MAVIGUN Trolls: ఏపీ రాజధానికి ప్లాన్ – బి ఉండాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీశాయి. మచిలిపట్నం (MA), విజయవాడ (VI), గుంటూరు (GUN)ను కలుపుతూ ‘మావిగన్’ (MAVIGUN)పేరుతో కొత్త రాజధాని ప్రతిపాదనను బుధవారం జగన్ చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా జగన్ పై విమర్శలు మెుదలయ్యాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్, ఎడిట్ చేసిన సినిమా క్లిప్స్ తో విపరీతంగా రోస్టింగ్ చేస్తున్నారు. జగన్ పై గతంలోనూ ట్రోల్స్ వచ్చినప్పటికీ.. ఈ స్థాయిలో రావడం ఇదే తొలిసారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మచిలిపట్నం, విజయవాడ, గుంటూరు పేర్లు వచ్చేలా జగన్ చేసిన రాజధాని ప్రతిపాదనపై టీడీపీ శ్రేణులు, నెటిజన్లు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్నారు. ఓ సినిమాలో రాజేంద్రప్రసాద్ తన పేరును షార్ట్ కట్ లో ‘బావ’ అని ఎందుకు పెట్టుకున్నారో వివరించే సన్నివేశాన్ని.. జగన్ వీడియోకు అటాచ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. మీరు కూడా దానిని చూసేయండి.
పేరు బాగాలేదు మార్చండి.#MAVIGUN https://t.co/iiee4W1kgg pic.twitter.com/xx37wAbL0t
— S S GOD दास👑礼 (@rockhearted_) April 1, 2026
టీడీపీకి చెందిన ఓ అభిమాని షేర్ చేసిన ఓ పోస్ట్ సైతం.. నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. బుర్ర ఉన్నోడు.. ఆంధ్రప్రదేశ్ కు సరిగ్గా మధ్యలో విజయవాడ, గుంటూరు మధ్యన ఉన్న అమరావతి ప్రాంతాన్ని ఎంచుకొని ప్రజా రాజధాని కడుతున్నారని పేర్కొన్నారు. కానీ బుర్ర లేని వ్యక్తి వచ్చి.. 170 కి.మీ హైవే ఉంది దానికి అటూ ఇటూ పక్కన కట్టేయచ్చు కదా అని సొల్లు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. దీనిని సూచించే గూగుల్ మ్యాప్ ను సైతం ఆ నెటిజన్ పంచుకున్నారు.
Pic 1 – బుర్ర ఉనోడు : ఆంధ్రప్రదేశ్ మధ్యన
ఒక ప్రాంతం #Amaravati అది కూడా విజయవాడ + గుంటూరు మధ్యన ఎంచుకొని ప్రజా రాజధాని కడుతున్నారు
మెగా సిటీPic 2 – బుర్ర లేనోడు : 170 KM హైవే ఉంది దానికి అటు ఇటు పక్కన కట్టేయచ్చు రాజధాని #Mavigun అంటూ సొల్లు కబుర్లు చెబుతున్నాడు pic.twitter.com/gAYZR9m9Ti
— Usif P (@Pusif41412) April 1, 2026
వైసీపీ అధినేత జగన్ సరిగ్గా ఏప్రిల్ 1వ తేదీన బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడాన్ని కూడా ట్రోలర్స్ హైలెట్ చేస్తున్నారు. మావిగన్ రాజధాని గురించి జగన్ మాట్లాడుతున్న ఆడియో క్లిప్ ను తీసుకొచ్చి.. ఓ మూవీలో మతిస్థిమితం లేని పాత్రకు జత చేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఆ పోస్టుకు పెట్టిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏప్రిల్ ఫూల్స్ డే సందర్భంగా జగన్ బయటకొచ్చి.. వైసీపీ శ్రేణులకు గిఫ్ట్ ఇచ్చారని అందులో రాసుకొచ్చారు. మరోవైపు జగన్ మావిగన్ సూచనలకు వైసీపీ శ్రేణులు ఎలివేషన్స్ ఇస్తున్నప్పటికీ వారి లోపలి ఫీలింగ్ ఇదేనంటూ మరో వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
April Fool's Day Gift to YCP Paytms – #MaViGun pic.twitter.com/sleVAliQp3
— Twood Trolls ™ (@TwoodTrolls_2_0) April 1, 2026
Paytms giving elevations to YS Jagan about 'MAVIGUN'
But their inner feeling : pic.twitter.com/20R1sOPh4U
— Sree✨ (@urstrulymanth) April 1, 2026
మరోవైపు జగన్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ.. గుంటూరు వాసులు జగన్ పై సెటైర్లు వేస్తున్నారు. మా ప్రాంతాన్ని చివరన ఎందుకు పెట్టావన్నా? అంటూ ప్రశ్నిస్తున్న వీడియో.. నెట్టింట చక్కర్లు కొడుతోంది. మచిలీపట్నం స్థానంలో గుంటూరును ముందుకు తీసుకొచ్చి ‘GUN VI MA’ అని పెట్టొచ్చు కదా అని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ట్రెండింగ్ అవుతోంది. అయితే ఈ క్యాప్షన్ కు అతడు జతచేసిన వీడియో.. నెటిజన్లను నవ్విస్తోంది. అదేంటో మీరు చూసేయండి.
MA VI GUN . endhukanna maa GUNTUR ni last lo dengavu ?
Aaa GUN VI MA anni pettachu ga..🥲 https://t.co/mShv6LjmUt pic.twitter.com/CzPucqqnP3
— S U N N Y (@NSTC9999) April 1, 2026
Also Read: అమరావతికి పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభ తర్వాత నేడు రాజ్యసభ ముందుకు కీలక బిల్లు!
వైఎస్ జగన్ మావిగన్ వ్యాఖ్యలపై మరిన్ని ట్రోలింగ్ పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఓ పోస్ట్ జగన్ ను విపరీతంగా రోస్టింగ్ చేసింది. చార్లీ చాప్లిన్, రాజబాబు, రేలంగి, బ్రహ్మానందం, వడివేలు సహా.. ప్రపంచంలో ఉన్న హాస్యనటులందరూ కలిసి నటించినా ఇంతగా నవ్వించలేరని ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. రవితేజ-బ్రహ్మీ, రానా, పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వుతున్న జిఫ్ ఫైల్స్ ను జత చేశారు. ఇలా మరికొన్ని పోస్టులు సైతం జగన్ వ్యాఖ్యలను ట్రోల్ చేస్తూ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
చార్లీ చాప్లిన్, రాజబాబు, రేలంగి, బ్రహ్మానందం, వడివేలు…సహా ప్రపంచంలో ఉన్న హాస్యనటులు అందరూ కలిసి నటించినా ఇంతగా నవ్వించలేరు…!!🤓😅😆😁😄😅😂🤣😂😅😆😁😄😃😂🤣😅😁😁😁
నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవడిదిరా బాధ్యత…??🙆😡#MaViGun pic.twitter.com/I0oEFIE1da
— Ànjaneyulu Gudapati (@anj02020) April 1, 2026
First e pichodu win avali ga 😭😂😂😂😂pic.twitter.com/JEwLozRkqg https://t.co/26EAxSVhUg
— LOKI 火 🐆 (@LOKIOG11) April 1, 2026
MA VI GUN
pic.twitter.com/I1D7VqJ8ms— MA-VI-GUN (@Madhava_Tweetzz) April 1, 2026
Also Read: బాలికలకు ముఖ్య గమనిక.. కేజీబీవీ అడ్మిషన్లు గడువు పొడిగింపు, చివరి తేదీ ఎప్పుడంటే