E-Paper
Advertisement

రియల్‌మీ నయా ఫోన్స్.. రేపే విడుదల.. ఫీచర్లు కెవ్వు కేక!

రియల్‌మీ నయా ఫోన్స్.. రేపే విడుదల.. ఫీచర్లు కెవ్వు కేక!
Advertisement

Realme New Phones 2026: ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ.. కొత్త మోడల్స్ లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ‘Realme C100 5G’, ‘Realme C100i’ పేర్లతో ఈ వారంలోనే థాయిలాండ్ లో ఈ ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భారత్ లోనూ ఈ మోడల్స్ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ రియల్ మీ ఫోన్స్ ఫీచర్లు, ధర వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

ధర ఎంతంటే?

ప్రముఖ టెక్ వెబ్ సైట్ iPhone-Droid.net కథనం ప్రకారం.. ఏప్రిల్ 3న థాయిలాండ్ లో రియల్ మీ తన కొత్త మోడల్స్ ను లాంచ్ చేయనుంది. అయితే ఈ ఫోన్లకు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలను రియల్ మీ అధికారికంగా ప్రకటించినప్పటికీ.. నెట్టింట వాటి ఫీచర్లు లీకయ్యాయి. వాటి ప్రకారం Realme C100 5G మెుబైల్ 4GB + 128GB వేరియంట్ ధర.. థాయిలాండ్ కరెన్సీ ప్రకారం 7,000 థాయ్ బాట్స్. భారతీయ కరెన్సీలో ఇది రూ.20,100కు సమానం. అలాగే 6GB + 128GB మోడల్ ధరను 7,500 థాయ్ బాట్స్ (సుమారు రూ.21,500)గా నిర్ణయించినట్లు సమాచారం.

లీకైన ఫీచర్లు ఏంటంటే?

Advertisement

రియల్‌మీ C100 5G మెుబైల్.. HD+ రిజల్యూషన్, 900 నిట్స్ బ్రైట్‌నెస్, 144Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.8 అంగుళాల LCD స్క్రీన్ కలిగి ఉన్నట్లు సమాచారం. మరోవైపు C100i మోడల్ సైతం HD+ రిజల్యూషన్, 900 నిట్స్ బ్రైట్ నెస్ తో పాటు 120 రిఫ్రెష్ రేట్ తో రాబోతున్నట్లు టెక్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ఈ రెండు ఫోన్లు.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC ప్రాసెసర్‌తో పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మీ యూఐపై వర్క్ చేస్తాయని అంటున్నారు.

 7000mAh భారీ బ్యాటరీ..

రియల్ మీ తన కొత్త మోడల్స్ కు 7000mAh బ్యాటరీని అమర్చినట్లు తెలుస్తంోంది. C100 5G వేరియంట్ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తే.. C100i వేరియంట్ మాత్రం 15W తో వస్తున్నట్లు సమాచారం. ఇక ఈ రెండు మోడళ్లలో USB టైప్ C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉండనున్నాయి.

Advertisement

Also Read: పసిడి ప్రేమికులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేటి రేట్లు ఇవే!

కెమెరా విషయానికి వస్తే..

మరోవైపు రియల్ కొత్త ఫోన్స్.. నాణ్యమైన కెమెరా క్వాలిటీతో రాబోతున్నట్లు తెలుస్తోంది. Realme C100 5G మోడల్లో .. 50MP మెయిన్ కెమెరా + 5MP సెల్ఫీ సెన్సార్ ఉండనున్నట్లు సమాచారం. అలాగే Realme C100iలోనూ 50MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు దుమ్ము, దూళి నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ ను సైతం ఈ ఫోన్లకు అందించినట్లు లీకైన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Also Read: మావిగన్ మామయ్య.. ఇలా దొరికావు ఏంటయ్యా.. ఇలాంటి రోస్టింగ్ ఎప్పుడూ చూడలే!

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×