E-Paper
Advertisement

Rollme Vast Smartwatch: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 రోజులు నడిచే స్మార్ట్‌వాచ్.. భారీ సైజు, కర్వ్ డిస్‌ప్లే, వాటర్‌ప్రూఫ్ కూడా

Rollme Vast Smartwatch: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 రోజులు నడిచే స్మార్ట్‌వాచ్.. భారీ సైజు, కర్వ్ డిస్‌ప్లే, వాటర్‌ప్రూఫ్ కూడా
Advertisement

Rollme Vast Smartwatch| రోల్‌మి కంపెనీ కొత్త స్మార్ట్‌వాచ్ రోల్‌మి వ్యాస్ట్ ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ వాచ్ ప్రధానంగా ఎక్కువ బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, స్టైలిష్ డిజైన్‌పైనే ఎక్కువ ఫోకస్ చేసింది. రోజువారీ ఉపయోగం, ఫిట్‌నెస్, అవుట్‌డోర్ యాక్టివిటీలకు బాగా సరిపోతుంది.

కర్వ్డ్ డిస్‌ప్లే, స్టైలిష్ డిజైన్

Rollme Vastలో 1.83 అంగుళాల IPS డిస్‌ప్లే ఉంది. 3D కర్వ్డ్ డిజైన్‌తో ఆధునిక లుక్ ఇస్తుంది. స్లిమ్ బెజెల్స్ ఉండటంతో స్క్రీన్ చాలా స్పష్టంగా, అందంగా కనిపిస్తుంది. టచ్‌స్క్రీన్ రెస్పాన్స్ బాగుంది. చాలా వాచ్ ఫేస్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ ఫోటోను బ్యాక్‌గ్రౌండ్‌గా సెట్ చేసుకోవచ్చు. ఇలా వ్యక్తిగతంగా కస్టమైజ్ చేసుకోవచ్చు.

అడ్వాన్స్‌డ్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు

Advertisement

ఈ స్మార్ట్‌వాచ్ HX3918 సెన్సార్‌తో హెల్త్ ట్రాకింగ్ చేస్తుంది. రియల్ టైమ్‌లో హార్ట్ రేట్ నిరంతరం చూస్తుంది. హార్ట్ రేట్ అసాధారణంగా పెరిగితే అలర్ట్ ఇస్తుంది. బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ (SpO2) కూడా కొలుస్తుంది. స్లీప్ ట్రాకింగ్ చాలా బెటర్. డీప్ స్లీప్, లైట్ స్లీప్, స్లీప్ ప్యాటర్న్స్ విశ్లేషిస్తుంది. సమయానికి నిద్ర పోయే అలవాట్లు పెంపొందించడానికి సహాయపడుతుంది.

70 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్

రోల్‌మి వ్యాస్ట్‌లో 70+ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. రన్నింగ్, రోయింగ్, రాక్ క్లైంబింగ్ వంటి యాక్టివిటీలను ఆటోమాటిక్‌గా గుర్తిస్తుంది. వర్కౌట్ తర్వాత డీటెయిల్డ్ రిపోర్ట్ ఇస్తుంది. పర్‌ఫామెన్స్, గణాంకాలు చూపిస్తుంది. స్విమ్మింగ్ మోడ్‌లో స్ట్రోక్ రేట్, దూరం, SWOLF స్కోర్ కొలుస్తుంది. స్విమ్మర్లకు పర్‌ఫామెన్స్ మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది.

పూర్తి వాటర్‌ప్రూఫ్ డిజైన్

Advertisement

IP68 సర్టిఫికేషన్ ఉంది. నీరు, దుమ్ము రాకుండా పూర్తిగా రక్షణ ఇస్తుంది. స్విమ్మింగ్ చేసేటప్పుడు కూడా సేఫ్‌గా ధరించవచ్చు. చెమట, వర్షంలో కూడా సమస్య రాదు. అవుట్‌డోర్ స్పోర్ట్స్, రోజువారీ ఉపయోగానికి బాగుంటుంది.

పెద్ద బ్యాటరీ, స్మార్ట్ ఫీచర్లు

1000mAh పెద్ద బ్యాటరీ ఉంది. సాధారణ ఉపయోగంలో 40 రోజుల వరకు పనిచేస్తుంది (హార్ట్ రేట్, SpO2 మానిటరింగ్ ఆన్‌లో). స్టాండ్‌బై మోడ్‌లో 200 రోజుల వరకు లాస్ట్ అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇంత ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇచ్చే స్మార్ట్‌వాచ్‌లు చాలా తక్కువ. బ్లూటూత్ 5.4తో HD కాలింగ్ సపోర్ట్ ఉంది. వాచ్ నుంచే కాల్స్ అటెండ్ చేయవచ్చు. AI వాయిస్ అసిస్టెంట్‌తో వాయిస్ కమాండ్స్ ఇవ్వవచ్చు. షెడ్యూల్, అలారం, మ్యూజిక్ కంట్రోల్ సులభంగా చేయవచ్చు.

Also Read: గ్యాస్, కరెంట్ ఏదీ అవసరం లేకుండానే వంట చేసేయండి.. కొత్త స్టవ్ చూశారా?

ధర, లభ్యత

రోల్‌మి వ్యాస్ట్ కంపెనీ అఫీషియల్ స్టోర్‌లో లభిస్తోంది. బ్లాక్, సిల్వర్ కలర్లలో వస్తోంది. గ్లోబల్ ధర $29.99 (భారత కరెన్సీలో సుమారు రూ.2,800). ఈ తక్కువ ధరతో బడ్జెట్ స్మార్ట్‌వాచ్ కొనాలనుకునేవారికి చాలా ఆకర్షణీయ ఆప్షన్

ముఖ్య గమనిక: ఈ కథనంలో తెలియచేసిన స్మార్ట్‌వాచ్ ధరలు.. ఆయా కంపెనీ ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసే సమయంలో సరిగా పరిశీలించి తీసుకోవాలని సూచన. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదు.

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×