BigTV English
Advertisement

Amazon 5g Mobile Offers : ఏంది భయ్యా ఇది.. ఐఫోన్, వన్‌ప్లస్ మరీ ఇంత చీపా.. అమెజాన్ సమ్మర్ డీల్స్‌ అదిరిపోయింది

Amazon 5g Mobile Offers : ఏంది భయ్యా ఇది.. ఐఫోన్, వన్‌ప్లస్ మరీ ఇంత చీపా.. అమెజాన్ సమ్మర్ డీల్స్‌ అదిరిపోయింది

Amazon Summer Deals on 5G Mobiles: ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులకు అదిరిపోయే సేల్స్‌ తీసుకొచ్చి ఆకట్టుకుంటుంది. ఆ సేల్స్‌లో కొత్త కొత్త మొబైళ్లపై డిస్కౌంట్ ఆఫర్లను అందించి అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే ఎన్నో రకాల సేల్స్ తీసుకొచ్చిన అమెజాన్ ఇప్పుడు మరొక సేల్‌తో వచ్చింది. ఈ సారి అమెజాన్ సమ్మర్ డీల్స్ సేల్‌ను ప్రకటించింది. ఇందులో షాపింగ్ పోర్టల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్‌లు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. అదనంగా టాప్ బ్రాండ్‌ల ఫోన్లపై బ్యాంక్ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా పొందొచ్చు. Apple iPhone 13, OnePlus 12R తో సహా ఇతర టాప్ మొబైల్ ఫోన్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో మొబైల్ ఫోన్‌లపై టాప్ డీల్స్‌ను చూద్దాం.


Apple iPhone 13

అమెజాన్‌లో Apple iPhone 13 అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. సమ్మర్ డీల్స్‌లో భాగంగా అమెజాన్‌లో దీని ధర అసలు ధర రూ.59,900 ఉండగా.. ఇప్పుడు కేవలం రూ.48,999లకే లిస్ట్ అయింది. అదనంగా, కొనుగోలుదారులు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ.2,450 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఎంపిక కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.40,250 వరకు భారీ తగ్గింపు పొందొచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత మొబైల్ మంచి కండీషన్లో ఉండాలి. ఎలాంటి హ్యాంగింగ్, డ్యామేజ్ ఉండకూడదు. అప్పుడు మాత్రమే ఇంత పెద్దమొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందుతారు.


ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 12MP ప్రధాన లెన్స్, 12MP అల్ట్రా-వైడ్ స్క్రీన్‌తో డ్యూయల్-రియర్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. A15 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆధారితమైనది. 4GB RAM- 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. ఇది 15W వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 3,240mAh బ్యాటరీని కలిగి ఉంది.

Also Read: రుకో జర.. రూ.999లకే 6జీబీ ర్యామ్, 50MP కెమెరా, 6000 mAH బ్యాటరీ ఫోన్‌.. ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుందో తెలీదు..!

OnePlus 12R

OnePlus 12Rపై కూడా అమెజాన్ మంచి డిస్కౌంట్లను అందిస్తోంది. దీని అసలు ధర రూ.39,990 ఉండగా ఇప్పుడు ఎంపిక చేయబడిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 బ్యాంక్ తగ్గింపు లభిస్తుంది. ఈ తగ్గింపుతో ఇప్పుడు కేవలం రూ.37,990కి అందుబాటులో ఉంది. iPhone 13 మాదిరిగానే, దీన్ని కూడా నో-కాస్ట్ EMIలో కొనుగోలు చేయవచ్చు. OnePlus 12R 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 50MP ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్, 16MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. Qualcomm Snapdragon 8 Gen 2 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది.

Honor X9b

Honor X9b పై అమెజాన్ సూపర్ డూపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. దీని అసలు ధర రూ.30,999 ఉండగా ఇప్పుడు 26 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 22,999కి అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,299 వరకు బ్యాంక్ డిస్కౌంట్ ఉంది. ఇంకా కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌ని మార్చుకోవడం ద్వారా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో దాన్ని పొందవచ్చు. ఏకంగా రూ.21,550 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఉంది. ఈ ఆఫర్ పొందాలంటే పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ కానీ హ్యాంగింగ్ కానీ ఉండకూడదు.

Also Read: iQOO Z9x 5G Price Drop: ధూమ్ ధమాకా ఆఫర్.. రూ.703లకే 6GB RAM 5జీ ఫోన్.. మొన్ననే లాంచ్.. అప్పుడే అత్యంత చౌక ధరలో దొరికేస్తోంది..!

Honor X9b 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 108MP ట్రిపుల్-రియర్ కెమెరా సిస్టమ్, 16MP సెల్ఫీ స్నాపర్‌ని కలిగి ఉంది. Qualcomm Snapdragon 6 Gen 1 చిప్‌సెట్ ద్వారా ఆధారితమైనది. 35W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,580mAh బ్యాటరీని కలిగి ఉంది.

Related News

AI Hospital Bill Error: ఆస్పత్రిలో రూ.1.6 కోటి బిల్లు చూసి షాకైన యువకుడు.. అసలు బిల్లు రూ.29 లక్షలే.. మోసం ఎలా కనిపెట్టాడంటే

Instagram vs YouTube Earnings: ఇన్‌స్టాగ్రామ్ vs యూట్యూబ్.. కంటెంట్ క్రియేటర్లకు అధిక సంపాదన ఇచ్చే ప్లాట్‌ఫామ్ ఏది?

Motorola Edge 50 Ultra: రూ.10వేల తగ్గింపుతో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రా.. ప్రీమియం ఫోన్‌ బడ్జెట్‌ ధరలో..

Email Assistant: సరికొత్త ఏఐ టూల్.. మీకొచ్చే ఇ-మెయిల్స్‌‌కు మీ స్టైల్లోనే రిప్లై!

iQOO 15 Mobile: లుక్‌, స్పీడ్‌, కెమెరా మూడు కలిసిన మాస్టర్‌పీస్‌ ఐక్యూ 15.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే

Phone Fake charger: ఛార్జర్లతో డ్యామేజ్ అవుతున్న ఫోన్లు.. నకిలీ ఛార్జర్లను ఇలా గుర్తించండి

Vivo V40 Pro 5G: ఫోన్‌ కాదు, మినీ కెమెరా స్టూడియో.. ట్రెండ్‌ మార్చిన వివో వి40 ప్రో 5జి పూర్తి వివరాలు

WhatsApp: ఇకపై ఆ ఫోన్లలో వాట్సప్ బంద్.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేశారా?

Big Stories

×