E-Paper
Advertisement

Redmi 17 4G లీక్స్.. 7500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో త్వరలోనే మార్కెట్లోకి!

Redmi 17 4G లీక్స్.. 7500mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో త్వరలోనే మార్కెట్లోకి!
Advertisement

Redmi 17 4G: షావోమీ బడ్జెట్ విభాగంలో మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. అధికారిక ప్రకటనకు ముందే Redmi 17 4G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ ప్రధానంగా భారీ బ్యాటరీ, పెద్ద స్క్రీన్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని వస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పుడీ ఫోన్ పూర్తి వివరాల్లోకి వెళ్లిపోదాం..

ఈ Redmi 17 4Gలో 6.9 ఇంచుల పెద్ద ఫ్లాట్ డిస్‌ప్లేను అందించబోతున్నారు. 120Hz రీఫ్రెష్ రేట్‌తో రానున్న ఈ స్క్రీన్ వల్ల గేమింగ్, సోషల్ మీడియా స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటాయి. కంటికి అలసట కలగకుండా ట్యూవ్ రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, అలాగే స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను ఇందులో ఇస్తున్నారు.

Advertisement

Also Read: ఇది కదా టెక్నాలజీ అంటే.. స్మార్ట్ గ్లాసెస్ కోసం గోరంత కూలింగ్ ఫ్యాన్!

అలాగే ఇందులో ప్రధాన ఆకర్షణ దీని 7500mAh బ్యాటరీ. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే హెవీ యూసేజ్‌లోనూ సులువుగా రెండు రోజుల పాటు వస్తుంది. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇస్తుండటంతో, ఫోన్‌ను వేగంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

ఇక పనితీరు విషయానికి వస్తే.. Redmi 17 4Gలో మీడియాటెక్ హెలియో G91 అల్ట్రా ప్రాసెసర్‌ను ఉపయోగించారు. రోజువారీ పనులు, మల్టీటాస్కింగ్‌ను ఇది సజావుగా నడుపుతుంది. 4GB, 6GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

ఫొటోల కోసం వెనుక వైపు 50MP ప్రైమరీ కెమెరాతో పాటు 5MP సెకండరీ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీల కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, AI ఫేస్ అన్‌లాక్‌లతో పాటు IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. గ్రీన్, బ్లూ, బ్లాక్, పర్పుల్ రంగుల్లో ఈ ఫోన్ విడుదల కానుంది.

Also Read: షాపింగ్ మాత్రమే కాదు, ఇకపై ఫుడ్ కూడా.. Flipkart కొత్త ప్లాన్ మామూలుగా లేదుగా!

Related News

ఇంటి పైకప్పుపై వాటర్ బాటిల్ ట్రిక్.. 30 దేశాల్లో సూపర్ సక్సెస్.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌తో కాకుండా.. మెటల్‌‌ తోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

Big Stories

Advertisement
×