E-Paper
Advertisement

Remote Hacks: రిమోట్ పనిచేయనప్పుడు ఒక్కటి ఇస్తాం చూశారా.. దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే!

Remote Hacks: రిమోట్ పనిచేయనప్పుడు ఒక్కటి ఇస్తాం చూశారా.. దాని వెనుకున్న అసలు గుట్టు ఇదే!
Advertisement

Remote Hacks: ఇలాంటి పరిస్థితి చాలామందికి ఎదురయ్యే ఉంటుంది. టీవీలో ఏదైనా ఛానల్ పెట్టుకుందాం అని రిమోట్‌‌ను ఆపరేట్ చేస్తే.. అది కొన్నిసార్లు పనిచేయదు. అప్పుడు వందలో 90 శాతం మంది చేసే పనేంటంటే.. రిమోట్‌ను వెనక్కి తిప్పి అరచేత్తో గట్టిగా ఒక దెబ్బ వేయడం. విచిత్రం ఏంటంటే.. అలా కొట్టగానే అది మళ్లీ పర్ఫెక్ట్‌గా పనిచేయడం మొదలుపెడుతుంది. అబ్బా.. నా దెబ్బకి దారిలోకి వచ్చింది అని మనం మురిసిపోతాం. కానీ, అలా కొట్టగానే రిమోట్ పనిచేయం వెనుక ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ దాగి ఉంది. అదేంటంటే..

రిమోట్‌ను కొట్టగానే ఏం జరుగుతుంది?

నిజానికి రిమోట్‌లను ఎక్కువ కాలం వాడటం వల్ల వాటిలోని బ్యాటరీలకు, లోపల ఉండే మెటల్ స్ప్రింగ్‌లకు మధ్య గాలిలోని తేమ వల్ల ఆక్సిడేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీంతో అక్కడ ఒక సన్నని ఆక్సైడ్ పొర పేరుకుపోతుంది. ఈ పొర బ్యాటరీ నుంచి అందాల్సిన కరెంట్‌ను అడ్డుకుంటుంది. మనం ఎప్పుడైతే రిమోట్‌ను అరచేతితో తడతామో, ఆ ప్రకంపనలకు ఆ ఆక్సైడ్ పొర స్వల్పంగా కదులుతుంది. దీనివల్ల బ్యాటరీ పాయింట్లు మళ్లీ రిమోట్ సర్క్యూట్‌తో కలిసి కరెంట్ పాస్ అవుతుంది. దీంతో రిమోట్ పని చేయడం జరుగుతుంది.

Advertisement

Also Read: వార్నీ.. సోనీ హెడ్‌ఫోన్స్ ఇంత తక్కువ ధరకా? స్టాక్ అయిపోయేలోపే కొనేయండి బాస్!

బ్యాటరీలను ఎందుకు రుద్దుతారు?

కొంతమంది రిమోట్‌ను కొట్టకుండా బ్యాటరీలను తీసి చేతులతో గట్టిగా రుద్ది మళ్లీ పెడుతుంటారు. దీనినే రీసీటింగ్ అంటారు. ఇలా చేయడం వలన ఆ పాయింట్ల దగ్గర ఉన్న తుప్పు గానీ దుమ్ము గానీ పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాదు.. రుద్దడం వలన పుట్టే ఆ రాపిడి బలహీనపడిన బ్యాటరీకి చిన్నపాటి బూస్ట్‌లా పనిచేస్తుంది. రిమోట్ వంటి పరికరాలకు చాలా తక్కువ శక్తి అవసరం కాబట్టి.. అలా రుద్దడం వల్ల కూడా దాన్ని మళ్లీ పని చేసేలా చేస్తుంది.

ఈ టిప్స్ పాటిస్తే..

Advertisement

అయితే కోపంతో రిమోట్‌ను గట్టిగా కొట్టడం ఎప్పుడూ మంచిది కాదు. అలా చేయడం వల్ల లోపల ఉండే సెన్సర్లు, ప్లాస్టిక్ భాగాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. రిమోట్ మొరాయించినప్పుడు దాన్ని కొట్టే బదులు, బ్యాటరీలను ఒక్కసారి బయటకు తీసి లోపల ఉండే పాయింట్లను పొడి వస్త్రంతో శుభ్రం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఏసీ రిమోట్ లాంటివి సీజన్ అయిపోయాక వాడకుండా పక్కన పెట్టేటప్పుడు, బ్యాటరీలను తీసి ఉంచడం ద్వారా ఈ ఆక్సిడేషన్ సమస్యను నివారించవచ్చు.

Also Read: ఇండక్షన్ కంటే తోపు.. గ్యాస్ కంటే చౌక.. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ స్టవ్‌ గురించి తెలుసా?

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×