E-Paper
Advertisement

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?

పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?
Advertisement

IRCTC Launches New Website: రైలు టికెట్ బుక్ చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. సైట్ స్లోగా పనిచేయడం, తత్కాల్ బుకింగ్ టైమ్ లో సర్వర్ డౌన్ కావడం, ఎక్కువ క్లిక్‌లు చేయాల్సి రావడం వల్ల ప్రయాణికులు చిరాకు పడేవాళ్లు. ఈ సమస్యలన్నింటికీ చెక్ పెడుతూ భారతీయ రైల్వే, IRCTC వెబ్‌ సైట్‌ ను పూర్తిగా అప్ డేట్ చేసింది. కొత్త రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త డిజైన్‌ తో పాటు హైస్పీడ్ టెక్నాలజీ, ఈజీ నావిగేషన్, ఫాస్ట్ బుకింగ్ సిస్టమ్‌ ను పరిచయం చేసింది.

1.సీట్ల లభ్యత

కొత్త వెబ్‌ సైట్‌ లో కనిపించే ప్రధాన మార్పుల్లో ఒకటి అన్ని క్లాసుల సీట్ల లభ్యత ఒకే స్క్రీన్‌ పై కనిపించడం. గతంలో స్లీపర్, 3ఏసీ, 2ఏసీ అంటూ ప్రతి క్లాస్‌ను విడివిడిగా ఎంచుకుని సీట్లు ఉన్నాయా? లేదా? చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మాత్రం ఒకే పేజీలో అన్ని క్లాసుల వివరాలు కనిపిస్తాయి. దీంతో సమయం ఆదా కావడంతో పాటు టికెట్ సెలెక్షన్ కూడా ఈజీ అయ్యింది.

2.స్పీడ్ బుకింగ్

Advertisement

ఇప్పుడు మరింత వేగంగా టికెట్ బుకింగ్ లభిస్తోంది. ముఖ్యంగా తత్కాల్ టికెట్ల సమయంలో పాత వెబ్‌ సైట్ తరచూ సర్వర్ సమస్యలను ఎదుర్కొనేది. పేజీలు ఓపెన్ కాకపోవడం, పేమెంట్స్ ఫెయిల్ కావడం వంటి సమస్యలు సాధారణంగా ఉండేవి. ఇప్పుడు కొత్త బుకింగ్ వ్యవస్థలో వెబ్‌ సైట్ సామర్థ్యం భారీగా పెరిగింది. గతంతో పోలిస్తే చాలా ఎక్కువ సంఖ్యలో టికెట్లను తక్కువ సమయంలో ప్రాసెస్ చేయగలిగేలా సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

3.నో పాప్ అప్ యాడ్స్

ఇక బుకింగ్ సమయంలో ఇబ్బంది పెట్టే పాప్ అప్ యాడ్స్, తరచూ వచ్చే క్యాప్చాలను కూడా తగ్గించారు. గతంలో ప్రతి దశలో యాడ్స్ కనిపించడం, మళ్లీ మళ్లీ క్యాప్చాలను నమోదు చేయాల్సి రావడం వల్ల టైమ్ వేస్ట్ అయ్యేది. ఇప్పుడు వెబ్‌సైట్‌ను మరింత క్లీన్ గా వేగంగా కనిపించడం వల్ల బుకింగ్ ఈజీ అవుతోంది.

4.ఫీచర్ ఫేర్ క్యాలెండర్

Advertisement

మరో యూజ్ ఫుల్ ఫీచర్ ఫేర్ క్యాలెండర్. ఒక రోజుకే పరిమితం కాకుండా, రాబోయే తేదీల్లో టికెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒకేసారి చూడొచ్చు. దీంతో తక్కువ ధర ఉన్న రోజును ఎంచుకుని ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, లోయర్, మిడిల్, అప్పర్ బెర్త్ లాంటిని ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు.

5.ప్రాంతీయ భాషలు

భాష విషయంలో కూడా IRCTC కీలక మార్పులు చేసింది. గతంలో ప్రధానంగా ఇంగ్లీష్, హిందీ మాత్రమే ఉండగా, ఇప్పుడు పలు భారతీయ ప్రాంతీయ భాషలను కూడా అందిస్తోంది. ఇంగ్లీష్ తెలియని ప్రయాణికులు కూడా తమకు అర్థమయ్యే భాషలో టికెట్ బుక్ చేసుకోవచ్చు.

6.రాయితీ టికెట్ బుకింగ్

అటు విద్యార్థులు, రోగులు, దివ్యాంగులు వంటి ప్రత్యేక వర్గాలకు అందించే రాయితీ టికెట్ బుకింగ్ విధానాన్ని కూడా సులభతరం చేశారు. గతంలో వేర్వేరు ప్రక్రియలు ఉండగా, ఇప్పుడు ఒకే ప్లాట్‌ ఫారమ్‌ లోనే అన్ని రాయితీలను పొందే అవకాశం కల్పించారు.

Read Also: మాన్సూన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 డెస్టినేషన్స్ మిస్ అవొద్దు!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×