E-Paper
Advertisement

Realme GT 6: ఆర్డర్ చేసేయండి బాసు.. ఈ ఆఫర్లు మిస్ చేస్తే మళ్లీ కొనుక్కోలేరు.. ఫీచర్లు హై క్లాస్..!

Realme GT 6: ఆర్డర్ చేసేయండి బాసు.. ఈ ఆఫర్లు మిస్ చేస్తే మళ్లీ కొనుక్కోలేరు.. ఫీచర్లు హై క్లాస్..!
Advertisement

Realme GT 6 Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్ మి ఇటీవలే Realme GT 6T ఫోన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేసింది. ఆ ఫోన్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు మరో ఫోన్ లాంచ్ అయింది. Realme GT 6 పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్ తాజాగా లాంచ్ అయింది. ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

అందులో 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్, 16 జీబీ ర్యామ్+ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ.40,999ల ప్రారంభ ధరతో లభిస్తుంది. అయితే ఈ ఫోన్‌ను ప్రీ ఆర్డర్ సేల్‌లో భాగంగా పలు ఆఫర్లతో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం. ఈ ప్రీ ఆర్డర్ సేల్‌లో అన్ని వేరియంట్లపై భారీ డిస్కౌంట్లను పొందొచ్చు.

Advertisement

8 జీబీ ర్యామ్ – 256 జీబీ స్టోరేజ్.. 16 జీబీ ర్యామ్ – 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లపై రూ.4000 బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్ – 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లపై రూ.3000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ డిస్కౌంట్లతో రియల్ మి జిటి 6 స్మార్ట్‌ఫోన్‌ను మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ ప్రారంభ ఆఫర్లు జూన్ 24వ తేదీ వరకు అందుబాటులో ఉండనున్నాయి.

Also Read: ఎంత విసిరికొట్టినా పగలని ఫోన్లు ఇవే.. కేవలం రూ. 1500 లోపే.. పరుగులే పరుగులు..!

Advertisement

Realme GT 6 Specifications

రియల్ మి జీటీ 6 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్, 6.78 అంగుళాల 8టి ఎల్టీపీఓ ప్రో ఎక్స్ డీఆర్ డిస్‌ప్లేను అమర్చారు. అంతేకాకుండా ఇందులో స్నాప్‌డ్రాగన్ 8S GEN 3 ప్రాసెసర్ ఉంది. ఈ మొబైల్‌లో హీటింగ్ సమస్య రాకుండా ఐస్ బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ‌ను అమర్చారు.

అంతేకాకుండా ఇందులో ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే ఫోటోగ్రఫీ కోసం ఇందులో 50 మెగా పిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఇది 50MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్‌ను కలిగి ఉంది. ఇక ఫోన్ ముందు భాగంలో 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో 5500 ఎంఏహెచ్ డ్యూయల్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×