E-Paper
Advertisement

Redmi A3x: అరాచకం.. రూ.6,999లకే కొత్త ఫోన్.. రెడ్‌మి అదరగొట్టేసిందిగా..!

Redmi A3x: అరాచకం.. రూ.6,999లకే కొత్త ఫోన్.. రెడ్‌మి అదరగొట్టేసిందిగా..!
Advertisement

redmi a3x price in india: ప్రముఖ చైనీస్ టెక్ బ్రాండ్ రెడ్ మి దేశీయ మార్కెట్‌లో సత్తా చాటుతోంది. వరుసగా ఫోన్లను లాంచ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్‌మి నుంచో మరో కొత్త ఫోన్ దేశీయ మార్కెట్‌లోకి వచ్చింది. కంపెనీ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా భారతదేశంలో కొనుగోలు చేయడానికి Redmi A3xని అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ జూలైలో భారతదేశంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో టీజ్ చేయబడింది. ఇప్పుడు ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్‌లో Unisoc T603 ప్రాసెసర్ ఉంటుంది. ఇది 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Redmi A3x Price

Advertisement

Redmi A3x స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. అందులో 3GB RAM/ 64 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.6,999గా ఉంది. అదే సమయంలో 4 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ బేస్ మోడల్ అమెజాన్ ఇండియా వెబ్‌సైట్‌లో లిస్ట్ చేయబడింది. కాగా ఇది మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, స్టార్రీ వైట్ కలర్‌లలో అందుబాటులో ఉంది.

Also Read: కుమ్ముడే కుమ్ముడు.. 50MP సెల్ఫీ కెమెరా ఫోన్ సేల్‌కు రెడీ.. బోలెడు డిస్కౌంట్ ఆఫర్లు..!

Advertisement

redmi a3x Specifications

Redmi A3x స్మార్ట్‌ఫోన్ 6.71 అంగుళాల IPS LCD HD+ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. డీసీ డిమ్మింగ్ టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగించారు. ఫోన్ ముందు, వెనుక ప్యానెల్‌లకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సేఫ్టీ ఇవ్వబడింది. ఇందులో Unisoc T603 ప్రాసెసర్‌ అమర్చబడింది. ఫోన్ బేస్ వేరియంట్ 3GB RAMని కలిగి ఉంది. 64 GB స్టోరేజ్ స్పేస్‌తో వస్తుంది. స్టోరేజ్‌ను మైక్రో SD కార్డ్ సహాయంతో 1TB వరకు విస్తరించవచ్చు.

ఈ ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది డ్యూయల్ AI కెమెరా సెటప్‌లో వస్తుంది. దానితో పాటు సెకండరీ లెన్స్ కూడా అందించబడింది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఫోన్ 5 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది Android 14లో రన్ అవుతుంది. ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. దీనిని అమెజాన్‌లో కొనుక్కోవచ్చు.

Related News

ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్

ఫోటో, వీడియో ఎడిటింగ్ సరికొత్తగా! మీ బడ్జెట్‌లో టాప్ 5 డిస్‌ప్లే మానిటర్స్

మీ టీవీకి పర్‌ఫెక్ట్ జోడీ!హోమ్ థియేటర్ ఫీల్ ఇచ్చే.. టాప్ సౌండ్‌బార్స్

తాగునీరు విషయంలో కాంప్రమైజ్ వద్దు ! వీటితో హెల్దీ అండ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్

అమ్మో..ఈ మిక్సర్ గ్రైండర్స్ ఇంత స్మార్టా? మీ టైమ్, మనీ ఆదా చేసే టాప్ 5 మిక్సర్లు ఇవే!

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

Big Stories

Advertisement
×