BigTV English

Nidhi Agarwal: ప్రభాస్, పవన్ సినిమాలపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిధి… డైరెక్టర్ రియాక్షన్ ఇదే

Nidhi Agarwal: ప్రభాస్, పవన్ సినిమాలపై క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిధి… డైరెక్టర్ రియాక్షన్ ఇదే

Nidhi Agarwal : ప్రస్తుతం పలువురు బడా హీరోల సినిమాల అప్డేట్స్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయా అని అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందులో ప్రభాస్ (Pabhas), పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మొదటి స్థానంలో ఉన్నారు. తాజాగా వీరిద్దరి సినిమాల గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చింది హీరోయిన్ నిధి అగర్వాల్. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ పై డైరెక్టర్ రియాక్ట్ కూడా అయ్యారు.


క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిధి అగర్వాల్

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత నిధి అగర్వాల్ (Nidhi Agarwal) కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఊహించని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ (Hari hara veeramallu) అనే సినిమాలో నటించే ఛాన్స్ దొరికింది. ఆ సినిమా షూటింగ్ కూడా మధ్యలోనే ఆగిపోవడంతో ఈ బ్యూటీకి నిరాశ తప్పదేమో అనుకున్నారు. కానీ అన్నీ అడ్డంకులు దాటుకొని ఈ సినిమా త్వరలోనే పూర్తి కాబోతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ (Raja Saab) అనే సినిమాలో కూడా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా అభిమానుల్లో జోష్ నింపేలా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను నిధి అగర్వాల్ రివీల్ చేసింది. ఈ మేరకు నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ట్వీట్ చేస్తూ ‘ఆర్టిస్ట్ జీవితం అనేది సర్ప్రైజ్ తో నిండిపోతుంది. ఇక కొన్ని బ్లెస్సింగ్స్ ఎంత గొప్పగా ఉంటాయంటే మర్చిపోలేని అనుభూతినిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండు మోస్ట్ అవైటెడ్ సినిమాలలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది. ఒకేరోజు హరిహర వీరమల్లు, రాజాసాబ్ సినిమాల షూటింగ్లో పాల్గొనడం మరింత సంతోషంగా ఉంది. అయితే ఓ సినిమా షూటింగ్ ఆంధ్రాలో, మరొకటి తెలంగాణలో జరుగుతోంది. మా పనిని మీ ముందుకు తీసుకురావడానికి వెయిట్ చేస్తున్నాను. ఈ సినిమాలు పండగ వాతావరణాన్ని నింపడం ఖాయం’ అంటూ రాసుకొచ్చింది.


నిధి డైరెక్టర్ కామెంట్

అయితే నిధి అగర్వాల్ చేసిన ఈ పోస్ట్ పై డైరెక్టర్ మారుతి (Director Maruthi) స్పందించారు. ఆయన ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నిధి హీరోయిన్ గా నటిస్తుండగా, ఆమె చేసిన పోస్ట్ పై మారుతీ స్పందిస్తూ ‘అంకితభావంతో పని చేస్తున్నారు. ఆల్ ది బెస్ట్’ అని రిప్లై ఇచ్చారు. నిధి అగర్వాల్ Nidhi Agarwal చేసిన ఈ పోస్ట్ ఓవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, మరోవైపు రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ప్రస్తుతం విజయవాడలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతుంది. క్రిష్ సారథ్యంలో జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కాబోతోంది. ఇక ప్రభాస్, మారుతి ‘రాజాసాబ్’ వచ్చే ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది.

Related News

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Big Stories

×