E-Paper
Advertisement

ఒక్క రోజు ఛార్జ్ చేస్తే.. 20 రోజుల బ్యాటరీ! ఈ వాచ్ ఫీచర్స్ చూశారా ?

ఒక్క రోజు ఛార్జ్ చేస్తే.. 20 రోజుల బ్యాటరీ! ఈ వాచ్ ఫీచర్స్ చూశారా ?
Advertisement

realme Watch S2 Review: ఈ రోజుల్లో స్మార్ట్‌ వాచ్ అనేది కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమే కాదు, మన లైఫ్‌స్టైల్‌ని, హెల్త్‌ని ట్రాక్ చేసే ఒక పవర్‌ఫుల్ గ్యాడ్జెట్. ప్రముఖ టెక్ బ్రాండ్ రియల్‌మీ నుంచి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త realme Watch S2 ప్రస్తుతం ట్రెండ్ సెట్ చేస్తోంది. కేవలం రూ.3,299 బడ్జెట్ ధరలో ప్రీమియం డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ సూపర్ ఏఐ ఇంజన్, ఏకంగా 20 రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తున్న ఈ క్రేజీ స్మార్ట్‌వాచ్ ఫుల్ రివ్యూ , ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బడ్జెట్ ధరలో లగ్జరీ లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్:

క్లాసీ డిజైన్ ,క్రిస్టల్ క్లియర్ డిస్‌ప్లే:
ఈ వాచ్‌ను చేతికి పెట్టుకుంటే ఒక క్లాసిక్ అనలాగ్ వాచ్ లుక్ వస్తుంది. దీని గ్రే కలర్ స్ట్రాప్ చాలా ప్రీమియంగా , కంఫర్టబుల్‌గా ఉంటుంది.

Advertisement

డిస్‌ప్లే:
ఇందులో 1.43 ఇంచుల పవర్‌ఫుల్ డిస్‌ప్లేను అందించారు. దీని బ్రైట్‌నెస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎండలో బయటకు వెళ్లినా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.

ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే :

Advertisement

ఈ ఫీచర్ వల్ల వాచ్ స్క్రీన్ ఎప్పుడూ ఆన్‌లోనే ఉండి, ప్రీమియం లుక్‌ని ఇస్తుంది.

సూపర్ ఏఐ ఇంజన్ :
రియల్‌మీ ఈసారి ఈ వాచ్‌లో సరికొత్త సూపర్ ఏఐ ఇంజన్‌ను ప్రవేశపెట్టింది. దీని సహాయంతో .. మీరు మీ వాయిస్ ద్వారానే వాచ్‌ను కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు.. మీ మూడ్ , డ్రెస్సింగ్ స్టైల్‌కు మ్యాచ్ అయ్యేలా వందలాది ఏఐ వాచ్ ఫేసెస్ ను ఇది క్షణాల్లో క్రియేట్ చేసి ఇస్తుంది.

నెక్స్ట్ లెవెల్ బ్యాటరీ లైఫ్:
సాధారణంగా అల్మోడ్ డిస్‌ప్లే ఉన్న వాచెస్ బ్యాటరీ 3 లేదా 4 రోజులు మాత్రమే వస్తుంది. కానీఈ వాచ్ లోని ఆప్టిమైజ్డ్ చిప్‌సెట్, పవర్‌ఫుల్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ వల్ల నార్మల్ యూసేజ్‌లో ఇది ఏకంగా 20 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. బ్లూటూత్ కాలింగ్ ఎక్కువగా వాడినా కూడా వారం రోజులకు పైగా బ్యాటరీ వస్తుంది.

బ్లూటూత్ కాలింగ్ ,హెల్త్ ట్రాకింగ్:
ఇందులో ఇన్-బిల్ట్ మైక్, స్పీకర్ ఉన్నాయి. దీని వల్ల ఫోన్ జేబులో ఉన్నా సరే, వాచ్ నుంచే డైరెక్ట్‌గా కాల్స్ మాట్లాడేయొచ్చు.

హెల్త్ ఫీచర్స్:

24/7 హార్ట్ రేట్ మానిటర్, SpO2(బ్లడ్ ఆక్సిజన్) సెన్సార్, స్లీప్ ట్రాకింగ్ , స్ట్రెస్ మానిటరింగ్ వంటి అన్ని హెల్త్ ఫీచర్స్ ఇందులో పక్కాగా పనిచేస్తాయి. స్పోర్ట్స్ లవర్స్ కోసం ఇందులో 110+ పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.

ధరల వివరాలు :
ఫీచర్స్ పరంగా ప్రీమియం వాచ్‌లకు గట్టి పోటీ ఇస్తున్న ఈ వాచ్ ధర మిమ్మల్ని ఖచ్చితంగా ఇంప్రెస్ చేస్తుంది.

ధర:

ప్రస్తుతం ఆన్‌లైన్ స్టోర్స్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఈ గ్రే స్ట్రాప్ వేరియంట్ కేవలం రూ.3,299 కే లభిస్తోంది.

ప్లస్ & మైనస్ పాయింట్స్:
ప్లస్: బ్రైట్ డిస్‌ప్లే, 20 రోజుల అద్భుతమైన బ్యాటరీ, సూపర్ ఏఐ ఫీచర్స్, ప్రీమియం మెటల్ బాడీ.

మైనస్: ఇన్-బిల్ట్ జీపీఎస్ లేదు (ఫోన్ జీపీఎస్ వాడుకుంటుంది).

తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం బ్రాండ్ వాల్యూ, అదిరిపోయే లుక్ , లాంగ్ బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి realme Watch S2 ఒక బెస్ట్ అండ్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్‌వాచ్.

Tags

Related News

బట్టలు తొడిగే రోబోట్ వచ్చేసింది.. బద్దకస్తులకు భలే వరం!

రూ.1,299 కే అదిరిపోయే బేస్! ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన సౌండ్ బాక్స్

యాపిల్ మ్యాక్‌బుక్‌లకు గట్టి పోటీ.. ఒక్క ఛార్జ్‌తో 22 గంటల బ్యాటరీ!

ఇక పిల్లల Meta AI చాట్స్‌పై నిఘా.. ఆత్మహత్య ఆలోచనలు వస్తే పేరెంట్స్‌కు అర్జెంట్ నోటిఫికేషన్!

ఇంట్లోనే బేకరీ స్టైల్ కేకులు! బేకింగ్, డిఫ్రాస్టింగ్ కోసం 5 బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్లు

పోలీసులను వీడియో తీయెుచ్చా? ఫోన్ లాక్కునే హక్కు వారికి లేదా? చట్టం ఏం చెబుతోంది?

ఏఐ సెన్సార్లు, స్టీమ్ వాష్..ఇంతకంటే బెస్ట్ వాషింగ్ మెషీన్లు ఉండవేమో!

Big Stories

Advertisement
×