E-Paper
Advertisement

Samsung Galaxy A27లో బిగ్ ట్విస్ట్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50MP కెమెరాతో సాలిడ్ అప్‌గ్రేడ్స్!

Samsung Galaxy A27లో బిగ్ ట్విస్ట్.. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 50MP కెమెరాతో సాలిడ్ అప్‌గ్రేడ్స్!
Advertisement

Samsung Galaxy A27: శాంసంగ్ లవర్స్‌కు ఒక క్రేజీ అప్‌డేట్. మార్కెట్లోకి త్వరలోనే అడుగుపెట్టబోతున్న ‘శాంసంగ్ గెలాక్సీ A27’ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉండబోతోందనే లీకులు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. గత మోడల్ Galaxy A26తో పోలిస్తే ఈ కొత్త ఫోన్ ధర కాస్త గట్టిగానే ఉండేలా కనిపిస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ రోలాండ్ క్వాండ్ ఈ ధరల వివరాలను బయటపెట్టారు. మరి ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్ ధరలు, ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

భారీగా పెరగనున్న ధర:

తాజాగా లీకైన సమాచారం ప్రకారం.. శాంసంగ్ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో యూరప్ మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో 6GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు రూ.38,500 ఉండొచ్చు. అలాగే టాప్ ఎండ్ వేరియంట్ అయిన 8GB RAM+256GB స్టోరేజ్ ధరను రూ.48,400గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాది వచ్చిన A26 బేస్ వేరియంట్ ధర రూ.33,000 మాత్రమే ఉంది. అంటే ఈసారి సుమారు రూ.5500 వరకు ధర పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement

Also Read: అప్‌గ్రేడెడ్ ప్రాసెసర్, పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో వస్తోన్న Vivo X500.. పూర్తి వివరాలు మీ కోసం!

మెరుగైన పనితీరు:

ధర పెరిగినప్పటికీ దానికి తగ్గట్టుగానే అదిరిపోయే అప్‌గ్రేడ్స్‌ను శాంసంగ్ ఇస్తోంది. ఈ కొత్త ఫోన్‌లో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించబోతున్నారు. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ కోసం క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఇందులో వాడుతున్నారు. దీనికి తోడు శాంసంగ్ లేటెస్ట్ One UI సాఫ్ట్‌వేర్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాబట్టి.. గేమింగ్ ప్రియులకు, రోజువారీ పనులకు ఈ ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.

అద్భుతమైన కెమెరా సెటప్:

Advertisement

ఇక ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. ఇందులో వెనుక వైపు మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. OIS సపోర్ట్ ఉన్న 50MP మెయిన్ కెమెరాతో పాటు 5MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో కెమెరాలను అమర్చారు. ఓఐఎస్ ఫీచర్ వల్ల తక్కువ వెలుతురులోనూ, కదలికలు ఉన్నప్పుడు కూడా ఫొటోలు, వీడియోలు చాలా స్థిరంగా, స్పష్టంగా వస్తాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 12MP కెమెరాను అప్‌గ్రేడ్ చేశారు.

కలర్ ఆప్షన్స్, లాంచ్ వివరాలు:

మిడ్‌రేంజ్ ఫోన్లలో శాంసంగ్ ఎప్పుడూ బ్యాటరీ విషయంలో రాజీ పడదు. ఈ ఫోన్‌లో కూడా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీని ఇస్తోంది. కాబట్టి.. ఛార్జింగ్ త్వరగా ఎక్కడమే కాకుండా ఎక్కువ సేపు నడుస్తుంది కూడా. ఇప్పటికే మలేషియాకు చెందిన SIRIMతో పాటు అమెరికా రెగ్యులేటరీ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కనిపించింది. కొత్త మింట్ కలర్‌లో, ఫ్లాట్ స్క్రీన్, సన్నని బెజెల్స్‌తో రాబోతున్న ఈ ఫోన్ అధికారిక లాంచ్ డేట్ త్వరలోనే అనౌన్స్ కానుంది.

Also Read: బడ్జెట్ ఫోన్ల మార్కెట్‌లో వన్‌ప్లస్ సంచలనం.. తక్కువ ధరకే కొత్త స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్లు అదరహో!

Related News

బెడ్‌టైమ్ స్టోరీస్ కోసం మెటా కొత్త ప్రయత్నం.. ఈ StoryKit యాప్ ఎలా పనిచేస్తుందంటే?

బడ్జెట్ ధరలో బెస్ట్ ప్లాన్.. Vi రూ.479 రీఛార్జ్‌తో లభించే బెనిఫిట్స్ ఇవే!

వర్షాకాలంలో ACలో ఉన్న ఈ ఒక్క బటన్ ప్రెస్ చేస్తే.. ఉక్కపోత మాయం, కరెంట్ బిల్లు సగం!

ఆన్‌లైన్‌లో మీ డేటా సేఫ్ ఉండాలంటే.. ఈ 5 గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వండి!

ఓరి నాయనో.. నిజమా? కలా? Samsung Z Fold 7పై ఏకంగా రూ.75,000 దాకా తగ్గింపు!

టీవీ కొనాలనుకుంటున్నారా? Mini LED లేదా OLED.. ఏది బెస్ట్ ఆప్షన్?

మెటా యాప్స్‌లో మన డేటాను AI వాడకుండా ఎలా ఆపాలో తెలుసా?

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?

Big Stories

Advertisement
×