BigTV English

Rs 25,000 Discount on Mobiles: ఇదేందిరా ఇది.. 5జీ ఫోన్‌పై రూ.25 వేల భారీ డిస్కౌంటా..? ఇప్పుడు రూ.1949లకే కొనేయొచ్చా..?

Rs 25,000 Discount on Mobiles: ఇదేందిరా ఇది.. 5జీ ఫోన్‌పై రూ.25 వేల భారీ డిస్కౌంటా..? ఇప్పుడు రూ.1949లకే కొనేయొచ్చా..?

Rs 25,000 Instant Discount on Realme 12 Pro+: తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌పై కళ్లుచెదిరే డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భారీ తగ్గింపుతో తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ వేగన్ లెదర్ బ్యాక్, 120x సూపర్ జూమ్ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో లాంచ్ చేయబడింది.


Realme 12 Pro+ 5G Offer

Realme 12 Pro+ 5G స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 8GB RAM, 128GB Storage అసలు ధర రూ. 34,999 ఉండగా ఇప్పుడు 22 శాతం తగ్గింపుతో కేవలం రూ.27,299లకే లిస్ట్ అయింది. అలాగే 8GB RAM + 256GB Storage వేరియంట్ ధర రూ.35,999 ఉండగా ఇప్పుడు కేవలం రూ.28,538 ధరకే లిస్ట్ అయింది. అలాగే టాప్ వేరియంట్ 12GB RAM + 256GB Storage ధర రూ.37,999 ఉండగా.. ఇప్పుడు రూ.30,500 లకు లభిస్తుంది.


అయితే ఈ ఫోన్ కొనుగోలుపై అమెజాన్ భారీ బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఎంపిక చేసిన క్రిడిట్ అండ్ డెబిట్ కార్డులపై రూ.2500 వరకు బ్యాంక్ తగ్గింపును అందిస్తోంది. దీంతో బేస్ వేరియంట్ రూ.24,799కి, మిడిల్ వేరియంట్ రూ.26,038, టాప్ వేరియంట్ రూ. 28000లకు లభిస్తుంది. అంతేకాకుండా భారీ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది. దాదాపు రూ.25,350 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.

Also Read: ఏంది భయ్యా ఇది.. ఐఫోన్, వన్‌ప్లస్ మరీ ఇంత చీపా.. అమెజాన్ సమ్మర్ డీల్స్‌ అదిరిపోయింది..!

ఈ ఆఫర్‌తో బేస్ వేరియంట్‌ను కేవలం రూ.1949లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ మెరుగ్గా ఉండాలి. డ్యామేజ్ లేకుండా, హ్యాంగింగ్ ఉండకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంతపెద్ద మొత్తంలో ఆఫర్ పొందుతారు. అంతేకాకుండా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది.

Realme 12 Pro+ 5G Specifications

Realme 12 Pro+ 120Hz అధిక రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల FHD + 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ద్వారా రక్షించబడింది. Realme 12 Pro+ 5Gలో Qualcomm Snapdragon 7s Gen 2 ప్రాసెసర్, 67W ఫాస్ట్ ఛార్జింగ్ సామర్ధ్యం, 5000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంది. కెమెరా విషయానికొస్తే, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 120x సూపర్‌జూమ్ ఫీచర్‌తో 64MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో 32మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. Realme 12 Pro+ 5G Android 14 ఆధారంగా Realme UI 5.0పై నడుస్తుంది.

Related News

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Google Veo 3 Free: ఏఐ వీడియోలు చేయడం పూర్తిగా ఫ్రీ.. గూగుల్ వియో 3 ఇప్పుడే ట్రై చేయండి!

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

Big Stories

×