E-Paper
Advertisement

Akhanada 2: జర్మనీలో అఖండ2 కు భారీ క్రేజ్.. రూ.1లక్ష అమ్ముడుపోయిన సూపర్ ఫ్యాన్ టికెట్!

Akhanada 2: జర్మనీలో అఖండ2 కు భారీ క్రేజ్.. రూ.1లక్ష అమ్ముడుపోయిన సూపర్ ఫ్యాన్ టికెట్!
Advertisement

Akhanada 2: నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)హీరోగా బోయపాటి శ్రీను(Boyapati Sreenu)  అఖండ 2. (akhanda 2)ఈ సినిమాకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా విపరీతమైన ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జర్మనీలో కూడా అఖండ 2 సినిమాకి భారీగా ఆదరణ లభిస్తుంది ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా బాలయ్యకు ఓవర్ సీస్ అఖండ 2 సినిమాకి భారీగా బిజినెస్ జరిగిందని చెప్పాలి. ఈ సినిమా జర్మనీలో తారకరామా ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే తారకరామా ఎంటర్టైన్మెంట్స్ తరఫున శ్రీకాంత్ కుడితిపూడి మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

లక్ష రూపాయలకు సూపర్ ఫ్యాన్ టికెట్

ఈ సినిమా జర్మనీ రైట్స్ దక్కడానికి సహకరించిన 14 డ్రిల్స్ పరుచూరి కిరీటి రిలయన్స్ శ్రీధర్ యూకే డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్ రామ్ అలాగే శ్రీను గోగినేనికు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇక అఖండ సినిమాని ప్రతి సెంటర్లో నందమూరి అభిమానులతో కలిసి భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా సూపర్ ఫ్యాన్ టికెట్ అంటూ మొదటి టికెట్ వేలం వేసినట్లు వెల్లడించారు. ఈ టికెట్ ను జర్మనీ ఫ్రాంక్ ఫర్ట్ ప్రాంతంలో వేలం వేయగా మొదటి టికెట్ లక్ష రూపాయలకు అమ్ముడుపోయినట్లు వెల్లడించారు ఈ టికెట్టును అనంతపురానికి చెందిన రాజశేఖర్ పార్నపల్లి దక్కించుకున్నట్లు తెలియజేశారు.

జర్మనీలోను ఆఖండ ప్రమోషన్స్..

Advertisement

ఈ విధంగా అఖండ సినిమా సూపర్ ఫ్యాన్ టికెట్ సొంతం చేసుకున్న రాజశేఖర్ పార్నపల్లి మాట్లాడుతూ .. తాను అనంతపురం నుంచి జర్మనీకి వచ్చిన తనకు బాలయ్య పై ఉన్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని మరింత పెరిగిందని వెల్లడించారు . బాలయ్య సినిమా వస్తుందంటే రెండు తెలుగు రాష్ట్రాలలో పండుగ వాతావరణం ఏర్పడుతుంది ఇండియాలో చేసినట్టే ఇక్కడ కూడా భారీగా ప్రమోషన్లను నిర్వహించడం బ్యానర్లు కడుతూ ఈ సినిమాని ప్రజలలోకి తీసుకు వెళ్లే కార్యక్రమాలను తారకరామా ఎంటర్టైన్మెంట్ చేస్తుండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు.

అఖండ తాండవం కోసం ఎదురుచూపులు ..

Advertisement

ఇక బాలయ్య అఖండ తాండవం ఎలా ఉండబోతుందో చూడటానికి తాము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని రాజశేఖర్ తెలిపారు. ప్రస్తుతం ఫ్రాంక్ ఫర్ట్ మాత్రమే ఫ్యాన్స్ టికెట్ ను సొంతం చేసుకున్న అభిమాని వివరాలను వెల్లడించాము. తర్వాతి రోజుల్లో మ్యూనిక్, న్యూరెంబర్గ్ వంటి తదితర ప్రాంతాలలో కూడా భారీ ధరలకు కొనుగోలు చేసిన అభిమానుల వివరాలను కూడా ఇలాగే వెల్లడించబోతున్నట్టు సుమంత్ కొర్రపాటి తెలిపారు. ఇలా లక్షలు ఖర్చు చేసి బాలయ్య సినిమా టికెట్లు కొనుగోలు చేశారు అంటే ఓవర్సీస్ లో బాలకృష్ణకు ఏ విధమైనటువంటి ఆదరణ లభిస్తోందో స్పష్టంగా అర్థం అవుతుంది.

Also Read: Spirit Movie: స్పిరిట్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గట్టిగనే ప్లాన్ చేస్తున్న సందీప్ రెడ్డి!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×