BigTV English

Independence Day: మురికి కాల్వలు, చెత్తకుప్పల్లో దేశభక్తి.. ఇదేనా నా భారతం ?

Independence Day: మురికి కాల్వలు, చెత్తకుప్పల్లో దేశభక్తి.. ఇదేనా నా భారతం ?

Independence Day (current news from India): స్వాతంత్య్ర దినోత్సవం. నిన్ననే దేశమంతా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. ప్రముఖులు, ముఖ్యమంత్రులు, ప్రధాని సహా ఇతరులు వీధివీధినా, ప్రతి పాఠశాలలో జాతీయ జెండాలను ఎగురవేసి “జనగణమన” అంటూ జాతీయ గీతాలను ఆలపించి.. భరతమాతకు జైహింద్ కొట్టారు. ఆ తర్వాత స్వీట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు పంచిపెట్టి తిన్నారు.


స్వాతంత్య్ర దినోత్సవం అంటే.. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. స్కూలికెళ్లే పిల్లలైతే.. ఎంచక్కా రెడీ అయి.. స్కూల్లో కండక్ట్ చేసే పోటీలకు సిద్ధమవుతారు. జెండా ఎగురవేశాక ఇచ్చే చాక్లెట్లను తీసుకుని మురిసిపోతారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల గురించి టీచర్లు రాసిచ్చిన వ్యాసాలను చదివి వినిపిస్తారు. కొన్ని విద్యాసంస్థలైతే కొన్నిమీటర్ల మేర జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తాయి. ఇది పిల్లల స్వాతంత్య్ర వేడుకలు.

మరి పెద్దలకైతే ? ఇంట్లో ఉన్నవాళ్లు ఎలాగూ జాతీయజెండాను ఎగురవేయలేరు. ఇక చిన్న చిన్న వీధుల్లో అయితే ఆ ఏరియా కార్పొరేటర్ లేదా కౌన్సిలర్, ఇతర లోకల్ లీడర్స్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి.. జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఇదే జరుగుతుంది. కానీ.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ గీతాన్ని ఎగురవేసి, ఇన్ స్టా, ఫేస్ బుక్, X, వాట్సాప్ లలో స్టేటస్ లతో నింపేసే కొందరు ప్రబుద్ధులు.. ఎంతో పవిత్రంగా, గౌరవంగా చూసుకోవలసిన జాతీయ జెండాను అగౌరవ పరుస్తున్నారు.


Also Read : Independence Day: వెలుగు నీడల స్వాతంత్ర్యం

స్థూపం పైకి ఎగురవేసిన జెండాను అవనతం చేసి భద్రపరుస్తున్నారు. కానీ.. జెండా పండుగకు చిన్న చిన్న జెండాలతో అలంకరణ చేసినవాటిని మాత్రం చెత్త కుప్పల్లో, మురికి కాల్వల్లో పడేస్తున్నారు. ఇదేనా మనం మన జాతీయ జెండాకు ఇచ్చే గౌరవం? ఇదా మనం తెచ్చుకున్న స్వాతంత్ర్యం ? ఆర్మీలో అమరవీరులైన వారి భౌతిక కాయంపై జాతీయ జెండాను కప్పి ఉంచుతారు. దానిని ఎంతో గౌరవంగా భావిస్తారు.

జెండా పెద్దది అయితే ఒక గౌరవం, చిన్నది అయిచే చిన్నచూపా ? ఏదైనా జాతీయ జెండా జాతీయ జెండానే. డెకరేషన్ కు, పిల్లలకు ఇచ్చేందుకు వాడినవే కదా. వాటినేం చేసుకుంటాం అనుకుంటారు. అలాగని వాటిని మురికి కాల్వల్లో, రోడ్లపై పడేయడం కూడా సరికాదు కదా. నిజానికి ఇండిపెండెన్స్ డే రోజు డ్రై డే. ఆల్కహాల్, మాంసం అమ్మడం నిషేధం. కానీ ఇప్పుడు అలాంటివేం లేవు. పైగా ఫుడ్ డెలివరీ చేసే కొన్ని రెస్టారెంట్లు మాంసంతో వండిన ఆహారాల ప్యాకింగ్ లపై జాతీయజెండా స్టిక్కర్లు అంటించి డెలివరీ చేసింది. ఆ పార్శిస్ తీసుకున్న కస్టమర్లు ఫుడ్ తినేసి ఆ కవర్లను అలాగే చెత్తబుట్టలో పడేశారు. ఇది మన జెండాను అవమానించినట్లు కాదా ?

ఓ భారతీయుడా.. ఇప్పటికైనా మేలుకో. దేశభక్తి సోషల్ మీడియా వరకూ పరిమితం అయితే చాలా ? నిజంగా నీలో అంత దేశభక్తే ఉంటే.. జాతీయ జెండాకు అగౌరవం కలగకుండా చూడాలి. అలా చేసేవాళ్లకు తప్పు అని చెప్పాలి. విద్యాసంస్థల్లో టీచర్లు కూడా జాతీయజెండాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా వాటిపై అవగాహన కల్పించాలి. నేటి బాలలే రేపటి పౌరులు కదా మరి. మార్పు ఇక్కడి నుంచి మొదలుకావాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×