E-Paper
Advertisement

Samsung A37 5G: త్వరలో శామ్‌సంగ్ A37 5G లాంచ్.. ఇండియాలో ధర ఎంతో తెలుసా?

Samsung A37 5G: త్వరలో శామ్‌సంగ్ A37 5G లాంచ్.. ఇండియాలో ధర ఎంతో తెలుసా?
Advertisement

Samsung A37 5G: శామ్‌సంగ్ ప్రపంచ మొబైల్ మార్కెట్‌ని దశాబ్దాలుగా నడిపిస్తుaన్న ప్రముఖ టెక్నాలజీ బ్రాండ్. ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడళ్ల నుంచి సాధారణ వినియోగదారుల కోసం అందించే మిడ్ రేంజ్, బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ల వరకు ప్రతి సెగ్మెంట్‌లోనూ సామ్‌సంగ్ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ముఖ్యంగా డిస్‌ప్లే టెక్నాలజీ, కెమెరా క్వాలిటీ, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు, భద్రత పరంగా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నమ్మకం పొందిన మొబైల్ బ్రాండ్‌లలో శామ్‌సంగ్ ముందంజలో ఉండటం. శామ్‌సంగ్ వచ్చే ఏడాది మార్చి 2, 2026న మార్కెట్లోకి తీసుకురాబోతున్న గెలాక్సీ ఏ37 5జి మోడల్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. దీని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సూపర్ అమోలేడ్ స్క్రీన్ డిజైన్

Advertisement

ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల సూపర్ సూపర్ అమోలేడ్ స్క్రీన్ ప్రధానంగా ఆకర్షణీయంగా ఉంటుంది. 1080×2340 రిజల్యూషన్ విజువల్స్‌ను స్పష్టంగా చూపిస్తే, 120Hz రిఫ్రెష్‌రేట్ స్క్రీన్‌ను సాఫీగా అనిపించేలా చేస్తుంది. 2000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కారణంగా నేరుగా ఎండలో మొబైల్ ఉపయోగించినా స్క్రీన్ లోపల కనిపించే రంగులు తగ్గవు. పంచ్-హోల్ డిజైన్ వల్ల ఫోన్‌కు అప్‌డేటెడ్ లుక్ వస్తుంది, స్క్రీన్-టు-బాడీ రేషియో 86.5 శాతం ఉండటం మరింత పెద్ద డిస్‌ప్లే అనుభవాన్ని ఇస్తుంది. సోషల్ మీడియాలో స్క్రోలింగ్ నుంచి గేమింగ్ వరకు ప్రతి వినియోగం ఈ పెద్ద అమోలేడ్ స్క్రీన్‌లో ప్రత్యేక అనుభవం కావడం ఖాయం.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌

Advertisement

పెర్‌ఫార్మెన్స్ వస్తే, శామ్‌సంగ్ ఈసారి క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌ను అందిస్తోంది. కార్టెక్స్-ఏ720, కార్టెక్స్-ఏ520 కోర్‌లు కలసి రోజువారీ పనుల్లో తగినంత వేగంగా పనిచేస్తాయి. యాప్‌లు ఓపెన్ చేయడం, ఒకేసారి అనేక టాస్కులు చేయడం, వీడియోలు ఎడిట్ చేయడం, అంతేకాకుండా భారీ యాప్‌లను హ్యాండిల్ చేయడంలో ఈ చిప్‌సెట్ స్మూత్ అనుభవం ఇస్తుంది. అడ్రినో జిపియూ వల్ల గేమింగ్ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతుంది. 8జిబి ర్యామ్ , 128జిబి స్టోరేజ్ వల్ల యాప్‌ల స్థలం, ఫోటోలు, వీడియోలకు తగినంత స్థలం లభిస్తుంది.

50ఎంపి ప్రధాన కెమెరా

కెమెరా సామర్థ్యం వినియోగదారులు ఎక్కువగా ఆశించే అంశం. ఈ ఫోన్‌లో 50ఎంపి ప్రధాన కెమెరా సహజమైన రంగులను, స్పష్టమైన ఫోటోలను అందిస్తుంది. లైటింగ్ తక్కువగా ఉన్న సమయంలో కూడా మంచి డీటైల్ కనిపిస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజషన్ అందుబాటులో ఉండడం వల్ల కదిలే సమయంలో తీసిన ఫోటోలు బ్లర్ కాకుండా ఉంటాయి. 12ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ల్యాండ్‌స్కేప్ దృశ్యాల్లో మరింత వెడల్పు ఇస్తుంది. అదనంగా ఇచ్చిన 8ఎంపి సెన్సర్ క్లోజ్‌అప్ షాట్లలో సహకరించి ఫోటోల క్లారిటీని అందిస్తుంది. ఫ్రంట్‌లో 16ఎంపి కెమెరా ఉండటం వల్ల సెల్ఫీలు స్పష్టంగా వస్తాయి. రియర్, ఫ్రంట్ కెమెరా రెండింటిలోనూ 4కె వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉండటం సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేసే వారికి పెద్ద ప్రయోజనం.

Also Read: Infinix Hot 40 Pro 6G Phone: ఇన్‌ఫినిక్స్ హాట్ 40 ప్రో 6G 2026.. నెక్ట్స్ జెన్ టెక్నాలజీతో మార్కెట్‌లో సరికొత్త లుక్

5500mAh కెపాసిటీ బ్యాటరీ

బ్యాటరీ పనితనం ఏ37 5జిలో మరింత మెరుగ్గా ఉంటుంది. 5500mAh కెపాసిటీ ఉన్నందువల్ల ఉదయం నుండి రాత్రి వరకు భారమైన వినియోగం ఉన్నా కూడా బ్యాటరీ నిలుస్తుంది. గేమింగ్, స్ట్రీమింగ్ చేసినా ఫోన్ త్వరగా బ్యాటరీ తగ్గిపోదు. పైగా 45W ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల తక్కువ సమయంలో ఎక్కువ శాతం ఛార్జ్ అవుతుంది. వేగంగా బయటకు వెళ్లాల్సిన సందర్భాల్లో కూడా ఫోన్ ఛార్జ్ కావడానికి ఎక్కువ సమయం పడకుండా ఉండటం వినియోగదారులకు పెద్ద సౌలభ్యం.

ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

భద్రత విషయానికొస్తే, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వేగంగా స్పందిస్తుంది. ఫేస్ అన్‌లాక్ కూడా సెకన్లలో పనిచేస్తుంది. యాక్సిలెరోమీటర్, గైరో, లైట్ సెన్సె, వర్చ్యువల్ ప్రాక్సిమిటీ వంటి సెన్సర్లు కలిసి ఫోన్‌ను రోజువారీ వినియోగంలో మరింత తెలివిగా పనిచేసేలా చేస్తాయి. చేతిలో పట్టుకున్న తీరు, కదలికలు, వెలుతురు మార్పులు, చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు స్క్రీన్ ఎలా స్పందించాలి అనే వివరాలను ఈ సెన్సర్లు గుర్తించి ఫోన్ పనితీరును సాఫీగా, సహజంగా మార్చుతాయి. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఉండటం వినియోగదారులు కోరుకునే ఒక ముఖ్యమైన అంశం.

5జి సపోర్ట్‌తో  కనెక్టివిటీ

కనెక్టివిటీ పరంగా చూస్తే 5జి సపోర్ట్, వోల్ట్, ఎన్ఎఫ్‌సి, వైఫై హాట్‌స్పాట్, బ్లూటూత్ 5.4 అన్నీ ఇవి భవిష్యత్ సంవత్సరాల ఉపయోగానికి తగిన ఆప్షన్లే. యూఎస్‌బి-సి v2.0 వల్ల డేటా ట్రాన్స్‌ఫర్, ఛార్జింగ్ రెండూ వేగంగా సాగుతాయి. సాఫ్ట్‌వేర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16పై వన్ యూఐ 8తో వస్తుంది. దీని వలన సులభమైన లేఅవుట్లు, మల్టీటాస్కింగ్‌కు సహకరించే ఇంటర్‌ఫేస్, బ్యాటరీ ఆప్టిమైజేషన్ అన్నీ కలిపి వినియోగ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తాయి.

ఇండియాలో ధర ఎంతంటే?

భారత మార్కెట్లో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ37 5జి ధర విషయంలో లీకులు చెప్పిన సమాచారం ప్రకారం ప్రారంభ ధర రూ.27,999 నుంచి ఉండొచ్చని టాక్ కొనుగోలు సమయంలో సాధారణంగా శామ్‌సంగ్ ఫోన్లపై వచ్చే బ్యాంక్ కార్డ్ డిస్కౌంట్లు, ఈఎంఐ బెనిఫిట్స్, అలాగే ఊల్డ్ ఫోన్ ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా వర్తించే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు చేసే ముందు చెక్ చేస్తే మంచి ప్రయోజనం పొందవచ్చు. ధర పరంగా సరిగ్గా నిర్ణయిస్తే ఈ ఫోన్ మిడ్ రేంజ్‌లో అమ్మకాలు రికార్డులు సృష్టించే అవకాశమే ఎక్కువ.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×