Samsung Galaxy A57 5G: మరికొద్ది రోజుల్లో ప్రముఖ టెక్ సంస్థ శాంసంగ్ నుంచి కొత్త మిడ్‌రేంజ్ 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది. గతేడాది విడుదలైన గెలాక్సీ A56కి కొనసాగింపుగా వస్తున్న ఈ ‘Samsung Galaxy A57 5G’ ఫోన్ తాజాగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) సర్టిఫికేషన్ పొందింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలో భారత మార్కెట్‌లో విక్రయానికి రానుందని కన్ఫర్మ్ అయ్యింది. ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే..
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జాబితాలో SM-A576B/DS అనే మోడల్ నంబర్‌తో Samsung Galaxy A57 5G ఇటీవలే ఆమోదం పొందింది. దీనిలో డీఎస్ సఫిక్స్ డ్యుయల్ సిమ్ సపోర్ట్‌కు సూచనగా ఉంది. మార్కెటింగ్ పేరు BISలో వెల్లడించనప్పటికీ.. శాంసంగ్ మోడల్ నెంబరింగ్ ప్యాటర్న్ ప్రకారం ఇది Galaxy A57 5Gగా విడుదలయ్యే అవకాశం మాత్రం బలంగా కనిపిస్తోంది.
సాధారణంగా BIS సర్టిఫికేషన్ అంటే.. స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ చాలా దగ్గరలో ఉందన్న సూచనలు ఇస్తున్నట్టే. అలాగే తాజా నివేదికల ప్రకారం.. గెలాక్సీ A57 5Gను 2026 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉందని, ఇది Galaxy S26 సిరీస్‌తో పాటు లేదా దాని తర్వాత విడుదల కావచ్చని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో నివేదిక ప్రకారం.. గెలాక్సీ A57తో పాటు Galaxy A37 మోడల్ కూడా ఒకేసారి మార్కెట్‌లోకి కావొచ్చని లీక్స్ సూచిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లలో మెరుగైన కెమెరా, డిస్‌ప్లే హార్డ్‌వేర్ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
Samsung Galaxy A57 5G స్మార్ట్‌ఫోన్‌లో Exynos 1680 చిప్‌సెట్, Xclipse 550 GPU ఉంటుందని సమాచారం. అలాగే ఈ ఫోన్ Android 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
ఈ శాంసంగ్ గెలాక్సీ A57 5Gలో 2GB RAM.. అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ స్పెసిఫికేషన్లు చూస్తే.. ఇది హై-టియర్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్ ఫోన్‌గా నిపుణులు భావిస్తున్నారు.
ఇకపోతే Galaxy A57లో ఫ్లెక్సిబుల్ AMOLED డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. శాంంసంగ్ డిస్‌ప్లేకు తోడు TCL CSOTను రెండో డిస్‌ప్లే సరఫరాదారుగా చేర్చనున్నట్లు సమాచారం. దీంతో బెజెల్స్ మరింత సన్నగా ఉండే అవకాశం ఉండటంతో పాటు ధర కూడా తక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ A57 5Gలో 50MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 5MP మ్యాక్రో కెమెరా ఉండనుంది. అదనంగా 12MP ఫ్రంట్ కెమెరాను కూడా అమర్చారని లీక్స్ చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే.. ఈ శాంసంగ్ గెలాక్సీ A57 5G భారత మార్కెట్‌లో మిడ్‌రేంజ్ విభాగంలో కీలకమైన ఫోన్‌గా నిలవనుంది. అయితే.. శాంసంగ్ నుంచి ఇప్పటి వరకు విడుదల తేదీ గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.