Vaibhav Sooryavanshi On IND VS ZIM: టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Team India vs. Zimbabwe) మధ్య నిన్నటితో టి20 సిరీస్ ( India tour of Zimbabwe 2026) ముగిసిన సంగతి తెలిసిందే. గత ఐదు రోజుల కిందట టీమ్ ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య ఐదు రోజుల కిందట టీ20 సిరీస్ ప్రారంభం కాగా.. ఇందులో టీమిండియా మూడింటిలో గెలిచింది. అంటే ఇండియా చేతిలో జింబాబ్వే వైట్ వాష్ అయింది. ఈ క్రమంలో టీమిండియా పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే దీనిపై వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జింబాబ్వేపై టీమిండియా గెలవడం వెనుక మా బీహార్ కుర్రాళ్ల (bihar players) కష్టం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇషాన్ కిషన్, తన వల్ల టీమిండియా జింబాబ్వే లో విక్టరీ సాధించగలిగిందని పేర్కొన్నారు. దీంతో వైభవ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మూడు టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, సిరీస్ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో బీహార్ కుర్రాళ్ళు వైభవ్ సూర్య వంశీ, ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి టోర్నమెంట్ గెలిపించారు. అయితే అంతకంటే ముందు ఈ ఇద్దరు బీహార్ క్రికెటర్లను తొలగించాలని వీరేంద్ర సెహ్వాగ్ లాంటి మాజీ క్రికెటర్లు పోస్టులు పెట్టారు. బహిరంగంగా కూడా వ్యతిరేకించారు. అయితే దీనిపై తాజాగా వైభవ్ సూర్య వంశీ రియాక్ట్ అయ్యారు. బీహార్ కుర్రాళ్ళు వెధవలంటూ చాలామంది ట్రోలింగ్ చేశారని ఫైర్ అయ్యారు.
కానీ తమ వల్లనే ఇవాళ టీమిండియా టి20 సిరీస్ గెలిచిందని వ్యాఖ్యానించారు. ఇషాన్ కిషన్, తాను కష్టపడి జింబాబ్వేను ఓడించామని పేర్కొన్నారు. ఓ మ్యాచ్ లో తాను వాడితే… మరో మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అదిరిపోయే బ్యాటింగ్ చేశాడని పేర్కొన్నారు. అలాంటి తమ ఇద్దరినీ చాలామంది జట్టు నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్ చేసినట్లు సీరియస్ అయ్యారు. ఒకసారి విఫలమైతే… జట్టులో నుంచి తొలగించడం ఏ మాత్రం కరెక్ట్ కాదన్నారు. అందరికీ అవకాశాలు ఇవ్వాలని వివరించారు. దీంతో వైభవ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేపుతున్నాయి.
జింబాబ్వే జట్టు పైన వైభవ్ సూర్యవంశీతో పాటు ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించారు. ఈ టోర్నమెంటులో రెండు అర్థ సెంచరీలు చేశాడు 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. మొదటి మ్యాచ్లో 18 బంతుల్లోనే 50 పరుగులు చేసిన వైభవ్.. ఆ తర్వాత మ్యాచ్లో 20 పరుగులు సాధించాడు. చివరి మ్యాచ్లో 49 బంతుల్లో 81 పరుగులు చేసి… సెంచరీ మిస్ చేసుకున్నాడు.
అదే సమయంలో ఈశాన్ కూడా ఈ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించాడు. మొదటి మ్యాచ్ లో 35 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, రెండో మ్యాచ్లో 81 పరుగులు సాధించాడు. చివరి మ్యాచ్లో 39 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఓవరాల్ గా ఈ టోర్నమెంట్ లో ఈ ఇద్దరు బీహార్ కుర్రాళ్ళు ఇరగదీసారు. అందుకే వైభవ్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో.. ట్రూలర్స్ కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
Also Read : టెస్ట్ ప్లేయర్ అంటూ ట్రోల్స్..ఇచ్చిపడేసిన తిలక్..రెండో టీ20లోనూ టీమిండియా విజయం