BigTV English

Top Phones Under Rs 1500: ఎంత విసిరికొట్టినా పగలని ఫోన్లు ఇవే.. కేవలం రూ. 1500 లోపే.. పరుగులే పరుగులు..!

Top Phones Under Rs 1500: ఎంత విసిరికొట్టినా పగలని ఫోన్లు ఇవే.. కేవలం రూ. 1500 లోపే.. పరుగులే పరుగులు..!

Amazon Feature Phone Mela: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లను ఆకట్టుకునేందుకు తరచూ ఏదో ఒక సేల్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. అందులో తక్కువ ధరకే మంచి ఫోన్లను అందిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా అమెజాన్ మరో సేల్ తీసుకొచ్చింది. అమెజాన్ భారతదేశంలో ‘అమెజాన్ ఫీచర్ ఫోన్ మేళా’ను నిర్వహిస్తోంది.


ఈ సేల్ జూన్ 19న ప్రారంభమైంది. ఇది జూన్ 23 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో అమెజాన్ భారతదేశంలో ఫీచర్ ఫోన్‌ల కొనుగోలుపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. అందువల్ల కాలింగ్, UPI ట్రాన్షక్షన్స్ వంటి పనితీరుతో సెకండరీ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. మీరు రూ. 1,500లోపు పొందగలిగే టాప్ ఫోన్‌లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో చూసేద్దాం.

నోకియా 105


నోకియా 105 ఫోన్ built-in UPI ఫీచర్‌తో వస్తుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు దీనిని బ్లాక్, సియాన్, రెడ్ కలర్ వేరియంట్‌లలో కొనుక్కోవచ్చు. ఇది 1.77-అంగుళాల డిస్ప్లే, 32GB స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది. నోకియా సిరీస్ 30+ ఆపరేటింగ్ సిస్టమ్‌ను నడుపుతుంది. కనెక్టివిటీ కోసం USB, బ్లూటూత్‌ను కలిగి ఉంది. ఇది దాదాపు 22 రోజుల స్టాండ్‌బై టైంతో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుంది. దీని ధర అమెజాన్‌లో రూ. 1199 గా ఉంది.

Also Read: ఓరి బాబోయ్ ఇలాంటి ఆఫర్లు ఎన్నడూ సూడలే.. 15,600mAh బ్యాటరీ, 200MP క్వాడ్-కెమెరా ఫోన్లపై 69శాతం డిస్కౌంట్స్..!

itel Circle 1

itel సర్కిల్ 1 ఫోన్ కూడా మంచి ధరలో అమెజాన్‌లో ఉంది. ఆసక్తి గల కొనుగోలుదారులు దీనిని బ్లాక్, పింక్ కలర్ వేరియంట్‌లలో పొందవచ్చు. ఇది 1.32-అంగుళాల డిస్ప్లే, 4MB ర్యామ్, 32GB స్టోరేజీని కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం బ్లూటూత్, 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. దీనిని రూ.1,449 ధరకు కొనుక్కోవచ్చు.

SG600

SG600 ఫోన్ రూ. 1,399 ధరలో లభిస్తుంది. ఇది built-in UPI ఫీచర్‌తో వస్తుంది. ఆసక్తిగల కొనుగోలుదారులు దీనిని బ్లూ, గోల్డ్, ఎల్లో కలర్ వేరియంట్‌లలో కొనుక్కోవచ్చు. ఇది 2.8-అంగుళాల డిస్ప్లే, 1,900mAh బ్యాటరీని కలిగి ఉంది. అదనంగా ఇది వెనుక భాగంలో ఫ్లాష్‌తో కూడిన 1.3MP కెమెరాను కలిగి ఉంది.

Lava All-New Hero 600i with Glow

లావా ఆల్-న్యూ హీరో 600i గ్లో ఫోన్ రూ. 870 ధరతో లభిస్తుంది. ఆసక్తి గల కొనుగోలుదారులు దీనిని మొత్తం ఐదు కలర్ వేరియంట్‌లలో పొందవచ్చు. ఇది గ్లో-ఇన్-ది-డార్క్ కీప్యాడ్. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తుంది. అదనంగా ఇది built-in FM రేడియో, ఇతర ఫీచర్లతో పాటు MP3తో వస్తుంది. అందువల్ల పెద్ద పెద్ద ఫోన్లపై ఇంట్రెస్ట్ లేనివారికి ఈ మొబైల్స్ చాలా బెటర్

Tags

Related News

Google App Changes: ఫోన్‌లో డయలర్‌ ఎందుకు మారింది? పాత పద్దతి కావాలంటే జస్ట్ ఇలా చేయండి

Pixel 10 vs Galaxy S25: రెండు టాప్ ఆండ్రాయిడ్ ఫ్లాగ్ షిప్ ఫోన్ల మధ్య పోటీ.. విన్నర్ ఎవరంటే?

Realme 15 vs Redmi 15: ఏ 5G ఫోన్ కొనాలి?

Best Gaming Moblies: 2025లో బెస్ట్ గేమింగ్ మొబైల్స్.. రూ.65000 లోపు బడ్జెట్‌లో అదిరిపోయే ఫోన్లు

Google Veo 3 Free: ఏఐ వీడియోలు చేయడం పూర్తిగా ఫ్రీ.. గూగుల్ వియో 3 ఇప్పుడే ట్రై చేయండి!

Prostate Cancer: వైద్యరంగంలో ఏఐ విప్లవం.. క్యాన్సర్ నిర్థారణలో మరో ముందడుగు

Big Stories

×