Redmi 15C 5G: షియోమీ సంస్థకు చెందిన రెడ్‌మీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మీ 15C 5G’ డిసెంబరు 3న భారత మార్కెట్‌లో విడుదల కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన Redmi 14C 5Gకి కొనసాగింపుగా వస్తోన్న ఈ హ్యాండ్‌సెట్ ఆధునిక డిజైన్, మెరుగైన పనితీరు, భారీ బ్యాటరీ లైఫ్‌తో రూపొందించబడింది. ఈ ఫోన్ గ్లోబల్ వేరియంట్ ఆధారంగా చూస్తే.. దీనిలో 6.9 అంగుళాల HD+ డిస్‌ప్లేతో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ ఉండనుంది. అలాగే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5G చిప్‌సెట్, 8GB వరకు RAM వేరియంట్లు, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి అధునాతన ఫీచర్లు ఉండనుందని సమాచారం. ఈ నేపథ్యంలో రెడ్‌మీ 15C 5G ఫోన్ పూర్తి వివరాలేంటో చూసేద్దాం రండి..
ఈ రెడ్‌మీ 15C 5G ఫోన్.. భారీ 6000 mAh బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉండవచ్చు. సాధారణ రోజువారీ వినియోగానికి పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుందని లీక్స్ ద్వారా తెలుస్తోంది. అలాగే వీడియోలను చూడటం, చాట్ చేయడం లేదా వెబ్‌లో గంటల తరబడి బ్రౌజ్ చేయడం ద్వారా మళ్లీ ఛార్జ్ చేసుకోవచ్చు. బ్యాటరీ అయిపోగానే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. ఇకపోతే.. రెడ్‌మీ 15C 5G ఫోన్ కెమెరా ఫీచర్లలో బ్యాక్ సైడ్ 50MP కెమెరా ఉంది. సెల్ఫీలు లేదా ఇతర వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అలాచ్ చేశారు.
భారత మార్కెట్లో రెడ్‌మీ 15C 5G హ్యాండ్‌సెట్ 4GB RAM+ 128GB స్టోరేజీతో బేస్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంటుందని అంచనా. 6GB RAM+ 128GB స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.13,999గా ఉంటుందని, టాప్-ఆఫ్-ది-లైన్ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.14,999గా లాంచ్ కావచ్చని సమాచారం. అలాగే ఈ హ్యాండ్ సెట్ చౌకైన 5G స్మార్ట్‌ఫోన్ యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.