వినిపిస్తుంది కానీ బయటి వారికి అంతగా వినిపించదు. అంటే మనం నడుస్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, పని మధ్యలో ఉన్నప్పుడు కూడా నేరుగా గ్లాసెస్ ద్వారానే పాటలు వినచ్చు, వీడియోలు వినచ్చు, ఏఐతో మాట్లాడచ్చు.

డిజిటల్ అసిస్టెంట్‌గానే ఏఐ గ్లాసెస్

ఈ గ్లాసెస్‌తో బిల్ట్-ఇన్ ఏఐ మనం ఏం చూస్తున్నామో అర్ధం చేసుకుని వెంటనే సమాధానం కూడా ఇస్తుంది. రహదారిపై ఉన్న బోర్డు కనిపించినా చెప్పగలదు. ఏ ప్రదేశం గురించి అయినా వివరాలు చెప్తుంది. మనం ఇది ఏమిటి? అనగానే ఏఐ నేరుగా జవాబు ఇస్తుంది. చిన్న చిన్న పనులు మనం ఫోన్ తీసుకోకుండా చేయగలిగేలా ఈ ఏఐ మనతో మాట్లాడుతుంది. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి దగ్గర ఉండే వ్యక్తిగత డిజిటల్ అసిస్టెంట్‌గానే ఈ గ్లాసెస్ నిలుస్తుంది.

ఇవి జస్ట్ గ్లాసెస్ కాదు.. పని మాత్రం వీరలెవల్

డిజైన్‌లో రే-బాన్ క్లాసిక్ స్టైల్‌ను మార్చకుండా, లోపల ఉన్న సెన్సర్‌లు, కెమెరా, ఆడియో, టచ్ కంట్రోల్స్ అన్నీ స్పంష్టంగా ఉండటం వల్ల గ్లాసెస్ చూసేటప్పుడు అసలు టెక్ గాడ్జెట్‌లాగే కనిపించదు. బయటకి చూస్తే కేవలం స్టైలిష్ సన్‌గ్లాస్‌గానే కనిపిస్తుంది కానీ లోపలున్న శక్తి మాత్రం పూర్తిగా వేరే స్థాయిలో ఉంటుంది.

ఆఫర్ డోంట్ మిస్ గురూ..

అమెజాన్ ఆఫర్‌లో ప్రస్తుతం ఈ మూడు మోడళ్లు అందుబాటులో ఉండటం వల్ల వినియోగదారులకు మంచి అవకాశం. ఈ సీజన్‌లోనే లభించే ప్రత్యేకమైన డీల్. అలాగే డెలివరీ కూడా త్వరగానే జరుగుతోంది. కళ్లజోడు అనేది ఒక ఫ్యాషన్ ఐటమ్ మాత్రమే కాదు. మన రోజువారీ జీవితంలో ఏఐ అనుభవాన్నే కళ్ల ముందుంచే పరికరంగా రే-బాన్ మెటా గ్లాసెస్ మారిపోయాయి. ఇప్పుడు అమెజాన్ ఆఫర్‌లో వీటి ధరలు ఎంత తగ్గాయో చూసినప్పుడు కొనాలని అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఇలాంటి టెక్నాలజీ, ఇలాంటి డిజైన్, ఇలాంటి ఫీచర్లు అన్నీ సాధారణ ధరల్లో దొరకడం చాలా అరుదు. అందుకే ఈ ఆఫర్‌ను చాలా మంది మిస్ అవకుండా చూస్తున్నారు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×