E-Paper
Advertisement

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో అమెజాన్‌లోకి వచ్చేసిన Redmi Turbo 5!

ఛార్జింగ్ టెన్షన్‌కు ఎండ్ కార్డ్.. భారీ బ్యాటరీ, గేమింగ్ ఫీచర్లతో అమెజాన్‌లోకి వచ్చేసిన Redmi Turbo 5!
Advertisement

Redmi Turbo 5: సాధారణంగా మన దేశంలో మొబైల్ గేమింగ్ ప్రియులు చాలామందే ఉన్నారు. వాళ్లందరికీ రెడ్‌మి ఒక సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. చైనాలో ఆల్రెడీ సంచలనం సృష్టించిన Redmi Turbo 5ను ఇప్పుడు ఇండియాలో దించడానికి అంతా రెడీ చేసింది. ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో దీనికి సంబంధించిన టీజర్ పేజీ కూడా లైవ్ అయిపోయింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఫోన్ చాలా త్వరలోనే మన ముందుకు రాబోతోందని అర్థమవుతోంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు, ముఖ్యంగా పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఆశించేవారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్ కానుంది.

కళ్లు చెదిరే స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్:

ఈ ఫోన్ డిస్‌ప్లే విషయానికొస్తే.. దీనిలో 6.78 ఇంచుల పెద్ద AMOLED స్క్రీన్‌ను ఇస్తున్నారు. దీనికి తోడు 144Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు ఎక్కడా లాగ్ లేకుండా విజువల్స్ చాలా స్మూత్‌గా, కలర్‌ఫుల్‌గా కనిపిస్తాయి. ఫోన్ చుట్టూ అంచులు కూడా చాలా సన్నగా ఉండటంతో, చేతిలో పట్టుకుంటే లుక్ చాలా రిచ్‌గా ఉంటుంది.

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ:

Advertisement

ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందరినీ ఆకట్టుకునే విషయం ఏదైనా ఉందంటే అది దీని భారీ బ్యాటరీనే. ఏకంగా 7500mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. మళ్లీ రెండు రోజుల వరకు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. మరి ఇంత పెద్ద బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వడానికి టైమ్ పడుతుంది కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. దీనికోసం కంపెనీ 90W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇస్తోంది. దీనివల్ల చాలా తక్కువ టైమ్‌లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.

Also Read: బాబోయ్ మెటా క్రేజీ అప్డేట్.. గాల్లో వేళ్లు కదిలిస్తే చాలు మెసేజ్ టైప్ అయిపోద్ది, వాట్సప్, ఇన్‌స్టా యూజర్లు ఫుల్ ఖుషీ!

ఫోన్ వేడెక్కకుండా కూలింగ్ సిస్టమ్:

Advertisement

హెవీ గేమ్స్ ఆడేవారిని దృష్టిలో ఉంచుకుని ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ప్రాసెసర్‌ను వాడారు. దీనివల్ల పబ్‌జీ, బీజీఎమ్‌ఐ లాంటి హై-గ్రాఫిక్స్ గేమ్స్ కూడా ఎలాంటి బ్రేక్స్ లేకుండా చాలా స్పీడ్‌గా రన్ అవుతాయి. ఎంతసేపు ఆడినా ఫోన్ వేడెక్కకుండా ఉండటం కోసం ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్‌ను కూడా అమర్చారు. సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ ఓఎస్ 3.0తో పనిచేస్తుంది.

స్పెషల్ ఏఐ ఎడిట్ ఫీచర్లు:

ఫొటోల కోసం ఇందులో వెనుక వైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను ఇచ్చారు. దీనికి OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్ట్ ఉండటం వల్ల నైట్ టైం‌లో లేదా చేతులు కాస్త వణికినా కూడా ఫొటోలు, వీడియోలు చాలా క్లియర్‌గా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వీటికి తోడు ఫొటోలను ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి సూపర్ AI ఫీచర్లను కూడా జోడించారు.

Also Read: రూ.9 వేలకే 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే.. దిమ్మతిరిగే ఫీచర్లతో HMD కొత్త 5G ఫోన్!

 

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×