E-Paper
Advertisement

Readmi Note 13 5G : 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ – ఓరి బాబాయ్​.. రూ.14 వేలకే బ్రాండెడ్​​ స్మార్ట్ ఫోన్​

Readmi Note 13 5G : 108MP కెమెరా, 5000mAh బ్యాటరీ – ఓరి బాబాయ్​.. రూ.14 వేలకే బ్రాండెడ్​​ స్మార్ట్ ఫోన్​
Advertisement

Readmi Note 13 5G : చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌ మీ ఎప్పటికప్పుడు బడ్జెట్​ ధరల్లో ఫోన్లను విడుదల చేస్తూ వినియోగదారులను ఆకర్షిస్తుంటుంది. అయితే తాజాగా రెడ్ మీ నోట్ 13 5Gపై అదిరే డిస్కౌంట్​ లభిస్తోంది. ఎటువంటి బ్యాంకు ఆఫర్లతో సంబంధం లేకుండానే ఇది అందుబాటులోకి వచ్చింది.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్‌ షాపింగ్ ఉత్సవ్‌ 2024 సేల్‌ నడుస్తోంది. అందులోనే ఈ రెడ్ మీ నోట్ 13 5Gపై రూ.14 వేలకే లభిస్తోంది. బ్యాంకు ఆఫర్ల ద్వారా అయితే మరింత తగ్గింపు ధరకే సొంత చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్​లో 108MP కెమెరా సహా 5000mAh బ్యాటరీ ఉంది.

Advertisement

స్పెసిఫికేషన్‌లు ఇవే – ఈ స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వచ్చింది. 6.67 అంగుళాల FHD + అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 1000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌ నెస్‌ను కలిగి ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 6080 CPU ప్రాసెసర్​తో నడుస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత OSతో పని చేస్తుంది.

కెమెరా – కెమెరా విషయానికొస్తే వెనకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్ ఉంది. 108 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 16 ఎంపీ కెమెరాను ఇచ్చారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ 33W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టు 5000mAh బ్యాటరీ కెపాసిటీ ఉంది.

Advertisement

ALSO READ :

ఏఏ వేరియంట్లు ఎంతంటే?- 6 జీబీ ర్యామ్‌ + 128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ రెడ్‌మి నోట్‌ 13 5G స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ.14,230. Arctic White కలర్​లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సెస్‌ బ్యాంకు కార్డు ద్వారా 5 శాతం తగ్గింపు కూడా పొందవచ్చు. క్రోమాటిక్‌ పర్పుల్‌ వేరియంట్ ధర రూ.14,896గా విక్రయిస్తున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ పై ఎక్స్చేంజ్ ఆఫర్ ను సైతం రెడ్ మీ అందిస్తోంది.

8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్​ను రూ.16,198కు అందిస్తున్నారు. ఇది Stealth Black కలర్​లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్ Arctic White కలర్​ ధర రూ.16,795కు అందుబాటులో ఉంది.

Arctic White కలర్ వేరియంట్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ స్మార్ట్ ఫోన్​ ధర రూ.17,380కు దొరుకుతోంది. ప్రిజమ్‌ గోల్డ్‌ కలర్‌ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ఫోన్​ను రూ.16987కు విక్రయిస్తున్నారు. యాక్సెస్‌ బ్యాంకు కార్దు ద్వారా 5 శాతం తగ్గింపు పొందేలా వీలు కల్పించారు.

ఇకపోతే ప్రస్తుతం ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌ 2024 సదస్సులో తాజాగా రెడ్‌ మి A4 5G స్మార్ట్‌ ఫోన్​ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. స్నాప్‌ డ్రాగన్‌ 4s జెనరేషన్ 2 చిప్‌ సెట్‌తో ఇది పని చేస్తుంది. దీనిని రూ.10,000 కన్నా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురానుంది రెడ్​ మీ. బడ్జెట్​ మంచి స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే కస్టమర్స్ కు ఇదే బెస్ట్ ఆఫర్ అని రెడ్ మీ హామీ ఇస్తుంది. మరి ఎందుకు ఆలస్యం మీరు ఎప్పటినుంచో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటే ఒకసారి ట్రై చేసేయండి.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×